ప్రధాన మంత్రి కార్యాలయం
లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని
Posted On:
02 OCT 2025 7:42AM by PIB Hyderabad
మాజీ ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఆయన సమగ్రత, వినయం, నిర్ణయాత్మక నాయకత్వాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు.
దేశ చరిత్రలోని కీలక సమయాల్లో జాతీయ స్వభావాన్ని రూపొందించడంలో శాస్త్రి గారు పోషించిన కీలక పాత్రను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఆయన ఇచ్చిన ప్రతిష్ఠాత్మక నినాదం ‘జై జవాన్ జై కిసాన్’.. సైనికులు, రైతుల పట్ల భారత్ చూపే నిబద్ధతకు శక్తిమంతమైన చిహ్నంగా మిగిలిపోయిందని అన్నారు.
శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవితం, నాయకత్వం.. స్వావలంబన కలిగిన బలమైన దేశం కోసం చేస్తోన్న సమష్టి కృషిలో తరతరాలుగా భారతీయులకు స్ఫూర్తినిస్తూనే ఉందని మోదీ వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
"శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు అసాధారణ రాజనీతిజ్ఞులు. ఆయన సమగ్రత, వినయం, దృఢ సంకల్పం భారత్‌ను బలోపేతం చేశాయి.. సవాళ్లున్న సమయాల్లో కూడా దేశం బలోపేతమైంది. ఆదర్శప్రాయమైన నాయకత్వం, మనోబలం, నిర్ణయాత్మక పనులకు ఆయన ప్రతీక. 'జై జవాన్ జై కిసాన్' అంటూ ఆయన అందించిన నినాదం మనందరిలో దేశభక్తిని రగిలించింది. స్వావలంబన కలిగిన బలమైన భారతదేశాన్ని తయారు చేసే ప్రయాణంలో ఆయన మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటారు."
(Release ID: 2174127)
Visitor Counter : 2