వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2030 నాటికి భారత్-ఖతార్ ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్


దోహలో జరిగిన జాయింట్ బిజినెస్ కౌన్సిల్ (జేబీసీ)లో ప్రసంగించిన భారత్, ఖతార్ వాణిజ్య మంత్రులు

Posted On: 06 OCT 2025 9:54PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్యపరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అక్టోబర్ నుంచి 7వ తేదీ వరకూ ఖతార్ లోని దోహలో అధికారిక పర్యటనలో ఉన్నారుఈ సందర్భంగా ఖతార్ వాణిజ్యపరిశ్రమల మంత్రి హెచ్ ఈ షేక్ ఫైసల్ బిన్ థాని బిన్ ఫైసల్ అల్ థానితో కలిసి భారత్-ఖతార్ ఆర్థికవాణిజ్య సహకారంపై సంయుక్త వాణిజ్య సమావేశానికి సహాధ్యక్షుడిగా వ్యవహరించారు.

 

తొలిరోజు పర్యటనలో భాగంగా దోహాలోని భారత రాయబార కార్యాలయం వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారుఅనంతరం 'ఏక్ పేడ్ మా కే నామ్కార్యక్రమంలో భాగంగా ఒక మొక్కను నాటారుఇది సుస్థిరతపర్యావరణ పరిరక్షణకు భారతదేశం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది.

 

ద్వైపాక్షిక సమావేశంలో ఇరుదేశాల వాణిజ్యపరిశ్రమల మంత్రులు.. వాణిజ్యఆర్థిక సంబంధాలను సమీక్షించారుప్రస్తుత వాణిజ్య సమస్యలు ఆర్థికవ్యవసాయఆరోగ్య సంరక్షణ రంగాల్లో సహకారానికి నూతన విధానాలపై చర్చించారు.

 

భారత్-ఖతార్ జాయింట్ బిజినెస్ కౌన్సిల్ (జేబీసీ)లో ఇరు దేశాల మంత్రులతో పాటు ఎఫ్ఐసీసీఐసీఐఐఅసోచామ్ సీనియర్ అధికారులుఖతార్ ఛాంబర్ఇరు దేశాలకు చెందిన వాణిజ్య ప్రముఖులు పాల్గొన్నారుప్రపంచ ఆర్థిక ప్రతికూలతలువస్తు సరఫరా వ్యవస్థలో అవాంతరాలున్నప్పటికీ భారతదేశం బలమైన ఆర్థిక స్థిరత్వాన్ని ప్రదర్శిస్తోందని భారత వాణిజ్యపరిశ్రమల శాఖ మంత్రి స్పష్టం చేశారుఇది స్టార్టప్ వ్యవస్థకు అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తూఅంతర్జాతీయ స్థాయి వాణిజ్యానికి మెరుగైన అవకాశాలను కల్పిస్తుందన్నారుఈ క్రమంలో భారత్ఖతార్ వాణిజ్యం మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు.

 

ఖతార్ వాణిజ్యపరిశ్రమల మంత్రి హెచ్ ఈ షేక్ ఫైసల్ బిన్ థాని బిన్ ఫైసల్ అల్ థానితో కలిసి భారత్-ఖతార్ ఆర్థికవాణిజ్య సహకారంపై సంయుక్త సంఘ సమావేశానికి కేంద్రమంత్రి సహాధ్యక్షత వహించారుఈ సందర్భంగా ద్వైపాక్షిక వాణిజ్యంపెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయటంప్రస్తుత వాణిజ్యంపన్నుయేతర సవాళ్లుకీలక రంగాల్లో ఆర్థిక సహకారం పెంపుదలకు నూతనావకాశాలను గుర్తించటం వంటి అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించారుభారత్-ఖతార్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం పట్ల ఇరుదేశాలు తమ నిబద్ధతను తెలిపాయిఖతార్ నుంచి ఇంధన ఎగుమతులు, 2028 నుంచి ఏటా 7.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్ జీ సరఫరా ఒప్పందాన్ని ప్రశంసించిన శ్రీ పీయూష్ గోయల్ఖతార్ కు భారత్ నుంచి ఎగుమతులను పెంచాలన్నారుద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 14 బిలియన్ డాలర్లు ఉందని, 2030 నాటికి దాన్ని రెట్టింపు చేసే సామర్థ్యం ఇరుదేశాలకు ఉందన్నారుఎలక్ట్రానిక్స్ఆటోమొబైల్స్ఫార్మాస్యూటికల్స్ప్రాసెస్డ్ ఫుడ్టెక్స్‌టైల్స్రత్నాలుఆభరణాలుఐటీఅభివృద్ధి చెందుతున్న హై-టెక్ పరిశ్రమలుసౌరశక్తి వంటి ఆశాజనక రంగాలున్నాయని ఇరుదేశాల నేతలు గుర్తించారుమెరుగైన వ్యాపార అవకాశాల ప్రాముఖ్యతఆర్థిక సంబంధాలను పెంపొందించటంలో మొదటి జాయింట్ బిజినెస్ కౌన్సిల్ సమావేశం విజయవంతమైందని కేంద్రమంత్రి తెలిపారు.

 

జాయింట్ బిజినెస్ కౌన్సిల్ సందర్భంగా ఖతార్ సీనియర్ నాయకులుకార్పొరేట్ నేతలతో మంత్రి శ్రీ గోయల్ ఉన్నతస్థాయి వాణిజ్య సమావేశాలను నిర్వహించారుదీని ద్వారా భారత్ఖతార్ సంస్థల మధ్య పెట్టుబడులుసాంకేతిక భాగస్వామ్యంజాయింట్ వెంచర్లపై చర్చించే అవకాశం లభించిందిపెర్ల్ ఐలాండ్ లోని లులూ మాల్ లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి పాల్గొనటం.. ఖతార్ తో భారత్ డిజిటల్ సహకారంలో కీలక పాత్రను సూచిస్తుందిఖతార్ లోని భారతీయులకుస్థానిక వినియోగదారులకు డిజిటల్ లావాదేవీలను సులభతరం చేస్తుంది.

 

భారత్-ఖతార్ సంబంధాలను బలోపేతం చేస్తున్న ప్రవాస భారతీయులను కేంద్ర వాణిజ్యపరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అభినందించారుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీఖతార్ అమీర్ నాయకత్వంలో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయన్నారువ్యూహాత్మక భాగస్వామ్యం పెంపు, 2030 నాటికి వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాల ప్రాముఖ్యతను తెలిపారుఖతార్ అభివృద్ధికి ప్రవాస భారతీయులు అందిస్తున్న సేవలనుపెరుగుతున్న భారత ఆర్థిక శక్తిని ఆయన అభినందించారుప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని, 2047 నాటికి వికసిత్ భారత్ గా మారుతుందని ఆయన స్పష్టం చేశారుసమ్మిళిత్వంఆవిష్కరణప్రపంచ సహకారానికి కట్టుబడి ఉన్నామనీఇరుదేశాల మధ్య వారధిగాభారత అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవటంలో కీలక భాగస్వాములుగా కొనసాగాలని ప్రవాస భారతీయులను కేంద్రమంత్రి కోరారు.

 

***


(Release ID: 2175839) Visitor Counter : 18