ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వర్షాలు, కొండచరియలు విరిగిపడిన డార్జిలింగ్, పరిసర ప్రాంతాలకు అండగా ఉంటామన్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 05 OCT 2025 4:18PM by PIB Hyderabad

భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల తీవ్రంగా ప్రభావితమైన డార్జిలింగ్, పరిసర ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభావిత ప్రాంతాలకు సాధ్యమైనంత సహాయం అందించడం పట్ల ప్రభుత్వ నిబద్ధతను శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని తగ్గించడానికి కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పూర్తి సమన్వయంతో పనిచేయాలన్నారు.

‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

"భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడిన డార్జిలింగ్, పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను."


(रिलीज़ आईडी: 2175093) आगंतुक पटल : 43
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada