ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సెప్టెంబర్ 25న న్యూఢిల్లీ భారత మండపంలో వరల్డ్ ఫుడ్ ఇండియా 2025ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి


వరల్డ్ ఫుడ్ ఇండియా వాణిజ్య ప్రదర్శన మాత్రమే కాదు...

ఆహార ఆవిష్కరణలు, పెట్టుబడులు, స్థిరత్వంలో భారత్ ను ప్రపంచ స్థాయిలో నిలిపే వేదిక: చిరాగ్ పాశ్వాన్

Posted On: 23 SEP 2025 12:34PM by PIB Hyderabad

వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 నాలుగో ఎడిషన్‌ను 2025 సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహించనుందిఈ ప్రపంచ స్థాయి ఆహార మహాసభ 1,00,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జరగనుందిఇందులో 21 కంటే ఎక్కువ దేశాలు, 21 రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాలు, 10 కేంద్ర మంత్రిత్వ శాఖలు, 5 అనుబంధ ప్రభుత్వ సంస్థలు పాల్గొననున్నాయిఇది దేశంలో ఆహార ప్రాసెసింగ్ రంగానికి చెందిన భాగస్వాములందరీ ఏకతాటిపైకి తీసుకురానుంది.

 

ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 సెప్టెంబర్ 25న సాయంత్రం 6:00 గంటలకు ప్రారంభించనున్నారుప్రారంభ సమావేశంలో రష్యన్ ఫెడరేషన్ ఉప ప్రధానమంత్రి శ్రీ దిమిత్రి పత్రుషేవ్కేంద్ర రోడ్డు రవాణారహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీకేంద్ర ఆహార శుద్ది పరిశ్రమల మంత్రి శ్రీ చిరాగ్ పాశ్వాన్ఆహార శుద్ది పరిశ్రమలురైల్వే శాఖల సహాయ మంత్రి శ్రీ రవ్నీత్ సింగ్ బిట్టు పాల్గొననున్నారు.

 

ఈ సదస్సుపై ఆహార శుద్ది పరిశ్రమల మంత్రి శ్రీ చిరాగ్ పాస్వాన్ మాట్లాడుతూ.. ‘ "వరల్డ్ ఫుడ్ ఇండియా కేవలం ఒక వాణిజ్య ప్రదర్శన మాత్రమే కాదుఆహార ఆవిష్కరణలుపెట్టుబడులుస్థిరత్వానికి సంబంధించి దేశాన్ని ప్రపంచ కేంద్రంగా నిలిపేందుకు నిర్వహించే ఓ వేదికప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో జరగబోతున్న ఈ కార్యక్రమం స్థిరమైనసమ్మిళిత భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఆహార వ్యవస్థలపై మా నిబద్ధతను ప్రతిబింబిస్తుందిఇది ప్రపంచానికి ఆహారాన్ని అందించడంలోదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

 

వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా 2025 ముఖ్యాంశాలు

· భాగస్వామ్య దేశాలు: న్యూజిలాండ్, సౌదీ అరేబియా

 

· కేంద్రీకృత దేశాలు: జపాన్రష్యాయూఏఈ, వియత్నాం

· భాగస్వామ్యంప్రాతినిధ్యం1700కిపైగా ప్రదర్శకులు, 500కిపైగా అంతర్జాతీయ కొనుగోలు దారులు, 100 కంటే ఎక్కువ దేశాల ప్రతినిధులు

 

· విజ్ఞాన సమావేశాలు: 45 కంటే ఎక్కువ అంశాల ఆధారిత సెషన్లురాష్ట్రాలుదేశాల ప్రత్యేక సమావేశాలు, 100కిపైగా ప్రపంచ వ్యవసాయ ఆహార నాయకులతో నేపథ్య చర్చలు

 

సమాంతర కార్యక్రమాలు :

 

  • 3వ ప్రపంచ ఆహార నియంత్రణ సంస్థల సదస్సుప్రపంచ ఆహార భద్రతా ప్రమాణాల సమన్వయానికి దోహదం.

     

  • 24వ ఇండియా ఇంటర్నేషనల్ సీఫుడ్ షో: భారతీయ సముద్ర ఆహార ఎగుమతుల సామర్ధ్యం బలోపేతం.

     

  • రివర్స్ బయ్యర్-సెల్లర్ మీట్1000కిపైగా అంతర్జాతీయ కొనుగోలు దారుల పాల్గొనబోయే వేదిక.

     

  • అంతర్జాతీయ స్టాళ్లు, రాష్ట్ర మంత్రిత్వ శాఖల స్టాళ్లుజంతు ఆహార స్టాళ్లుసాంకేతిక స్టాళ్లు, అంకుర సంస్థల ఆవిష్కరణల స్టాళ్లు

 

అయిదు ప్రధాన అంశాల చుట్టూ ఈ ఏడాది ఎడిషన్‌ కు రూపకల్పన.

 

1. స్థిరత్వంపర్యావరణ అనుకూల ఆహార శుద్ధి.

2. ప్రపంచ ఆహార ప్రాసెసింగ్ కేంద్రంగా భారత్

3. ఆహార శుద్ధిఉత్పత్తులుప్యాకేజింగ్ సాంకేతికతలలో నూతన ఒరవడి

4. పోషకాహారంఆరోగ్యంసంక్షేమం కోసం ఆహారం.

5. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు శక్తినిచ్చే పశుసంపదసముద్ర ఉత్పత్తులు

 

వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 సందర్భంగా “ఆహార శుద్ధిలో వివిధ అంశాలపై తరచూ అడిగే ప్రశ్నలు” పుస్తకాన్ని శ్రీ చిరాగ్ పాస్వాన్ ప్రారంభించారుపరిశ్రమ భాగస్వాములతో సంప్రదింపుల ద్వారా రూపొందించిన ఈ పుస్తకం ప్రాసెస్డ్ ఫుడ్స్ చుట్టూ ఉన్న అపోహలను తొలగించేందుకువిజ్ఞాన ఆధారిత సమాచారం ద్వారా వినియోగదారుల్లో అవగాహన పెంచేందుకు దోహదపడుతుంది.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించటంలో వ్యవసాయంరైతు సంక్షేమ మంత్రిత్వ శాఖమత్స్య శాఖపశు సంవర్ధకపాడిపరిశ్రమ శాఖఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖఏపీఈడీఏఎంపీఈడీఏకమోడిటీ బోర్డులు వంటి వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలువిభాగాలుసంస్థలు అందించిన సహకారాన్ని ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ గుర్తించింది.

 

వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 దేశ ఆహార శుద్ధి రంగంలో చేసిన నమోదైన ప్రగతిని ప్రదర్శించడమే కాకుండాఅంతర్జాతీయ భాగస్వామ్యాలుపెట్టుబడి అవకాశాలను పెంపొందించే ఓ మహోత్తర కార్యక్రమంగా నిలవనుంది.

 

***


(Release ID: 2170548) Visitor Counter : 8