ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తిరుప్పూర్ కుమారన్, సుబ్రమణ్య శివ సంస్మరణ దినోత్సవం సందర్భంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి

Posted On: 04 OCT 2025 4:51PM by PIB Hyderabad

భారత స్వాతంత్ర్య పోరాట యోధులైన తిరుప్పూర్ కుమారన్సుబ్రమణ్య శివల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులర్పించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వేరు వేరు పోస్టులలో ఈ విధంగా పేర్కొన్నారు:

"ఇద్దరు భారతమాత పుత్రులు తిరుప్పూర్ కుమారన్సుబ్రమణ్య శివలను మనం స్మరించుకుంటూ వందనం చేస్తున్నాంగొప్ప రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన వీరిద్దరూ భారతదేశ స్వాతంత్ర్యంజాతీయవాద స్ఫూర్తిని మేల్కొల్పటానికి జీవితాలను అంకితం చేశారు.

జాతీయ జెండాను చేతిలో పట్టుకొని అమరత్వం పొందిన తిరుప్పూర్ కుమారన్.. అచంచలమైన ధైర్యంనిస్వార్థ త్యాగం అంటే ఏమిటన్నది చూపించారుతలవంచని రచనలుఉత్తేజకరమైన ప్రసంగాల ద్వారా సుబ్రమణ్య శివ.. ఎంతో మంది యువతలో సాంస్కృతిక గౌరవాన్నీదేశభక్తినీ నింపారు.

వలస పాలకుల నుంచి మనకు స్వేచ్ఛను కల్పించిన అసంఖ్యాకమైన ప్రజల పోరాటాలుబాధలను గుర్తు చేస్తున్న ఈ ఇద్దరు మహానుభావుల కృషి మన అందరి స్మృతిపథంలో శాశ్వతంగా నిలిచి ఉంటుందివారి పోరాటం మనందరికీ జాతీయాభివృద్ధిఐక్యత కోసం కృషి చేసే విషయంలో స్ఫూర్తినిస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను.”

 

***


(Release ID: 2175017) Visitor Counter : 5