వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు 2025లో భాగంగా జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (ఎన్సీహెచ్)లో జీఎస్టీ ఫిర్యాదుల పరిష్కారాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ


ప్రత్యేక జీఎస్టీ ఉప కేటగిరీ కింద వినియోగదారులకు మరింత సాధికారత కల్పిస్తున్న జాతీయ హెల్ప్‌లైన్

Posted On: 20 SEP 2025 11:42AM by PIB Hyderabad

కేంద్ర ఆర్థికమంత్రి అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో ఆమోదించిన తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు 2025 తో జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్ (ఎన్సీహెచ్ను అనుసంధానించేందుకు వినియోగదారుల వ్యవహారాల శాఖ చర్యలు తీసుకుందిఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి వ్యక్తీకరించిన దార్శనికతకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు

22.09.2025 నుంచి అమలులోకి వచ్చే సవరించిన జీఎస్టీ ఛార్జీలురేట్లుమినహాయింపులను అమలు చేసిన తరువాత వినియోగదారుల నుంచి వచ్చే అవకాశం ఉన్న ప్రశ్నలుఫిర్యాదులను పరిష్కరించడానికిఐఎన్జీఆర్ఏఎం పోర్టల్లో ప్రత్యేక కేటగిరీని అందుబాటులోకి తెచ్చారుఈ కేటగిరీలో ఆటోమొబైల్స్బ్యాంకింగ్దీర్ఘకాల వినియోగ వస్తువులు-కామర్స్ఎఫ్ఎంసీజీ వంటి ప్రధాన ఉప కేటగిరీలు ఉన్నాయివీటిలో జీఎస్టీ సంబంధిత ఫిర్యాదులను నమోదు చేస్తారు

ఈ ఏర్పాటుకు సన్నాహకంగాజీఎస్టీ సంబంధిత ప్రశ్నలుఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించేలా ఎన్సీహెచ్ కౌన్సెలర్లను సన్నద్ధం చేయడానికి కేంద్ర పరోక్ష పన్నులుకస్టమ్స్ బోర్డ్ (సీబీఐసీఅధికారులు 11.09.2025న మొదటి శిక్షణా తరగతిని నిర్వహించారుప్రముఖ ఇ-కామర్స్ వేదికలుపరిశ్రమ సంఘాల ప్రతినిధులుదీర్ఘకాల వినియోగ వస్తువుల తయారీ కన్స్యూమర్ కంపెనీల భాగస్వామ్యంతో 17.09.2025న వినియోగదారుల వ్యవహారాలశాఖ కార్యదర్శి అధ్యక్షతన భాగస్వాముల సలహా సంప్రదింపుల సమావేశం కూడా జరిగిందినిర్దిష్ట వస్తువులుసేవలపై జీఎస్టీ రేటు తగ్గింపుల ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని సమావేశంలో పాల్గొన్నవారిని కోరారు.

ఈ విభాగంలో వినియోగదారుల ఫిర్యాదుల ఆధారంగా సేకరించిన సమాచారాన్నివిశ్లేషణలను సంబంధిత కంపెనీలుసీబీఐసీఇతర సంబంధిత అధికారులతో హెల్ప్‌లైన్ పంచుకుంటుందితద్వారా సంబంధిత చట్టాల ప్రకారం తక్షణ చర్యలు తీసుకునే వీలుంటుందిఈ చర్య జీఎస్టీ కట్టుబాటును బలోపేతం చేస్తుందనిసహేతుకమైన మార్కెట్ పద్ధతులలో వినియోగదారులు చురుకైన వాటాదారులుగా మారేలా భాగస్వామ్య పాలనా నమూనాను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.

జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (www.consumerhelpline.gov.inదేశవ్యాప్తంగా వినియోగదారులు తమ ఫిర్యాదులను న్యాయ ప్రక్రియకు ముందున్న దశలో నమోదు చేసుకునే ఏకైక వేదికగా ఆవిర్భవించిందివినియోగదారులు ఇప్పుడు 17 భాషల్లో (హిందీఇంగ్లీష్కాశ్మీరిపంజాబీనేపాలిగుజరాతీమరాఠీకన్నడతెలుగుతమిళంమలయాళంమైథిలీసంతాలిబెంగాలీఒడియాఅస్సామీమణిపురితమ ఫిర్యాదులను టోల్‌-ఫ్రీ నంబర్ 1915 ద్వారా లేదా ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం (ఐఎన్జీ ఆర్ఏఎంద్వారా నమోదు చేసుకోవచ్చుఈ ఐటీ ఆధారిత ఓమ్ని-చానల్ వేదిక వినియోగదారులకు సౌలభ్యాన్నిసానుకూలతను అందిస్తూవాట్సాప్ఎస్ఎంఎస్ఇమెయిల్ఎన్సీహెచ్ యాప్వెబ్ పోర్టల్ఉమాంగ్ యాప్ వంటి అనేక రకాల రిజిస్ట్రేషన్ విధానాలకు మద్దతు ఇస్తుంది.

ఎన్సీహెచ్ క్రమంగా ప్రైవేట్ కంపెనీలురెగ్యులేటర్లుఅంబుడ్స్ మన్ప్రభుత్వ ఏజెన్సీలతో కూడిన 1,142 భాగస్వాములతో కలిసి బలమైన వ్యవస్థగా అభివృద్ధి చెందిందితద్వారా కేంద్రీకృతవేగవంతమైన ఫిర్యాదుల పరిష్కారాన్ని సాధ్యమయ్యేలా చేసిందిప్రతి ఫిర్యాదుకూ పారదర్శకంగా ట్రాకింగ్పరిష్కారం కోసం ప్రత్యేకమైన డాకెట్ నంబర్ కేటాయిస్తారుప్రస్తుతం ఈ వేదికకు నెలకు లక్షకు పైగా ఫిర్యాదులు వస్తున్నాయిఇది వినియోగదారుల పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది.

ఎన్సీహెచ్ లో చేసిన సాంకేతిక మార్పు దాని కాల్‌-హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది. 2015 డిసెంబర్‌లో 12,553 కాల్స్ మాత్రమే స్వీకరించిన ఎన్సీహెచ్ 2024 డిసెంబర్ నాటికి 1,55,138 కాల్స్ అందుకుని పది రెట్లుపైగా వృద్ధి సాధించిందిఇంతటి పెరుగుదలహెల్ప్‌లైన్‌పై వినియోగదారులకు పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందిఅదేవిధంగాప్రతి నెలా నమోదయ్యే సగటు ఫిర్యాదుల సంఖ్య 2017లో 37,062 నుంచి 2025 నాటికి 1,70,585కి పెరిగిందిడిజిటల్ విధానాలను ప్రవేశపెట్టడంతోహెల్ప్‌లైన్‌లోని దాదాపు 65% వినియోగదారుల ఫిర్యాదులు ఆన్‌లైన్ డిజిటల్ ఛానెళ్ల ద్వారా నమోదు అయ్యాయి.

 

***


(Release ID: 2169068)