లోక్‌సభ సచివాలయం
68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో (సీపీసీ) భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించనున్న లోక్‌సభ స్పీకర్
2025 అక్టోబర్ 5 నుంచి 12 వరకు బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరగనున్న 68వ సీపీసీ
ఈ సదస్సుకు హాజరుకానున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్.. 24 రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 36 మంది సభాధ్యక్షులు, 16 మంది కార్యదర్శులు
'కామన్వెల్త్: ఒక ప్రపంచ భాగస్వామి' అనే ఇతివృత్తంపై 68వ సీపీసీ సర్వసభ్య సమావేశంలో ప్రసంగించనున్న ఓం బిర్లా
"సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం: డిజిటల్ పరివర్తనల ద్వారా ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడం, డిజిటల్ విభజనను ఎదుర్కోవడం" అనే అంశంపై జరిగే వర్క్‌షాప్‌కు అధ్యక్షత వహించనున్న లోక్‌సభ స్పీకర్
వివిధ నేపథ్య వర్క్‌షాప్‌లలో పాల్గొననున్న భారత పార్లమెంటరీ ప్రతినిధి బృంద సభ్యులు
ఈ సమావేశం సందర్భంగా కామన్వెల్త్ దేశాల స్పీకర్లతో చర్చలు జరపనున్న ఓం బిర్లా
Posted On:
05 OCT 2025 5:10PM by PIB Hyderabad
2025 అక్టోబర్ 05 నుంచి 12 వరకు బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరగనున్న 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశంలో (సీపీసీ) లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా నేతృత్వంలోని భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం పాల్గొంటుంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్, ఎంపీ (లోక్‌సభ) - సీపీఏ కార్యనిర్వహక కమిటీ సభ్యులు శ్రీ అనురాగ్ శర్మ, ఎంపీ (లోక్‌సభ) - సీడబ్ల్యూపీ స్టీరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ డీ. పురందేశ్వరి, ఎంపీ (లోక్‌సభ) డాక్టర్ కే. సుధాకర్, ఎంపీ (రాజ్యసభ) శ్రీమతి రేఖ శర్మ, ఎంపీ (రాజ్యసభ) డాక్టర్ అజీత్ మాధవరావు గోప్చాడే, లోక్‌సభ సెక్రటరీ జనరల్ శ్రీ ఉత్పల్ కుమార్ సింగ్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ శ్రీ పీ.సీ. మోదీలు ఈ బృందంలో ఉన్నారు.
దేశంలోని 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి సీపీఏ సభ్యులుగా ఉన్న 36 మంది శాసనసభల సభ్యులు, 16 మంది కార్యదర్శులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ సదస్సు జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి "కామన్వెల్త్ - ఒక ప్రపంచ భాగస్వామి" అనే అంశంపై లోక్‌సభ స్పీకర్ ప్రసంగిస్తారు. వివిధ అంశాలపై ఏడు వర్క్‌షాప్‌లను కూడా ఈ సదస్సులో నిర్వహిస్తారు. ‘సాంకేతికతను పెంచడం: డిజిటల్ పరివర్తనల ద్వారా ప్రజాస్వామ్యాన్ని మెరుగుపరచడం, డిజిటల్ విభజనను ఎదుర్కోవడం’ అనే అంశంపై జరిగే వర్క్‌షాప్‌కు లోక్‌సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు.
సదస్సులో భాగంగా జరిగే సీపీఏ కార్యనిర్వహక కమిటీ సమావేశానికి సీపీఏ కోశాధికారిగా ఉన్న ఎంపీ (లోక్‌సభ) శ్రీ అనురాగ్ శర్మ, భారత్ నుంచి సీపీఏ కార్యనిర్వహక కమిటీలోని ప్రాంతీయ ప్రతినిధులలో ఒకరైన అస్సాం శాసనసభ స్పీకర్ శ్రీ బిశ్వజిత్ డైమరీ హాజరవుతారు.
‘కామన్వెల్త్ మహిళా పార్లమెంటేరియన్ల (సీడబ్ల్యూపీ) స్టీరింగ్ కమిటీ’ సమావేశంలో లోక్‌సభ ఎంపీ డాక్టర్ డీ. పురందేశ్వరి పాల్గొంటారు. ‘కామన్వెల్త్ వ్యాప్తంగా లింగ సమానత్వ పార్లమెంట్లను సాధించేందుకు ఉత్తమ విధానాలు, వ్యూహాలు’ అనే అంశంపై జరిగే సీడబ్ల్యూపీ సెషల్‌లో కూడా ఆమె ప్యానలిస్ట్‌గా ఉన్నారు.
రాష్ట్ర, కేంద్ర పాలిత శాసనసభల అధ్యక్షులతో పాటు ప్రతినిధి బృందంలోని ఇతర సభ్యులు వివిధ వర్క్‌షాప్‌లు, సదస్సుకు సంబంధించిన సర్వసభ్య సమావేశంలో కూడా పాల్గొంటారు.
ఈ పర్యటన సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. కామన్వెల్త్‌లోని ఇతర దేశాల పార్లమెంటరీ సభల స్పీకర్లతో ఉమ్మడి ప్రయోజనాలు, పార్లమెంటరీ భాగస్వామ్యానికి సంబంధించిన విషయాల గురించి చర్చిస్తారు.
లోక్‌సభ స్పీకర్ బార్బడోస్ నేతలతో కూడా సమావేశయ్యే అవకాశం ఉంది. ఆ దేశంలో ఉన్న ప్రవాస భారతీయులతో ఆయన మాట్లాడే వీలు కూడా ఉంది.
***
(Release ID: 2175161)
Visitor Counter : 2