ప్రధాన మంత్రి కార్యాలయం
‘ఆర్‌ఎస్‌ఎస్’ వందేళ్ల ప్రస్థానంపై తన మనోభావాలను పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
02 OCT 2025 8:57AM by PIB Hyderabad
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శతాబ్ది వేడుకల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఒక వ్యాసం ద్వారా ప్రజలతో తన మనోభావాలను పంచుకున్నారు. దేశ సేవ, సమాజాభ్యున్నతి లక్ష్యంగా 1925లో విజయదశమి పర్వదినం నాడు ఈ సంస్థ ఆవిర్భవించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
దీనిపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పంపిన వేర్వేరు సందేశాల్లో:
“దేశ సేవ, సమాజాభ్యున్నతి లక్ష్యంగా ఓ శతాబ్దం కిందట విజయదశమి పర్వదినాన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఉద్భవించింది. ఈ వందేళ్ల ప్రయాణంలో సంఘ్ సంకల్ప సాకారం దిశగా అసంఖ్యాక స్వయం సేవకులు తమ జీవితాలను అంకితం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ సుదీర్ఘ ప్రస్థానంపై నా మనోభావాలకు అక్షర రూపమివ్వడానికి నా వంతు ప్రయత్నం చేశాను. కింది లింకుల ద్వారా ఆ విశేషాలను చూడవచ్చు.” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2174123)
సందర్శకుల సూచీ సంఖ్య : : 37
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam