రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని 18 జిల్లాల పరిధిలో నాలుగు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం..


ప్రస్తుత భారతీయ రైల్వే నెట్వర్క్‌లో దాదాపు 894 కి.మీ పెరుగుదల

2030-31 నాటికల్లా పూర్తవనున్న ఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ. 24,634 కోట్లు

Posted On: 07 OCT 2025 3:11PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నాలుగు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటి మొత్తం వ్యయం రూ. 24,634 కోట్లు (దాదాపు). 

ఈ ప్రాజెక్టులు:

  1. వార్ధా - భూసావాల్ - 3 , 4వ లైన్ - 314 కిలోమీటర్లు (మహారాష్ట్ర)

  2. గోండియా - డోంగర్‌గఢ్ నాలుగో లైన్ - 84 కిలోమీటర్లు (మహారాష్ట్రఛత్తీస్‌గఢ్)

  3. వడోదర - రత్లాం మూడోనాలుగో లైన్ - 259 కిలోమీటర్లు (గుజరాత్మధ్యప్రదేశ్)

  4. ఇటార్సీ - భోపాల్ -  బీనా నాలుగో లైన్ – 237 కిలోమీటర్లు (మధ్య ప్రదేశ్)

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్గుజరాత్ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని 18 జిల్లాల పరిధిలో ఉన్న ఈ నాలుగు ప్రాజెక్టుల ద్వారా ప్రస్తుతమున్న భారతీయ రైల్వే నెట్వర్క్ 894 కి.మీ మేర పెరగనుంది.

ఆమోదం పొందిన ఈ మల్టీట్రాకింగ్ ప్రాజెక్టు వల్ల దాదాపు 85.84 లక్షల జనాభా ఉన్న 3,633 గ్రామాలకురెండు ఆకాంక్షాత్మక జిల్లాలకు (విదిషారాజ్‌నంద్‌గావ్రవాణా సదుపాయం మెరుగుపడుతుంది.

ఈ మార్గంలో సామర్థ్యం పెరగడం వల్ల రవాణా గణనీయంగా మెరుగుపడుతుంది. తద్వారా భారతీయ రైల్వేల పనితీరు మరింత సమర్థంగా మారడంతోపాటు సేవల్లో విశ్వసనీయత ఏర్పడుతుందిఈ మల్టీట్రాకింగ్ ప్రతిపాదనలు కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంతోపాటు రద్దీని తగ్గించబోతున్నాయిసమగ్రాభివృద్ధి ద్వారా ఈ ప్రాంత ప్రజల్లో ఆత్మనిర్భరతను నింపాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవభారత లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టులను రూపొందించారుఇవి వారి ఉపాధిస్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయి.

సమీకృత ప్రణాళిక, భాగస్వాముల మధ్య సంప్రదింపుల ద్వారా బహువిధ రవాణాలాజిస్టిక్ సామర్థ్యాన్ని పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తూ.. ప్రధానమంత్రి గతి శక్తి జాతీయ బృహత్ప్రణాళిక ద్వారా ఈ ప్రాజెక్టులకు ప్రణాళికలను రూపొందించారుఅంతరాయం లేకుండా ప్రజలువస్తుసేవల సరఫరాకు ఈ ప్రాజెక్టులు అవకాశాన్ని అందిస్తాయి.

సాంచీ, సాత్పురా టైగర్ రిజర్వ్భీంబెట్కా గుహావాసాలుహజారా జలపాతాలునవేగావ్ జాతీయ పార్కు వంటి ప్రముఖ సందర్శక ప్రదేశాలకు ఈ ప్రాజెక్టులో విభాగం రైలు ప్రయాణ సదుపాయాన్ని అందిస్తుందిఇది దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది.

బొగ్గు, కంటైనర్సిమెంట్ఫ్లై యాష్ఆహార ధాన్యాలుఉక్కు మొదలైన వస్తువుల రవాణాకు ఇదొక ముఖ్యమైన మార్గంసామర్థ్యాభివృద్ధి పనుల ఫలితంగా ఏడాదికి 78 మిలియన్ టన్నుల మేర అదనపు సరుకు రవాణా జరుగుతుందిపర్యావరణ హితతక్కువ ఇంధనంతో ఎక్కువ రవాణా సదుపాయాన్ని అందించగల రైల్వేలు.. పర్యావరణ లక్ష్యాలను సాధించడానికే కాకుండా దేశ రవాణా వ్యయాన్నిచమురు దిగుమతులను (28 కోట్ల లీటర్లు), కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంలో (139 కోట్ల కేజీలుదోహదపడతాయిఈ ఉద్గారాల తగ్గింపు కోట్ల మొక్కలు నాటడంతో సమానం.

 

*** 


(Release ID: 2175866) Visitor Counter : 12