ఉప రాష్ట్రపతి సచివాలయం
జైపూర్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతులకు ఉపరాష్ట్రపతి సంతాపం
Posted On:
06 OCT 2025 2:41PM by PIB Hyderabad
రాజస్థాన్‌లోని జైపూర్లో ఓ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటనలో సంభవించిన ప్రాణనష్టం పట్ల ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో శ్రీ సీపీ రాధాకృష్ణన్ ఇలా పేర్కొన్నారు:
‘‘రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ఓ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల ప్రాణనష్టం సంభవించడం దిగ్భ్రాంతి కలిగించింది. బాధిత కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ధైర్యం చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.’’
(Release ID: 2175331)
Visitor Counter : 8