మంత్రిమండలి
azadi ka amrit mahotsav

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల పనితీరు ఆధారిత బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం

Posted On: 24 SEP 2025 3:10PM by PIB Hyderabad

రైల్వే సిబ్బంది అద్భుతమైన పనితీరుకు గుర్తింపుగా 10,91,146 మంది ఉద్యోగులకు 78 రోజుల పనితీరు ఆధారిత బోనస్ (పీఎల్‌బీ) రూ1865.68 కోట్ల చెల్లింపునకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

అర్హులైన రైల్వే ఉద్యోగులకు ఏటా దుర్గా పూజ/దసరా సెలవులకు ముందు పీఎల్‌బీని చెల్లిస్తారుఈ సంవత్సరం కూడా దాదాపు 10.91 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన పీఎల్‌బీ మొత్తాన్ని చెల్లిస్తున్నారురైల్వేల పనితీరు మెరుగుపడేలా కృషి చేసిన ఉద్యోగులకు ప్రేరణనిచ్చే ప్రోత్సాహకంగా పీఎల్‌బీ ఉపయోగపడుతుంది.

అర్హత కలిగిన ప్రతి రైల్వే ఉద్యోగికి 78 రోజుల వేతనానికి సమానమైన పీఎల్‌బీ కింద చెల్లించే గరిష్ట మొత్తం రూ.17,951/-. పైన పేర్కొన్న మొత్తాన్ని ట్రాక్ మెయింటెయినర్లులోకో పైలట్లురైలు గార్డులుస్టేషన్ మాస్టర్లుసూపర్‌వైజర్లుసాంకేతిక నిపుణులుసహాయకులుపాయింట్స్‌ మన్మినిస్టీరియల్ సిబ్బందిఇతర గ్రూప్సి సిబ్బంది వంటి వివిధ కేటగిరీల్లోని రైల్వే సిబ్బందికి చెల్లిస్తారు.

2024-25లో రైల్వేల పనితీరు చాలా బాగుందిరైల్వేలు రికార్డు స్థాయిలో 1614.90 మిలియన్ టన్నుల సరుకును లోడ్ చేయడంతోపాటు దాదాపు 7.3 బిలియన్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి.

 

***


(Release ID: 2170635) Visitor Counter : 36