సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలోనే మొట్టమొదటి సహకార మల్టీ-ఫీడ్ కంప్రెస్డ్ బయోగాస్ ప్లాంట్‌ను మహారాష్ట్ర అహల్యానగర్ లోని కోపర్‌గావ్‌లో ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా


భారతదేశ సహకార చక్కెర కర్మాగారాల చరిత్రలో మొట్టమొదటిసారిగా, మహర్షి శంకర్రావ్ కోల్హే సహకార చక్కెర కర్మాగారంలో ప్రారంభమవుతున్న కంప్రెస్డ్ బయోగాస్ (సీబీజీ) ప్లాంట్, పొటాష్ గ్రాన్యూల్ ఉత్పత్తి యూనిట్
భారతదేశ మొట్టమొదటి సహకార కంప్రెస్డ్ బయోగాస్ ప్లాంట్ లో రోజూ 12 టన్నుల సీబీజీ, బెల్లం నుంచి 75 టన్నుల పొటాష్‌ ఉత్పత్తి - విదేశాల నుంచి తగ్గనున్న దిగుమతి

సహకార చక్కెర కర్మాగారాల ఆవిర్భావ కేంద్రం మహారాష్ట్ర: చక్కెర కర్మాగారాలకు 100 శాతం వనరులు వృధా గాకుండా తిరిగి వినియోగించే చక్రీయ ఆర్థిక వ్యవస్థ (సర్క్యులర్ ఎకానమీ) అమలు ఇక్కడి నుంచే ప్రారంభం
వనరులు వృధా గాకుండా తిరిగి వినియోగించే ఈ ఆర్థిక వ్యవస్థకు మహర్షి శంకర్రావ్ కోల్హే సహకార చక్కెర కర్మాగారం ఆదర్శవంతమైన ఉదాహరణ.

జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ - ఎన్సీడీసీ) సహాయంతో కంప్రెస్డ్ బయోగాస్ ప్లాంట్లు, పొటాష్ గ్రాన్యూల్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటు కోసం ఎంపిక చేసిన 15 చక్కెర కర్మాగారాలకు మోదీ ప్రభుత్వం పూర్తి మద్దతు

చక్కెర కర్మాగారాలన్నీ పండ్ల ప్రాసెసింగ్‌ను కూడా చేపడితే పండ్ల సాగుకు ప్రోత్సాహం లభిం

Posted On: 05 OCT 2025 7:23PM by PIB Hyderabad

మహారాష్ట్రలోని అహల్యనగర్ జిల్లా కోపర్‌గావ్‌లో దేశంలోనే మొట్టమొదటి సహకార మల్టీ-ఫీడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్‌ను కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు శ్రీ ఏక్‌నాథ్ షిండే, శ్రీ అజిత్ పవార్, కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మోహోల్, పలువురు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

CR3_6518 copy.jpg



శ్రీ అమిత్ షా మాట్లాడుతూ, భారతదేశ సహకార చక్కెర కర్మాగారాల  చరిత్రలో మొట్టమొదటిసారిగా, మహర్షి శంకర్రావు కోల్హే సహకార చక్కెర కర్మాగారంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్,  పొటాష్ గ్రాన్యూల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. ఒక కొత్త చొరవ కింద, రాబోయే రోజుల్లో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) సహాయంతో ఈ రెండు ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి ఎంపిక చేసిన 15 చక్కెర మిల్లులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ కొత్త ప్రారంభం రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న చక్కెర మిల్లులకు ఒక కొత్త మార్గాన్ని సుగమం చేస్తుందని ఆయన అన్నారు.

దేశంలోని  రైతుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ అమిత్ షా అన్నారు. అక్టోబర్ 1న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత కోసం మిషన్’ను ప్రారంభించారని, దీని కింద రాబోయే ఆరేళ్లలో పప్పుధాన్యాల రంగంలో భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి రూ. 11,340 కోట్లు ఖర్చు చేస్తారని ఆయన పేర్కొన్నారు. కంది, మినుములు, ఎర్ర కందిపప్పులను పండించే రైతులు భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్),  భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్సీసీఎఫ్) లలో నమోదు చేసుకుంటే భారత ప్రభుత్వం వారి మొత్తం పప్పుధాన్యాల పంటను కనీస మద్దతు ధరకు (ఎంఎస్పీ) కొనుగోలు చేస్తుందని శ్రీ షా తెలిపారు. మహారాష్ట్రలోని రైతులకు కూడా ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. దేశవ్యాప్తంగా రెండు కోట్లమంది రైతుల నుంచి 100 శాతం కనీస మద్దతు ధరకు పప్పుధాన్యాలను కొనుగోలు చేస్తారని ఆయన తెలిపారు. అంతేకాకుండా 1,000 ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడంతోపాటు 38 లక్షల నాణ్యమైన విత్తన కిట్లను పంపిణీ చేస్తారు.

CR3_6020.JPG


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎర్ర కందిపప్పు క్వింటాల్‌కు రూ. 300, ఆవాలకు రూ. 250, శనగలకు రూ. 225, బార్లీకి రూ. 175, గోధుమలకు రూ. 160 కనీస మద్దతు ధరను పెంచినట్టు శ్రీ అమిత్ షా తెలిపారు. గత 11 ఏళ్లలో మోదీజీ నాయకత్వంలో జొన్నలకు కనీస మద్దతు ధర రెండున్నర రెట్లు, సజ్జలకు రెండున్నర రెట్లు, కందికి 100 శాతం, పెసలకు 100 శాతం, సోయాబీన్‌కు రెట్టింపు, పత్తికి రెట్టింపు కనీస మద్దతు ధర పెరిగిందని ఆయన తెలిపారు.
ఇటీవలి జీఎస్టీ సంస్కరణల కింద, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రైతులు ఉపయోగించే పలు వస్తువులపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. వీటిలో ట్రాక్టర్లు, ట్రాక్టర్ భాగాలు, హార్వెస్టర్లు, థ్రెషర్లు, స్ప్రింక్లర్లు, బిందు సేద్యం వ్యవస్థలు, కోళ్ల పరిశ్రమ, తేనెటీగల పెంపకానికి సంబంధించిన యంత్రపరికరాలు ఉన్నాయి.అంతేకాకుండా, సేంద్రీయ పురుగుమందులు, సహజ మెంథాల్‌పై కూడా జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. ఇది లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
భారతదేశ మొట్టమొదటి సహకార కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్‌ను ఈ రోజు ప్రారంభించినట్టు శ్రీ అమిత్ షా తెలిపారు. ఈ ప్రాజెక్టుపై సుమారు రూ. 55 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఈ సీబీజీ  ప్లాంట్ బెల్లం/మోలాసెస్ నుంచి న ప్రతిరోజూ 12 టన్నుల సీబీజీని, 75 టన్నుల పొటాష్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఉత్పత్తులను ప్రస్తుతం విదేశాల నుంచి  దిగుమతి చేసుకుంటున్నామని, ఈ ప్లాంట్ ప్రారంభంతో ఈ దిగుమతులను ఆపడానికి వీలు కల్పిస్తుందని, స్వావలంబన భారత్ దిశగా ఒక అడుగు ముందుకు వేయడానికి ఇది దోహదపడుతుందని ఆయన అన్నారు.
మహర్షి శంకర్రావు కోల్హే సహకార చక్కెర కర్మాగారం వనరులు వృధా కాకుండా తిరిగి వినియోగించే చక్రీయ ఆర్థిక వ్యవస్థ (సర్క్యులర్ ఎకానమీ) కు ఒక ఆదర్శవంతమైన ఉదాహరణగా నిలిచిందని శ్రీ అమిత్ షా అన్నారు. ఇథనాల్ ప్లాంట్లను బహుముఖంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. సహకార చక్కెర కర్మాగారాలు మహారాష్ట్రలోనే ఉద్భవించాయని, చక్కెర కర్మాగారాల కోసం 100 శాతం చక్రీయ ఆర్థిక వ్యవస్థను అమలు చేసే ప్రక్రియ ఇక్కడి నుంచే ప్రారంభమవుతోందని శ్రీ షా పేర్కొన్నారు. ఈ ప్రయత్నంలో సహకరించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన శ్రీ అమిత్ షా, ఇందుకు భారత ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుందని  హామీ ఇచ్చారు. మహర్షి శంకర్రావు కోల్హే సహకార చక్కెర కర్మాగారం నెలకొల్పిన ఉదాహరణ మహారాష్ట్రలోని అన్ని చక్కెర మిల్లులకు ఒక నమూనాగా ఉపయోగపడాలని ఆయన పేర్కొన్నారు. అక్కడ అమలు జరిగితే భవిష్యత్తులో చక్కెర మిల్లుల నిర్వహణలో గణనీయమైన ప్రయోజనాలకు దారితీస్తుందని ఆయన అన్నారు. భారతదేశ మొట్టమొదటి చెరకు ఆధారిత ఇథనాల్ ప్లాంట్‌ను ఇక్కడ ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా శ్రీ షా ప్రస్తావించారు. ప్రతి లాభదాయకమైన చక్కెర కర్మాగారం పండ్ల ప్రాసెసింగ్‌ను కూడా చేపట్టాలని, ఇది పండ్ల సాగును ప్రోత్సహించడంతో పాటు చక్కెర కర్మాగారాల లాభదాయకతను పెంచుతుందని ఆయన తెలిపారు.

CR5_3032.JPG


హరిత ఇంధనం, సుస్థిరత రంగాలలో సంజీవని గ్రూప్ అనేక ముఖ్యమైన కార్యక్రమాలను చేపట్టిందని, మహిళా స్వయం సహాయ బృందాల సాధికారతకు కృషి చేసిందని ఆయన అన్నారు. దీంతో పాటు, 100 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పిఏసీలు) ను ఏకీకృతం చేసిందని,1,000 మంది రైతుల కోసం మత్స్య పరిశ్రమను ప్రారంభించిందని, 20,000 మంది విద్యార్థుల కోసం సంజీవని విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. భారతదేశ మొట్టమొదటి గ్రామీణ కాల్ సెంటర్‌ను కూడా ఇక్కడే ఏర్పాటు చేశారని, దీనివల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు లభించాయని ఆయన తెలిపారు.

 

CR5_2981.JPG


కేంద్రంలో సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త జీవం పోశారని శ్రీ అమిత్ షా అన్నారు. సహకార రంగ భవిష్యత్తుపై నెలకొన్న సందేహాలు, అనిశ్చితులు గత మూడేళ్లుగా పూర్తిగా తొలగిపోయాయని ఆయన అన్నారు. ఈ రోజు, సహకార రంగం దేశానికి బలమైన ఆధారంగా మారుతోందని, ఇది మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.
స్వదేశీ ఉత్పత్తులనే వాడాలని దేశప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ప్రస్తావిస్తూ, 140 కోట్ల మంది భారత పౌరులు, దేశంలోని వ్యాపారులూ విదేశీ వస్తువులను వాడబోమని, వ్యాపారం చేయబోమని సంకల్పం తీసుకుంటే, 140 కోట్ల మంది పౌరుల కొనుగోలు శక్తి మన ఆర్థిక వ్యవస్థకు అపూర్వమైన ఊతాన్ని ఇస్తుందని ప్రధాని మోదీ చెప్పారని ఆయన తెలిపారు. ప్రధాని శ్రీ మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను 11వ స్థానం నుంచి నాలుగో స్థానానికి చేర్చారని, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు చేరేందుకు చాలా దగ్గరలో ఉన్నామని శ్రీ అమిత్ షా అన్నారు. అయితే, ప్రపంచంలో అగ్రస్థానాన్ని సాధించాలంటే స్వదేశీని స్వీకరించడం తప్ప మరో మార్గం లేదని,  దేశంలోని ప్రతి పౌరుడు స్వదేశీ ఉత్పత్తులను స్వీకరించాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరు మీద ఒక చెట్టు, భూమాత పేరు మీద ఒక చెట్టు నాటాలని ప్రతిజ్ఞ చేయాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ప్రస్తావిస్తూ రాబోయే కాలంలో వాతావరణ మార్పు, గ్లోబల్ వార్మింగ్ వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో ఇది ఎంతగానో సహాయపడుతుందని శ్రీ అమిత్ షా అన్నారు.

 

****


(Release ID: 2175206) Visitor Counter : 29