మంత్రిమండలి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్ దారులకు కరవు భత్యాన్నీ, భృతినీ మూడు శాతం పెంచే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం
Posted On:
01 OCT 2025 3:06PM by PIB Hyderabad
ధరల పెరుగుదలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డిఎ), పింఛనుదారులకు కరువు భృతి (డిఆర్)ని ప్రస్తుతమున్న 55% రేటుకు మరో 3% పెంపును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 01.07.2025 నుంచి దీనిని అమలు చేస్తారు.
కరువు భత్యం, కరువు భృతి.. రెండింటి పెంపు వల్ల ఖజానాపై ఏటా రూ.10083.96 కోట్ల మేర అదనపు భారం పడుతుంది. ఈ పెంపు వల్ల సుమారు 49.19 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.72 లక్షల మంది పింఛనుదారులు లబ్ధి పొందుతారు.
ఏడో కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఆమోదించిన ఫార్ములా ప్రకారం డిఎ, డిఆర్ లను పెంచారు.
***
(Release ID: 2173856)
Visitor Counter : 18
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam