వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఇంటిగ్రేటెడ్ స్టేట్, సిటీ లాజిస్టిక్స్ ప్రణాళికలను ప్రారంభించిన కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్
లాజిస్టిక్స్ సామర్థ్యం, సరఫరా వ్యవస్థ పోటీతత్వాన్ని పెంపొందించడం కోసం
ఎనిమిది నగరాల్లో ప్రారంభమైన స్మైల్ కార్యక్రమం
Posted On:
20 SEP 2025 6:48PM by PIB Hyderabad
మేక్ ఇన్ ఇండియా దశాబ్ద వేడుకల సందర్భంగా కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈరోజు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) రూపొందించిన అనేక పరివర్తనాత్మక కార్యక్రమాలను ప్రారంభించారు. దేశంలో కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించడం.. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉన్న, ప్రపంచంతో పోటీపడ గల సమర్థమైన లాజిస్టిక్స్ వ్యవస్థను ఏర్పాటు చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను రూపొందించారు.
ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) సహకారంతో ప్రభుత్వం స్మైల్ కార్యక్రమం కింద ఇంటిగ్రేటెడ్ స్టేట్, సిటీ లాజిస్టిక్స్ ప్రణాళికలను ప్రారంభించినట్లు శ్రీ గోయల్ తెలిపారు. ఎనిమిది రాష్ట్రాల్లోని ఎనిమిది నగరాల్లో స్మైల్ కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే ఉన్న లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను అంచనా వేయడానికి, అంతరాలను గుర్తించడానికి, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ఖర్చులను తగ్గించడం కోసం ఒక ప్రణాళికను అందించడానికి సహాయపడుతుందని ఆయన వివరించారు. సజావుగా వస్తువులను రవాణా చేయడం, పోటీతత్వాన్ని మెరుగుపరచడం, బలమైన సరఫరా వ్యవస్థ ఏర్పాటు కోసం దేశవ్యాప్తంగా ఇటువంటి ప్రణాళికల్ని అమలు చేసే లక్ష్యంలో ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని కేంద్ర మంత్రి తెలిపారు.
డీపీఐఐటీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడం, సరఫరా వ్యవస్థలను క్రమబద్ధీకరించడం పట్ల ప్రభుత్వ నిబద్ధతను స్పష్టం చేస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ స్టేట్, సిటీ లాజిస్టిక్స్ ప్రణాళికలను ప్రారంభించడం ఒక కీలక పరిణామం. ఇది స్థానిక లాజిస్టిక్స్ వ్యవస్థలను బలోపేతం చేస్తుంది.. జాతీయ స్థాయిలో పురోగతిని ప్రోత్సహిస్తుంది.
డీపీఐఐటీ ఇప్పటికే నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ (ఎన్ఎల్‌పీ), పీఎమ్ గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ద్వారా గణనీయ సంస్కరణలను అమలు చేసింది. లాజిస్టిక్స్ రంగంలో సామర్థ్యం, పోటీతత్వాన్ని మెరుగుపరచడానికి ఒక బలమైన ప్రాథమిక ప్రణాళికను ఇది అందిస్తుంది. మల్టీమోడల్, ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ వ్యవస్థల బలోపేత కార్యక్రమం (స్మైల్) కింద ఏడీబీ ఈ ప్రయత్నాలకు మరింత మద్దతునిస్తుంది.
రాష్ట్రాలు కూడా తమ సొంత లాజిస్టిక్స్ విధానాలు, కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకోవడం ద్వారా ఎన్ఎల్‌పీ లక్ష్యాలకు అనుగుణంగా చురుకైన చర్యలు తీసుకున్నాయి. పీఎమ్ గతిశక్తి కార్యక్రమం, ఎన్ఎల్‌పీ, డిసెంబర్ 2024లో జరిగిన నాలుగో ప్రధాన కార్యదర్శుల సమావేశం సందర్భంగా జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా.. డీపీఐఐటీ ఇప్పుడు సిటీ లాజిస్టిక్స్ ప్రణాళికలను సిద్ధం చేయడంలో రాష్ట్రాలకు మద్దతునిచ్చేందుకు ఒక ప్రణాళికాబద్ధమైన విధానాన్ని అనుసరిస్తోంది.
ఆధునికమైన, సమగ్రమైన, ప్రపంచంతో పోటీపడగల లాజిస్టిక్స్ రంగాన్ని నిర్మించే దిశగా పురోగమిస్తున్న భారత్ ప్రయాణంలో ఈ కార్యక్రమాలు ఒక కీలక ముందడుగును సూచిస్తాయి.
రాష్ట్రం - నగర లాజిస్టిక్స్ ప్రణాళిక:
https://drive.google.com/file/d/1HuUvu7mhaXB1H9DX5bJdD2wWwv1CvRTG/view?usp=drive_link
***
(Release ID: 2169070)