ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత

బలపరుచుకోవాలన్న నిబద్ధతను పునరుద్ఘాటించిన ఇద్దరు నేతలు
ఉక్రెయిన్ సంఘర్షణకు శాంతియుత, సత్వర పరిష్కార సాధనపై

ఆలోచనలను పంచుకున్న నేతలు
భారత్- ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని

త్వరలో పూర్తి చేయడానికి మద్దతు తెలిపిన ప్రధాని మెలోనీ
ఐఎంఈఈఈసీ కార్యక్రమంలో భాగంగా అనుసంధానాన్ని

ప్రోత్సహించేందుకు నిబద్ధత చాటిన నేతలు

प्रविष्टि तिथि: 10 SEP 2025 6:23PM by PIB Hyderabad

ఇటలీ ప్రధాని గౌరవ జార్జియా మెలోనీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్లో మాట్లాడారు.

పెట్టుబడిరక్షణఅంతరిక్షంప్రజల మధ్య పరస్పర సంబంధాలతో పాటు తీవ్రవాదాన్ని నిరోధించడం వంటి రంగాల్లో ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో చోటుచేసుకొన్న అభివృద్ధిని ఇద్దరు నేతలు సమీక్షించారు.
ఇరు దేశాల ప్రయోజనాలు ముడిపడి ఉన్న ప్రాంతీయప్రపంచ అంశాలపై వారు తమ ఆలోచనలను ఒకరితో మరొకరు పంచుకున్నారుఉక్రెయిన్‌లో సంఘర్షణ.. సాధ్యమైనంత త్వరగానుశాంతియుతంగా పరిష్కారమవ్వాల్సిన అవసరం ఎంతయినా ఉందని అభిప్రాయపడ్డారుఈ దిశగా సాగుతున్న ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతును అందిస్తోందని ప్రధానమంత్రి శ్రీ  మోదీ పునరుద్ఘాటించారు.  

ఇరు పక్షాలకు ప్రయోజనకరంగా ఉండే భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వీలైనంత త్వరలో కొలిక్కి రావడంతో పాటు వచ్చే ఏడాదిలో భారత్ నిర్వహించనున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ విజయవంతం కావడానికి కూడా ఇటలీ అండదండలు అందిస్తుందని ప్రధాని మెలోనీ పునరుద్ఘాటించారుఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎంఈఈఈసీకార్యక్రమంలో భాగంగా అనుసంధానాన్ని ప్రోత్సహించడానికి కృషి చేద్దామని నేతలు అంగీకారం వ్యక్తం చేశారు.
తరచూ సంప్రదించుకోవాలని కూడా నేతలు సమ్మతించారు.

 

***


(रिलीज़ आईडी: 2165599) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , Tamil , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam