ప్రధాన మంత్రి కార్యాలయం
మార్చి 1,2 తేదీల్లో జార్ఖండ్, పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి పర్యటన
జార్ఖండ్ లో రూ.35,700 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి
సింద్రీ ఫెర్టిలైజర్ ప్లాంట్ ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని; గోరఖ్ పూర్, రామగుండం ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణ తర్వాత దేశంలో మూడో ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించనున్న ప్రధాని .
ఛత్రా లోని నార్త్ కరణ్ పురా సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్న ప్రధాన మంత్రి
జార్ఖండ్ లో రైల్వే రంగానికి భారీ ఊతం ఇస్తూ ఆ రాష్ట్రంలో మూడు కొత్త రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని
పశ్చిమ బెంగాల్ లో రూ.22,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, అంకితం, శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి
రఘునాథ్ పూర్ థర్మల్ పవర్ స్టేషన్ ఫేజ్ 2కు శంకుస్థాపన
హల్దియా-బరౌనీ క్రూడ్ ఆయిల్ పైప్ లైన్ ను ప్రారంభించనున్న ప్రధాని
కోల్ కతాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్టులో మౌలిక సదుపాయాల బలోపేతానికి ఉద్దేశించిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని
పశ్చిమ బెంగాల్ లో ప్రధాన దృష్టి సారించే ప్రాంతాలుగా రైలు, రోడ్డు, ఎల్ పిజి సరఫరా , మ
Posted On:
29 FEB 2024 3:48PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 మార్చి 1-2 తేదీల్లో జార్ఖండ్, ప శ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.
మార్చి 1వ తేదీ ఉదయం 11 గంటలకు జార్ఖండ్ లోని ధన్ బాద్ లోని సింద్రీకి చేరుకుని ఒక బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ జార్ఖండ్ లో రూ.35,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన మంత్రి పశ్చిమ బెంగాల్ లోని ఆరాంబాగ్, హుగ్లీ లో రూ.7,200 కోట్ల కు పైగా విలువ చేసే పలు అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేస్తారు.
మార్చి 2వ తేదీ ఉదయం 10:30 గంటలకు పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని కృష్ణానగర్ కు చేరుకుని అక్కడ రూ.15,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, అంకితం చేసి, శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు బీహార్ లోని ఔరంగాబాద్ లో రూ.21,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారు, అంకితం చేస్తారు, శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5:15 గంటలకు ప్రధాన మంత్రి బిహార్ లోని బెగుసరాయ్ కు చేరుకుని అక్కడ ఒక బహిరంగ కార్యక్రమంలో పాల్గొని దేశవ్యాప్తంగా సుమారు రూ.1.48 లక్షల కోట్ల విలువైన పలు చమురు, గ్యాస్ రంగ ప్రాజెక్టులను, బిహార్ లో రూ.13,400 కంటే ఎక్కువ విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు, అంకితం చేస్తారు.
జార్ఖండ్ లోని సింద్రీలో ప్రధాన మంత్రి
ధన్ బాద్ లోని సింద్రీలో జaరిగే బహిరంగ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ఎరువులు, రైలు, విద్యుత్ , బొగ్గు రంగానికి సంబంధించిన పలు అభివృద్ధి పథకాలకు ప్రారంబోత్సవం, జాతికి అంకితం , శంకుస్థాపన చేస్తారు. హిందుస్తాన్ ఉర్వారక్ అండ్ రసయన్ లిమిటెడ్ (హెచ్ యు ఆర్ ఎల్ ) సింద్రీ ఫెర్టిలైజర్ ప్లాంట్ ను ప్రధాన మంత్రి జాతికి అంకితం చేస్తారు. రూ.8900 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ ఎరువుల కర్మాగారం యూరియా రంగంలో స్వయం సమృద్ధి దిశగా ఒక ముందడుగు. దేశ రైతులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. గోరఖ్పూర్, రామగుండంలోని ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణ తర్వాత దేశంలో పునరుద్ధరించబడిన మూడవ ఎరువుల కర్మాగారం ఇది, వాటిని వరుసగా 2021 డిసెంబర్, నవంబర్ 2022 లో ప్రధాని జాతికి అంకితం చేశారు.
జార్ఖండ్ లో రూ.17,600 కోట్లకు పైగా విలువైన పలు రైల్వే ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించి, అంకితం చేసి, శంకుస్థాపన చేయనున్నారు.
సోనే నగర్-ఆండాళ్ ను కలిపే 3వ , 4వ లైన్; టోరి- శివపూర్ మొదటి, రెండవ, బిరటోలి- శివ్పూర్ మూడవ రైలు మార్గం (టోరి- శివ్పూర్ ప్రాజెక్టులో భాగం); మోహన్పూర్ - హాన్స్ దిహా కొత్త రైలు మార్గము; ధన్ బాద్-చంద్రపుర రైలు మార్గము మొదలైనవి ఇందులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో రైలు సేవలను విస్తరిస్తాయి. ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దారితీస్తాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మూడు రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇందులో దేవ్ఘర్ - దిబ్రూఘర్ రైలు సర్వీసు, టాటానగర్ - బాదంపహార్ మధ్య మెము రైలు సర్వీసు (డైలీ) , శివ్పూర్ స్టేషన్ నుండి సుదూర ప్రాంత సరుకు రవాణా రైలు ఉన్నాయి.
ఛత్రాలోని నార్త్ కరణ్ పురా సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఎస్టీపీపీ) యూనిట్ 1 (660 మెగావాట్లు)తో సహా జార్ఖండ్ లోని ముఖ్యమైన విద్యుత్ ప్రాజెక్టులను కూడా ప్రధాన మంత్రి జాతికి అంకితం చేస్తారు. రూ.7500 కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో మెరుగైన విద్యుత్ సరఫరాకు మార్గం సుగమం కానుంది. ఇది ఉపాధి కల్పనను పెంచుతుంది. రాష్ట్రంలో సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. అలాగే జార్ఖండ్ లో బొగ్గు రంగానికి సంబంధించిన ప్రాజెక్టులను కూడా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.
పశ్చిమ బెంగాల్ లోని ఆరాంబాగ్ లో ప్రధాన మంత్రి
హుగ్లీలోని ఆరాంబాగ్ లో రైలు, ఓడరేవులు, ఆయిల్ పైప్ లైన్, ఎల్ పిజి సరఫరా , మురుగునీటి శుద్ధి వంటి రంగాలకు సంబంధించిన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన, జాతికి అంకితం చేస్తారు.
సుమారు రూ.2,790 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన 518 కిలోమీటర్ల హల్దియా-బరౌనీ క్రూడ్ ఆయిల్ పైప్ లైన్ ను ప్రధాని ప్రారంభిస్తారు. ఈ పైప్ లైన్ బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ మీదుగా వెళుతుంది. బరౌనీ రిఫైనరీ, బొంగైగావ్ రిఫైనరీ, గౌహతి రిఫైనరీలకు సురక్షితమైన, తక్కువ ఖర్చుతో, పర్యావరణ హితమైన రీతిలో ముడి చమురును సరఫరా చేస్తుంది.
కోల్ కతాలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్టులో మౌలిక సదుపాయాల బలోపేతానికి సుమారు రూ.1000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. బెర్త్ నెం.8 ఎన్ ఎస్ డీ పునర్నిర్మాణం, కోల్ కతా డాక్ సిస్టమ్ లోని బెర్త్ నంబర్ 7, 8 ఎన్ ఎస్ డీ యాంత్రీకరణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టులోని హల్దియా డాక్ కాంప్లెక్స్ లోని ఆయిల్ జెట్టీల వద్ద అగ్నిమాపక వ్యవస్థను పెంచే ప్రాజెక్టును కూడా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అత్యాధునిక గ్యాస్, ఫ్లేమ్ సెన్సర్లతో కూడిన అత్యాధునిక పూర్తి ఆటోమేటెడ్ సెటప్ ద్వారా తక్షణమే ప్రమాదాన్ని గుర్తించేలా ఈ ఫైర్ ఫైటింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. 40 టన్నుల సామర్థ్యం కలిగిన హల్దియా డాక్ కాంప్లెక్స్ లోని మూడవ రైల్ మౌంటెడ్ క్వే క్రేన్ (ఆర్ ఎంక్యూసీ)ను ప్రధానమంత్రి అంకితం చేస్తారు. కోల్ కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఈ కొత్త ప్రాజెక్టులు వేగవంతమైన , సురక్షితమైన కార్గో హ్యాండ్లింగ్ కు , తరలింపుకు సహాయపడటం ద్వారా పోర్టు ఉత్పాదకతను గణనీయంగా పెంచుతాయి.
సుమారు రూ.2680 కోట్ల విలువైన ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టులలో ఝార్గ్రామ్ - సల్గాఝరి (90 కిలోమీటర్లు) ను కలిపే మూడవ రైలు మార్గం ఉంది; సోండాలియా - చంపపుకూర్ రైలు మార్గాన్ని డబ్లింగ్ చేయడం (24 కి.మీ); దంకుని - భట్టానగర్ - బాల్టికురి రైలు మార్గాన్ని డబ్లింగ్ (9 కి.మీ.). కూడా ఉన్నాయి.ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో రైలు రవాణా సౌకర్యాలను విస్తరిస్తాయి, చలనశీలతను మెరుగుపరుస్తాయి. ఈ ప్రాంతంలో ఆర్థి పారిశ్రామిక వృద్ధికి దారితీసే సరుకు రవాణా అంతరాయం లేని సేవలను సులభతరం చేస్తాయి.
ఖరగ్ పూర్ లోని విద్యాసాగర్ ఇండస్ట్రియల్ పార్కులో 120 టిఎంటిపిఎ సామర్థ్యంతో ఇండియన్ ఆయిల్ ఎల్ పిజి బాట్లింగ్ ప్లాంట్ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. రూ.200 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేసిన ఎల్పిజి బాట్లింగ్ ప్లాంట్ ఈ ప్రాంతంలో మొదటి ఎల్పిజి బాట్లింగ్ ప్లాంట్ అవుతుంది. పశ్చిమ బెంగాల్లో 14.5 లక్షల మంది వినియోగదారులకు ఎల్పీజీని సరఫరా చేయనుంది.
పశ్చిమ బెంగాల్ లో మురుగునీటి శుద్ధి, మురుగునీటి పారుదలకి సంబంధించిన మూడు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారు. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టులకు ప్రపంచబ్యాంకు నిధులు సమకూర్చింది. వీటిలో హౌరాలో 65 ఎంఎల్ డీ సామర్థ్యం, 3.3 కిలోమీటర్ల మురుగునీటి నెట్ వర్క్ తో ఇంటర్ సెప్షన్ అండ్ డైవర్షన్ (ఐ అండ్ డీ), సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీ); 62 ఎంఎల్ డీ సామర్థ్యం, 11.3 కిలోమీటర్ల మురుగునీటి నెట్ వర్క్ తో బల్లి వద్ద ఐ అండ్ డీ పనులు, ఎస్టీపీలు; కమర్హతి, బారానగర్ వద్ద 60 ఎం ఎల్ డి సామర్థ్యం, 8.15 కిలోమీటర్ల మురుగునీటి నెట్ వర్క్ తో ఐ అండ్ డి పనులు , ఎస్ టిపిలు ఉన్నాయి.
పశ్చిమబెంగాల్ లోని కృష్ణానగర్ లో ప్రధాని
కృష్ణానగర్ లో విద్యుత్, రైలు, రోడ్డు వంటి రంగాలకు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారు, జాతికి అంకితం చేస్తారు.
దేశంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడం కోసం పురూలియా జిల్లాలోని రఘునాథ్ పూర్ లో ఉన్న రఘునాథ్ పూర్ థర్మల్ పవర్ స్టేషన్ ఫేజ్ 2 (2×660 మెగావాట్ల)కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కు చెందిన ఈ బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్రాజెక్టు అత్యంత సమర్థవంతమైన సూపర్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఈ కొత్త ప్లాంట్ దేశ ఇంధన భద్రతను బలోపేతం చేసే దిశగా ఒక అడుగు అవుతుంది.
మెజియా థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 7, 8వ యూనిట్ల ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (ఎఫ్ జిడి) వ్యవస్థను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. సుమారు రూ.650 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఎఫ్ జీ డీ వ్యవస్థ ఫ్లూ వాయువుల నుంచి సల్ఫర్ డయాక్సైడ్ ను తొలగించి స్వచ్ఛమైన ఫ్లూ గ్యాస్ ను ఉత్పత్తి చేసి జిప్సంను తయారు చేస్తుంది.
ఎన్ హెచ్ -12 (100 కి.మీ)లోని ఫరక్కా-రాయ్ గంజ్ సెక్షన్ ను నాలుగు లేన్లుగా మార్చే రహదారి ప్రాజెక్టును కూడా ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. సుమారు రూ.1986 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టు ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది, కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ఉత్తర బెంగాల్ , ఈశాన్య ప్రాంతం సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది.
దామోదర్ - మోహిశిలా రైలు మార్గాన్ని డబ్లింగ్ చేసే ప్రాజెక్టుతో సహా పశ్చిమ బెంగాల్ లో రూ.940 కోట్లకు పైగా విలువైన నాలుగు రైలు ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. రాంపూర్హాట్ మురారై మధ్య మూడవ లైన్; బజార్సౌ - అజీంగంజ్ రైలు మార్గాన్ని డబ్లింగ్ చేయడం; అజీమ్ గంజ్ - ముర్షిదాబాద్ ను కలిపే కొత్త రైలు మార్గము. వీటిలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు రైలు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి, సరుకు రవాణాను సులభతరం చేస్తాయి. ఇంకా ఈ ప్రాంతంలో ఆర్థిక, పారిశ్రామిక వృద్ధికి దోహదం చేస్తాయి.
బీహార్ లోని ఔరంగాబాద్ లో ప్రధాని
ఔరంగాబాద్ లో రూ.21,400 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం, అంకితం, శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నెట్ వర్క్ ను బలోపేతం చేయడం ద్వారా రూ.18,100 కోట్లకు పైగా విలువైన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో 63.4 కిలోమీటర్ల పొడవైన రెండు వరుసల రహదారి, ఎన్ హెచ్ -227లోని జయనగర్-నరహియా సెక్షన్; ఎన్హెచ్-131జీలో కన్హౌలి నుంచి రామ్నగర్ వరకు ఆరు వరుసల పాట్నా రింగ్ రోడ్డు; కిషన్ గంజ్ పట్టణంలో ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్ కు సమాంతరంగా 3.2 కిలోమీటర్ల పొడవైన రెండో ఫ్లైఓవర్; 47 కిలోమీటర్ల పొడవైన భక్తియార్పూర్-రాజౌలి నాలుగు లేన్ల రహదారి; ఎన్ హెచ్ -319 లో 55 కిలోమీటర్ల పొడవైన అర్రా - పరారియా సెక్షన్ ను నాలుగు లేన్లుగా మార్చడం ఉన్నాయి.
అమాస్ నుంచి శివరాంపూర్ గ్రామం వరకు 55 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంతో సహా ఆరు జాతీయ రహదారి ప్రాజెక్టులకు; శివరాంపూర్ నుంచి రాంనగర్ వరకు 54 కిలోమీటర్ల పొడవైన నాలుగు లైన్ల గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారికి; కళ్యాణ్పూర్ గ్రామం నుండి బల్బదర్పూర్ గ్రామం వరకు 47 కి.మీ పొడవైన నాలుగు వరుసల రహదారి నియంత్రిత గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారికి; బల్బదర్ పూర్ నుంచి బేల నవాడ వరకు 42 కిలోమీటర్ల పొడవైన గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారికి; దానాపూర్ - బిహ్తా సెక్షన్ నుంచి 25 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్; బిహ్తా - కోయిల్వార్ సెక్షన్ ప్రస్తుత రెండు లేన్లను నాలుగు లేన్ల క్యారేజ్ వేగా అప్ గ్రేడ్ ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ రహదారి ప్రాజెక్టులు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి, పర్యాటకాన్ని పెంచుతాయి. ఈ ప్రాంతl సామాజిక ఆర్థిక అభివృద్ధికి దారితీస్తాయి.
పాట్నా రింగురోడ్డులో భాగంగా గంగా నదిపై నిర్మించనున్న ఆరు వరుసల వంతెనకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ వంతెన దేశంలో అత్యంత పొడవైన నదీ వంతెనలలో ఒకటి. ఈ ప్రాజెక్ట్ పాట్నా నగరం లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. బీహార్ ఉత్తర , దక్షిణ ప్రాంతాల మధ్య వేగవంతమైన , మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది, మొత్తం ప్రాంత సామాజిక-ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది.
బిహార్ లో నమామి గంగే కింద సుమారు రూ.2,190 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన పన్నెండు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులలో సైద్పూర్ అండ్ పహారీ వద్ద మురుగునీటి శుద్ధి ప్లాంట్ ; సైద్ పూర్, బేర్, పహారీ జోన్ ఐవీఏలకు మురుగునీటి పారుదల నెట్ వర్క్; కర్మాలిచక్ వద్ద మురుగునీటి నెట్ వర్క్ తో మురుగునీటి పారుదల వ్యవస్థ; పహారీ జోన్ 5 వద్ద మురుగునీటి పారుదల పథకం; బార్హ్, చాప్రా, నౌగాచియా, సుల్తాన్ గంజ్, సోనేపూర్ పట్టణాలలో ఇంటర్ సెప్షన్, డైవర్షన్ , మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు అనేక చోట్ల మురుగునీటిని గంగా నదిలోకి విడుదల చేయడానికి ముందు శుద్ధి చేస్తాయి, నది పరిశుభ్రతను పెంచుతాయి. ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయి.
పాట్నాలో యూనిటీ మాల్ కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. రూ.200 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టును అంతర్జాతీయ డిజైన్ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, సౌలభ్యం, సౌందర్యంతో కూడిన అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్నారు. ఈ మాల్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాలకు ప్రత్యేక ప్రదేశాలను అందిస్తుంది, ఇది వారి ప్రత్యేకమైన ఉత్పత్తులు , హస్తకళలను ప్రదర్శించడానికి వీలు కల్పిస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం 36 పెద్ద స్టాల్స్, బీహార్ లోని ప్రతి జిల్లాకు 38 చిన్న స్టాల్స్ ఉంటాయి. యూనిటీ మాల్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్స్, జియోగ్రాఫికల్ ఇండికేటర్స్ (జిఐ) ఉత్పత్తులు, బీహార్,, భారతదేశ హస్తకళా ఉత్పత్తుల స్థానిక తయారీ ని ప్రోత్సహిస్తుంది. ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల కల్పన, రాష్ట్రం నుంచి ఎగుమతుల పరంగా ఈ ప్రాజెక్టు గణనీయమైన సామాజిక- ఆర్థిక ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది.
పాటలీపుత్ర నుంచి పహ్లేజా రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టుతో పాటు బీహార్ లోని మూడు రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. బంధువా - పైమర్ మధ్య 26 కిలోమీటర్ల పొడవైన కొత్త రైలు మార్గం; గయలో ఒక మెము షెడ్డు, ఆరా బైపాస్ రైలు మార్గం ఇందులో ఉన్నాయి. ఈ రైలు ప్రాజెక్టులు మెరుగైన రైలు కనెక్టివిటీకి దారితీస్తాయి, లైన్ సామర్థ్యం , రైళ్ల చలనశీలతను మెరుగుపరుస్తాయి. ఇంకా ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పెంచుతాయి.
బిహార్ లోని బెగుసరాయ్ లో ప్రధాన మంత్రి
సుమారు రూ.1.48 లక్షల కోట్ల విలువైన పలు చమురు, గ్యాస్ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించి, జాతికి అంకితం చేసి, శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో బెగుసరాయ్ లో జరిగే బహిరంగ సభ దేశంలో ఇంధన రంగానికి గణనీయమైన ప్రోత్సాహాన్ని అందించనుంది. కేజీ బేసిన్ తో పాటు బీహార్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక వంటి వివిధ రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టులు విస్తరించి ఉన్నాయి.
కేజీ బేసిన్ నుంచి 'ఫస్ట్ ఆయిల్'ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని ఓఎన్జీసీ కృష్ణాగోదావరి డీప్వాటర్ ప్రాజెక్టు నుంచి తొలి క్రూడాయిల్ ట్యాంకర్ ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. కెజి బేసిన్ నుండి 'ఫస్ట్ ఆయిల్' వెలికితీత భారతదేశ ఇంధన రంగంలో ఒక చారిత్రాత్మక విజయాన్ని సూచిస్తుంది, ఇది ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుందని వాగ్దానం చేస్తుంది. ఈ ప్రాజెక్టు భారతదేశ ఇంధన రంగంలో కొత్త శకానికి నాంది పలుకుతుంది, ఇంధన భద్రతను పెంచుతుంది. ఆర్థిక స్థితిస్థాపకత కు వాగ్దానం చేస్తుంది.
బీహార్ లో సుమారు రూ.14,000 కోట్ల విలువైన చమురు, గ్యాస్ రంగ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఇందులో రూ.11,400 కోట్లకు పైగా ప్రాజెక్టు వ్యయంతో బరౌనీ రిఫైనరీ విస్తరణకు శంకుస్థాపన, బరౌనీ రిఫైనరీలో గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, పాట్నా, ముజఫర్పూర్ వరకు పారాదీప్ - హల్దియా - దుర్గాపూర్ ఎల్పిజి పైప్ లైన్ పొడిగింపు. ఉన్నాయి.
దేశవ్యాప్తంగా చేపడుతున్న ఇతర ముఖ్యమైన చమురు, గ్యాస్ ప్రాజెక్టులలో హర్యానాలోని పానిపట్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ విస్తరణ; పానిపట్ రిఫైనరీలో 3జీ ఇథనాల్ ప్లాంట్, క్యాటలిస్ట్ ప్లాంట్; ఆంధ్రప్రదేశ్ లో విశాఖ రిఫైనరీ ఆధునీకరణ ప్రాజెక్టు (వీఆర్ ఎంపీ); సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ప్రాజెక్టు, (పంజాబ్ లోని ఫజిల్కా, గంగానగర్ , హనుమాన్ గఢ్ జిల్లాలను కలిగి ఉంది) ; కర్ణాటకలోని గుల్బర్గా వద్ద కొత్త పిఒఎల్ డిపో, మహారాష్ట్రలో ముంబై హై నార్త్ రీడెవలప్మెంట్ ఫేజ్ -4, విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ)కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
బరౌనీలో హిందుస్తాన్ ఉర్వారక్ అండ్ రసయన్ లిమిటెడ్ (హెచ్ యూఆర్ ఎల్ ) ఎరువుల కర్మాగారాన్ని ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. రూ.9500 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ ప్లాంట్ రైతులకు సరసమైన ధరకు యూరియాను అందించడంతో పాటు వారి ఉత్పాదకత, ఆర్థిక స్థిరత్వానికి దారితీస్తుంది. దేశంలో పునరుద్ధరించిన నాలుగో ఎరువుల కర్మాగారం ఇది.
సుమారు రూ.3917 కోట్ల విలువైన పలు రైల్వే ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభం, శంకుస్థాపన లు చేయనున్నారు. రఘోపూర్ - ఫోర్బ్స్ గంజ్ గేజ్ కన్వర్షన్; ముకురియా-కతిహార్-కుమేద్ పూర్ రైలు మార్గాన్ని డబ్లింగ్ చేయడం; బరౌని-బచ్వారా 3, 4 వ లైన్ల ప్రాజెక్టు, కతిహార్-జోగ్బానీ రైలు విభాగం విద్యుదీకరణ మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి ఈ ప్రాంత సామాజిక ఆర్థిక అభివృద్ధికి దారితీస్తాయి. దానాపూర్ - జోగ్బానీ ఎక్స్ప్రెస్ (దర్భంగా - సక్రీ మీదుగా) సహా నాలుగు రైళ్లను కూడా ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారు. దానాపూర్ - జోగ్బానీ ఎక్స్ప్రెస్ (దర్భాంగా - సక్రీ మీదుగా); జోగ్బానీ - సహర్సా ఎక్స్ప్రెస్; సోన్పూర్-వైశాలి ఎక్స్ప్రెస్; మరియు జోగ్బాని - సిలిగురి ఎక్స్ ప్రెస్. ఇందులో ఉన్నాయి.
దేశంలో పశుసంవర్ధక జంతువులకు సంబంధించిన డిజిటల్ డేటాబేస్ 'భారత్ పశుధన్'ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్ (ఎన్డీఎల్ఎం) కింద అభివృద్ధి చేసిన 'భారత్ పశుధన్' ప్రతి పశు జంతువుకు కేటాయించిన 12 అంకెల ట్యాగ్ ఐడీని ఉపయోగిస్తుంది. ఈ ప్రాజెక్టు కింద అంచనా వేసిన 30.5 కోట్ల ఆవుల్లో ఇప్పటికే 29.6 కోట్ల పశువులను ట్యాగ్ చేసి వాటి వివరాలు డేటాబేస్ లో అందుబాటులో ఉంచారు. 'భారత్ పశుధన్' గోవులకు ట్రేసబిలిటీ వ్యవస్థను అందించడం ద్వారా రైతులకు సాధికారత కల్పిస్తుంది. వ్యాధి పర్యవేక్షణ, నియంత్రణకు కూడా సహాయపడుతుంది.
'భారత్ పశుధన్' డేటాబేస్ కింద ఉన్న మొత్తం డేటా, సమాచారాన్ని నమోదు చేసే '1962 ఫార్మర్స్ యాప్'ను కూడా ప్రధాని ప్రారంభిస్తారు.
***
(Release ID: 2168793)
Visitor Counter : 6
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam