ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన భారత రాష్ట్రపతి.. కృత‌జ్ఞత‌లు తెలిపిన ప్రధాని

Posted On: 17 SEP 2025 9:14AM by PIB Hyderabad

75వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి... రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్మూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిగా ప్రధాని కృత‌జ్ఞత‌లు తెలిపారు. ‘‘140 కోట్ల మంది దేశ ప్రజలు చూపిస్తున్న ప్రేమవారు అందిస్తున్న అండదండలతో భారత్‌ను సుద‌ృఢమైనసమర్థమైనస్వావలంబన కలిగిన దేశంగా తీర్చిదిద్దేందుకు మనం నిత్యం అంకితభావంతో కృషి చేద్దాంఈ  బాటలో ముందుకు నడిచేందుకు మీ దార్శనికతతో పాటు మీ మార్గదర్శకత్వం మాకెంతో స్ఫూర్తినిస్తున్నాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్‌’’లో ప్రధానమంత్రి ఈరోజు ఒక సందేశాన్ని నమోదు చేస్తూ...

‘‘
గౌరవ రాష్ట్రపతి (@rashtrapatibhvn) గారూమీరు నాకు శుభాకాంక్షలను అందించినందుకు నేను అనేకానేక ధన్యవాదాలతో పాటు కృతజ్ఞత‌లను వ్యక్తం చేస్తున్నా. 140 కోట్ల మంది దేశవాసులు చూపిస్తున్న ప్రేమతోవారు అందిస్తున్న మద్దతుతో భారత్‌ను సుద‌ృఢమైనసమర్థమైనస్వావలంబన దిశగా దేశాన్ని తీర్చిదిద్దేందుకు మనం నిత్యం అంకితభావంతో కృషి చేద్దాంఈ దిశగా ముందుకు నడిచేందుకు మీ దార్శనికతమీ మార్గదర్శకత్వం మాకెంతో స్ఫూర్తినిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు. 


 

***

 

(Release ID: 2167762) Visitor Counter : 2