కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

“ప్రైవేటు రేడియో యాజమాన్యాల కోసం డిజిటల్ రేడియో ప్రసార విధానాన్ని రూపొందించడం” పై సిఫార్సులను విడుదల చేసిన ట్రాయ్

प्रविष्टि तिथि: 03 OCT 2025 12:13PM by PIB Hyderabad

"ప్రైవేట్ రేడియో యాజమాన్యాలకు సంబంధించిన డిజిటల్ రేడియో ప్రసార విధానాన్ని రూపొందించడంపై టెలికాం ఈ రోజు నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్సిఫార్సులను విడుదల చేసింది. 'ప్లస్విభాగంలోని నాలుగు నగరాలుఢిల్లీముంబయికోల్‌కతాచెన్నై.. 'విభాగంలోని తొమ్మిది నగరాలుహైదరాబాద్బెంగళూరుఅహ్మదాబాద్సూరత్పుణెజైపూర్లక్నోకాన్పూర్నాగ్‌పూర్‌లలో డిజిటల్ రేడియో ప్రసారాలను ప్రారంభించేందుకు రిజర్వ్ ధరతో పాటు నిబంధనలనుషరతులను విడుదల చేసింది.

ట్రాయ్ చట్టం- 1997లోని సెక్షన్ 11 (1)()(i) ప్రకారం ప్రైవేట్ రేడియో ప్రసారకర్తలకు సంబంధించిన డిజిటల్ రేడియో ప్రసార విధానాన్ని రూపొందించడంపై సిఫార్సులను ఇవ్వాలని సమాచారప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ) 2024 ఏప్రిల్ 23న ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రైవేటు రేడియో యాజమాన్యాలకు సంబంధించిన డిజిటల్ రేడియో ప్రసార విధానాన్ని రూపొందించే విషయంలో వివిధ అంశాలపై భాగస్వాముల వ్యాఖ్యలను కోరుతూ 2024 సెప్టెంబర్ 30న సంప్రదింపుల పత్రాన్ని ట్రాయ్ విడుదల చేసిందిదీనిపై 43 వ్యాఖ్యలువాటికి వ్యతిరేకంగా 13 వ్యాఖ్యలు అందాయిఇవి ట్రాయ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. 205 జనవరి 8న బహిరంగ చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ట్రాయ్ అందుకున్న వ్యాఖ్యాలను పరిగణనలోకి తీసుకొని సమస్యలపై మరింత విశ్లేషణ చేసిన అనంతరం సిఫార్సులను ఖరారు చేసిందిసిఫార్సుల్లో ముఖ్యాంశాలు ఇవి:

డిజిటల్ రేడియో సేవలను కొత్త బ్రాడ్‌కాస్టర్లు సిమల్‌కాస్ట్ పద్ధతిలో నిర్వహించాలిఇప్పటికే ఉన్న అనలాగ్ ఎఫ్ఎం రేడియో యాజమాన్యాలు స్వచ్ఛంద ప్రాతిపదికన సిమల్‌కాస్ట్ పద్ధతికి మారేందుకు కూడా అనుమతించాలి.

బిప్రతిపాదిత సిమల్‌కాస్ట్ పద్ధతి ద్వారా కేటాయించిన స్పాట్ ఫ్రీక్వెన్సీలో ఒక అనలాగ్మూడు డిజిటల్ఒక డేటా ఛానళ్లను ప్రసారం చేయటానికి అవకాశం ఇవ్వాలి

సీవీహెచ్ఎఫ్ బ్యాండ్ IIలో డిజిటల్ రేడియో ప్రసారాలను ప్రవేశపెట్టేందుకు భారతదేశంలో ఒకే ప్రామాణిక డిజిటల్ రేడియో సాంకేతికను అనుసరించాలి.

డీప్రధాన భాగస్వామ్య సంస్థలైన రేడియో బ్రాడ్‌కాస్టర్లురేడియో రిసీవర్ తయారీదారులతో సంప్రదింపులు చేపట్టటం లేదా స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియలో సాంకేతికతను పొందుపర్చటం లేదా ప్రభుత్వం సరైనదిగా భావించే ఏ ఇతర పద్ధతినైనా అనుసరిస్తూ భారతదేశానికి తగిన డిజిటల్ రేడియో సాంకేతికతను ప్రభుత్వం ఎంపికచేయాలి.

ప్రభుత్వం 'ఏ ప్లస్'  విభాగంలోని నాలుగు నగరాలు, 'విభాగంలోని తొమ్మిది నగరాలకు ఒకే సాంకేతికత విషయంలో స్పెక్ట్రమ్ ప్రణాళికను సిద్ధం చేసి దానిని ప్రజలకు అందుబాటులో ఉంచాలి

ఎఫ్టెలికమ్యూనికేషన్ చట్టం- 2023లోని సెక్షన్ 4(4) ప్రకారం వేలం పద్ధతిలో కొత్త ఛానళ్లకు స్పెక్ట్రమ్‌ను కేటాయించాలి

జీవేలం ద్వారా డిజిటల్ రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌కు సంబంధించిన ఫ్రీక్వెన్సీ విజయవంతంగా కేటాయించిన వెంటనే.. స్వచ్ఛంద ప్రాతిపదికన సిమల్‌కాస్ట్ నమూనాకు మారేందుకు ఇప్పటికే ఉన్న ఎఫ్ఎం రేడియో యాజమాన్యాలకు అవకాశం ఇవ్వాలి

హెచ్ప్రస్తుత బ్రాడ్‌కాస్టర్లు సిమల్‌కాస్ట్ పద్ధతికి మారేందుకు వేలం ప్రక్రియ ముగిసిన తర్వాత నెలల సమయాన్ని ఇవ్వాలి

ఇప్పటికే ఉన్న ఎఫ్ఎం రేడియోయాజమాన్యాలు సిమల్‌కాస్ట్ పద్ధతికి మారేందుకు.. సంబంధిత నగరంలో డిజిటల్ రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌కు వేలం ద్వారా నిర్ణయించిన మొత్తానికిప్రస్తుతం ఉన్న అనుమతుల విషయంలో మిగిలిన కాలానికి తిరిగి చెల్లించలేని ఒకసారి చెల్లించే ప్రవేశ ఫీజుకు (ఎన్ఓటీఈఎఫ్నాన్ రిఫండేబుల్ వన్ టైం ఎంట్రీ ఫీజుఉన్న వ్యత్యాసాన్ని దామాషా ప్రకారం చెల్లించాలి

జేరేడియో యాజమాన్యాలు వేలం ప్రక్రియ ముగిసిన లేదా మారేందుకు అంగీకారం తెలిపిన రెండు సంవత్సరాలలోపు సిమల్‌కాస్ట్ కార్యకలాపాలను ప్రారంభించాలి

కేఅనలాగ్ ప్రసారాలకు ముగింపు పలికే తేదీని డిజిటల్ రేడియో ప్రసారాల పురోగతిని పరిశీలించిన అనంతరం నిర్ణయించాలి

ఎల్రేడియో యాజమాన్యాలకు అద్దెకు ఇచ్చేందుకు వీలున్న క్రియాశీలనిష్క్రియాత్మక డిజిటల్ మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం ‘రేడియో బ్రాడ్‌కాస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్’ కోసం కొత్త అనుమతులను ప్రవేశపెట్టాలిడిజిటల్ రేడియో సేవలను ప్రవేశపెట్టేందుకు ఇది ముందస్తు అవసరం కాదు

ఎంమొబైల్ ఫోన్‌లలో ఎఫ్ఎం రేడియో రిసీవర్లను అందుబాటులో ఉండటం గురించి ఎలక్ట్రానిక్స్ఐటీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవైజారీ చేసిన సలహా ఉత్తర్వుల తరహాలో మొబైల్ ఫోన్‌లుకార్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థలలో డిజిటల్ రేడియో రిసీవర్ల అందుబాటుకు సంబంధించి ప్రభుత్వం ఒక సలహా ఉత్తర్వును జారీ చేయాలి.

ఎన్ప్రైవేట్ స్థానిక రేడియో బ్రాడ్‌కాస్టర్‌లు ప్రత్యక్ష ప్రసార ఛానళ్లను ఏకకాలంలో ప్రసారం చేయాలివీటిని వినియోగదారులు నియంత్రించే వీలు ఉండరాదు

డిజిటల్ రేడియో రిసీవర్లుమార్కెట్ వ్యవస్థల అభివృద్ధివిస్తరణను పర్యవేక్షించేందుకు సమాచారప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటుచేయాలిఇందులో ఎంఐబీఎలక్ట్రానిక్స్ఐటీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై), రేడియో బ్రాడ్‌కాస్టర్లుపరికర తయారీదారులుసాంకేతికతను అందించే సంస్థల నుంచి సీనియర్ ప్రతినిధులు ఉండాలి

పీ. ‘టెలికమ్యూనికేషన్స్ చట్టం- 2023 కింద ప్రసార సేవలను అందించటానికి సంబంధించిన అనుమతుల ఫ్రేమ్‌వర్క్'పై 2025 ఫిబ్రవరి 21 నాడు ట్రాయ్ చేసిన సిఫార్సుల ప్రకారం డిజిటల్ రేడియో ప్రసారాల అర్హతలు (కనీస నికర విలువతో సహాఉండాలి.

క్యూడిజిటల్ రేడియో ప్రసారానికి అనుమతులకు 15 సంవత్సరాల వ్యవధి ఉండాలి.

ఆర్. 25.07.2011న ఎంఐబీ ఇచ్చిన ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో ఫేజ్-III విధాన మార్గదర్శకాలలో పేర్కొన్న స్థూల ఆదాయ నిర్వచనం యథాతథంగా కొనసాగించాలి

ఎస్రేడియో బ్రాడ్‌కాస్టర్ స్ట్రీమింగ్ చేస్తున్నట్లయితే రేడియో ఛానల్ స్ట్రీమింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని జీఆర్‌లో చేర్చాలి

టీటెలికమ్యూనికేషన్ అనుమతుల మాదిరిగానే ఏజీఆర్‌పై(అడ్‌జెస్టెడ్ జీఆర్అనుమతుల రుసుం విధించాలి

యూరేడియో ప్రసార సేవలకు నేరుగా సంబంధం లేని ఆదాయాన్ని తగ్గించిన తర్వాత ఏపీజీఆర్ (అప్లికేబుల్ గ్రాస్ రెవెన్యూలైసెన్స్‌దారు మొత్తం స్థూల ఆదాయానికి (జీఆర్సమానంగా ఉండాలి

వీఏదైనా జీఎస్టీ చెల్లించినట్లయితే.. దానిని సర్దుబాటు చేసిన తర్వాత ఏజీఆర్‌ను గణించాలి

డబ్ల్యూవార్షికఅనుమతుల రుసుము ఈ విధంగా ఉండాలి:

i.  ఏ ప్లస్బీసీడీ విభాగపు నగరాల్లో ఏజీఆర్‌లో శాతం

ii.  ఇతరులు అనే విభాగం (ఈశాన్య భారత్‌లోని కొండసరిహద్దు ప్రాంతాలుజమ్మూ కాశ్మీర్లడఖ్ద్వీప ప్రాంతాలు), విభాగంఈ నగరాలకు మొదటి సంవత్సరాల కాలానికి ఏజీఆర్‌‌లో శాతం.. ఆ తర్వాత కాలానికి పైన పేర్కొన్న విధంగానే ఉండాలి.

ఎక్స్నగరంలో కనీసం మూడు వేర్వేరు సంస్థలుండాలనే షరతుకు లోబడి మొత్తం స్పాట్ ఫ్రీక్వెన్సీలలో 40 శాతం కంటే ఎక్కువ ఒక అధీకృత సంస్థ వద్ద ఉండేందుకు అనుమతించకూడదు

వైఏ ప్లస్ఏ నగరాల్లో ఎంఐబీ గుర్తించిన మొత్తం స్పాట్ ఫ్రీక్వెన్సీలలో నుంచి రెండు కొత్త స్పాట్ ఫ్రీక్వెన్సీలను ఈ దశలో ప్రతి నగరంలో డిజిటల్ రేడియో ప్రసారాల కోసం వేలం వేయాలిఈ నగరాల్లో మిగిలిన స్పెక్ట్రమ్ వేలం మొదటి దశ వేలంరిసీవర్ పరికరాల వ్యవస్థ అభివృద్ధిపురోగతిని సమీక్షించిన తర్వాత పరిగణించాలిడిజిటల్ రేడియోకు సంబంధించిన స్పాట్ ఫ్రీక్వెన్సీ నిర్వచనాన్ని ఇచ్చాం

జెడ్నగరంలో ఒక సంస్థకు సంబంధించిన బహుళ రేడియో ఛానళ్లలో కంటెంట్‌‌ శైలిని (జనర్మార్కెట్ శక్తులకు విడిచిపెట్టాలి

ఏఏఒక ప్రాంతానికి ప్రత్యేకించిన రేడియో(టెరెస్ట్రియల్సేవల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమ కోడ్ప్రకటనల కోడ్‌ను ప్రకటించారు

ఏబీ. 24 నెలల వ్యవధిలో కార్యకలాపాలు ప్రారంభించని పక్షంలో ఫ్రీక్వెన్సీ కేటాయింపును ఉపసంహరించుకోవాలిఈ ఉపసంహరణ తేదీ నుంచి ఐదు సంవత్సరాల పాటు అదే నగరంలో మరొక స్పాట్ ఫ్రీక్వెన్సీని పొందకుండా సంబంధింత సంస్థపై ఆంక్షలు విధించాలి

బీసీప్రసార భారతి భూటవర్ మౌలిక సదుపాయాలు (ఎల్‌టీఐ), కామన్ ట్రాన్స్‌మిషన్ మౌలిక సదుపాయాలను (సీటీఐయాజమాన్యాలకు రాయితీతో కూడిన అద్దెకు ఇవ్వాలిఈ విషయంలో నిర్వహణ ఖర్చులను పూర్తిగా తిరిగి పొందాలి

సీడీప్రసార మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఇతరులతో పంచుకోవాలన్న(కో-లొకేషన్షరతు తీసివేయాలిసాంకేతికవాణిజ్య సాధ్యాసాధ్యాలకు అనుగుణంగా ప్రసార సేవలుటెలికాం సేవలుమౌలిక సదుపాయాల సంస్థలు మొదలైన వాటితో స్వచ్ఛంద ప్రాతిపదికన మౌలిక సదుపాయాలను పంచుకోవడానికి అనుమతులు పొందిన స్థానిక రేడియో సంస్థలను అనుమతించాలి.

డీఈ.  ఏ ప్లస్ఏ విభాగంలోని 13 నగరాల్లో కొత్త రేడియో బ్రాడ్‌కాస్టర్‌ల ద్వారా ఒకేసారి ప్రసారం చేయడానికి అవసరమైన స్పెక్ట్రమ్ వేలం కోసం రిజర్వ్ ధరలు ఇలా ఉండాలి:

 

నగరం

విభాగం

సిమల్‌కాస్ట్ స్పెక్ట్రమ్ రిజర్వు ధర

(రూకోట్లలో)

చెన్నై

ఏ ప్లస్

146.68

ఢిల్లీ

ఏ ప్లస్

177.63

కోల్‌కతా

ఏ ప్లస్

79.96

ముంబయి

ఏ ప్లస్

194.08

అహ్మదాబాద్

40.44

బెంగళూరు

87.22

హైదరాబాద్

65.85

జైపూర్

26.89

కాన్పూర్

20.52

లక్నో

24.59

నాగ్‌పూర్

29.48

పుణె

41.26

సూరత్

25.89

ఈఎఫ్కొత్త స్పాట్ ఫ్రీక్వెన్సీలను గెలుచుకున్న వాళ్లకు టెలీకమ్యూనికేషన్స్ రంగం స్పెక్ట్రమ్ వేలం మాదిరిగానే వేలం పాట మొత్తాన్ని చెల్లించేందుకు పలు రకాల ఆప్షన్లను ఇవ్వాలి

ఎఫ్‌జీసిమల్‌కాస్ట్‌కి మారే రేడియో బ్రాడ్‌కాస్టర్లకు కూడా మైగ్రేషన్ రుసుం చెల్లించేందుకు బహుళ అప్షన్లను ఇవ్వాలి

జీహెచ్వార్షిక వాయిదాలలో బిడ్ మొత్తాన్ని చెల్లించే సందర్భంలో సంవత్సరాల వ్యవధిని ఒక స్లాబ్‌గా పరిగణిస్తూ ఇలా మూడు స్లాబ్‌లలో ఇన్‌క్రిమెంటల్ వాయిదాలను అనుమతించాలితద్వారా 15 సంవత్సరాలలో ఎన్‌పీవీని కాపాడుతూ సమాన వాయిదాలలో 66.67 శాతం ఏడీపీతో పాటు మిగతా 33.33 శాతం పొందాలిఎన్‌పీవీని కాపాడుతూ మిగిలిన ఈ 33.33 శాతం మీద ఈ రేట్లు ఉండాలి:

i. మొదటి ఐదు సంవత్సరాలలో సున్నా
ii. తదుపరి ఐదు సంవత్సరాలలో ⅓ భాగం.. ఐదు సంవత్సరాల కాలానికి సమానంగా ఉండాలి.
iii. 
చివరి ఐదు సంవత్సరాలలో ⅔ భాగం.. ఐదు సంవత్సరాల కాలానికి సమానంగా ఉండాలి

ఐఐవార్షిక వాయిదాలలో మైగ్రేషన్ మొత్తాన్ని చెల్లించే సందర్భంలో సంవత్సరాల వ్యవధిని ఒక స్లాబ్‌గా పరిగణిస్తూ ఇలా మూడు స్లాబ్‌లలో ఇన్‌క్రిమెంటల్ వాయిదాలను అనుమతించాలితద్వారా ప్రస్తుత అనుమతుల్లో మిగిలి ఉన్న కాలానికి ఎన్ఓటీఈఎఫ్ దామాషా మొత్తంలో తగ్గించిన ఏడీపీలో 66.67 శాతాన్ని ఎన్‌పీవీని కాపాడుతూ 15 సంవత్సరాలలో సమాన వాయిదాలలో తిరిగి పొందొచ్చుఎన్‌పీవీని కాపాడుతూ మిగిలిన 33.33 శాతం ఏడీపీ రేట్లు ఈ విధంగా ఉండాలి:

i. మొదటి ఐదు సంవత్సరాలలో సున్నా
ii. తదుపరి ఐదు సంవత్సరాలలో ⅓ భాగం.. ఐదు సంవత్సరాల కాలానికి సమానంగా ఉండాలి.
iii. 
చివరి ఐదు సంవత్సరాలలో ⅔ భాగం.. ఐదు సంవత్సరాల కాలానికి సమానంగా ఉండాలి

ఐజేవార్షిక వాయిదా లేదా పాక్షిక చెల్లింపు విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక ఎంసీఎల్ఆర్ వడ్డీ రేటుతో సర్దుబాటు చేయటం ద్వారా ఏడీపీ లేదా మైగ్రేషన్ పూర్తి ఎన్‌పీవీ యథాతథంగా ఉండాలి

డిజిటల్ రేడియో ప్రసారాలు అనలాగ్ కంటే కంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయిఅనలాగ్‌లో ఒక క్యారియర్ ఫ్రీక్వెన్సీలో ఒక ఛానల్‌ను మాత్రమే ప్రసారం చేయటానికి వీలు అవుతుందికానీ డిజిటల్‌లో సిమల్‌కాస్ట్ మోడ్‌ ద్వారా ఒకే స్పాట్ ఫ్రీక్వెన్సీలో ఒక అనలాగ్ ఛానల్‌తో పాటు మూడు డిజిటల్ఒక డేటా ఛానల్‌ను ప్రసారం చేయొచ్చుడిజిటల్ రేడియో ఛానల్ అత్యుత్తమ నాణ్యత గల ఆడియోను అందిస్తుందివీటిని.. డిజిటల్ రేడియో ప్రసారాల వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలను ట్రాయ్ పేర్కొందిపోటీ పరిస్థితుల్లో డిజిటల్ రేడియో ప్రసారం.. రేడియో బ్రాడ్‌కాస్టర్లకు కొత్త అవకాశాలను ఇవ్వటంతో పాటు శ్రోతలు రేడియోను వినే విషయంలో బహుళ ఆప్షన్లువిలువ ఆధారిత సేవలను అందిస్తుంది.

పూర్తి సిఫార్సులు ట్రాయ్ వెబ్‌సైట్ www.trai.gov.in లో అందుబాటులో ఉన్నాయిఏదైనా స్పష్టతసమాచారం కోసం ట్రాయ్ సలహాదారు ప్రసారకేబుల్ సేవలుడాక్టర్ దీపాలి శర్మను టెలిఫోన్ నంబర్: +91-11- 20907774 ద్వారా సంప్రదించవచ్చు

 

 

***
 


(रिलीज़ आईडी: 2175021) आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Malayalam , English , Urdu , हिन्दी , Bengali , Tamil