భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారీ పరిశ్రమలపై నూతన జీఎస్టీ రేట్ల ప్రభావం

Posted On: 08 SEP 2025 1:56PM by PIB Hyderabad

భారీ పరిశ్రమలకు సంబంధించిన అనేక వస్తువులపై కొత్త జీఎస్టీ రేట్లుశ్లాబులు విస్తృత ప్రభావాన్ని చూపిస్తాయివాటికి సంబంధించిన పూర్తి వివరణ దిగువన పేర్కొన్న విధంగా ఉంది:

ఆటోమొబైల్స్

  • ఆటోమొబైల్ రంగంలో బైకులు (350 సీసీ బైకులతో సహా 350 సీసీ వరకు), బస్సులుచిన్న కార్లుమీడియంలగ్జరీ కార్లుట్రాక్టర్లు (1800 సీసీ తక్కువసహా వివిధ విభాగాల్లో జీఎస్టీ రేటు తగ్గింది.

  • వాహన విడి భాగాలపై కూడా ఈ రేటు తగ్గుతుంది.

  • డిమాండును పెంచడం ద్వారా ఆటోమొబైల్ తయారీదారులుఅనుబంధ పరిశ్రమ (టైర్లుబ్యాటరీలువిడి భాగాలుగ్లాసుస్టీలుప్లాస్టిక్ఎలక్ట్రానిక్స్తదితరమైనవి)లకు జీఎస్టీ తగ్గింపు సహాయపడుతుంది.

  • పెరుగుతున్న వాహనాల అమ్మకాలు విడిభాగాలకు ఆర్డర్లను పెంచుతాయిఫలితంగా ఈ సరఫరా వ్యవస్థలో ప్రధాన భాగమైన ఎంఎస్ఎంఈలపై గుణాత్మక ప్రభావాన్ని చూపిస్తాయి.

  • తయారీఅమ్మకాలుఆర్థికంనిర్వహణతదితర విభాగాల్లో 3.5 కోట్ల ఉద్యోగాలకు మొత్తం వాహన పరిశ్రమ ప్రత్యక్షంగాపరోక్షంగా మద్దతు అందిస్తుంది.

  • డిమాండ్‌లో ఈ పెరుగుదల డీలర్షిప్పులుట్రాన్స్‌పోర్టు సేవలులాజిస్టిక్స్ఎంఎస్ఎంఈ రంగాల్లో కొత్త ఉద్యోగాలను కల్పిస్తుంది.

  • అసంఘటిత రంగంలో ఉద్యోగులు (డ్రైవర్లుమెకానిక్‌లుచిన్న సర్వీసు గ్యారేజీలుకూడా ప్రయోజనం పొందుతారు.

  • వాహన కొనుగోళ్లు కూడా రుణ ఆధారితమైనవే (ఎన్‌బీఎఫ్‌సీలుబ్యాంకులుఫిన్‌టెక్ రుణాలు ఇచ్చేవారు). వాహన అమ్మకాల్లో పెరుగుదల రీటైల్ రుణాల వృద్ధికివాహన నాణ్యత పెరుగుదలకుసెమీ-అర్బన్ ప్రాంతాల్లో ఆర్థిక సమ్మిళిత్వాన్ని విస్తరించేందుకు తోడ్పడుతుంది.

  • హేతుబద్దీకరించిన జీఎస్టీ రేట్ల ద్వారా లభించే విధాన హామీ ఆటోమొబైల్ రంగంలో కొత్త పెట్టుబడులను పెంపొందిస్తుందిఇది మేక్ ఇన్ ఇండియాతయారీ రంగాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.

  • కొత్తఇంధన సామర్థ్యం కలిగిన మోడళ్లతో పాత వాహనాలను భర్తీ చేసేలా జీఎస్టీ రేటు తగ్గింపు ప్రోత్సహిస్తుందిఅలాగే.. పర్యావరణహిత వాహన రంగానికి మద్దతు ఇస్తుంది.

ద్విచక్ర వాహనాలు (350 సీసీ బైకులతో సహా 350 సీసీ బైకుల వరకు)- (28 నుంచి 18 శాతానికి)

  • జీఎస్టీ రేటు తగ్గించడం వల్ల యువతనిపుణులుదిగువ మధ్యతరగతి కుటుంబాలకు బైకుల ధరలు అందుబాటులో ఉంటాయి.

  • భారత్‌లో గ్రామీణసెమీ అర్బన్ ప్రాంతాల్లో బైకులే ప్రాథమిక రవాణా సాధనాలుతక్కువ ధరల్లో లభించే ద్విచక్ర వాహనాల వల్ల రైతులుచిన్న వ్యాపారులురోజు కూలీలకు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుంది.

  • ద్విచక్ర వాహనాల ధరలురుణాల ఈఎంఐ తగ్గడం వల్ల గిగ్ వర్కర్లకు ప్రయోజనం చేకూరుతుందనివారి పొదుపు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

చిన్న కార్లు (28 నుంచి 18 శాతానికి తగ్గిన జీఎస్టీ)

  • అందుబాటు ధరల విభాగంలో.. కార్లు మరింత చౌకగా లభించడం వల్ల మొదటిసారి కొనుగోలు చేసేవారికి ప్రోత్సాహం లభించడంతో పాటు.. దేశీయంగా రవాణా వ్యవస్థ విస్తరిస్తుంది.

  • చిన్న కార్లు ఎక్కువగా ఉండే.. చిన్న నగరాలుపట్టణాల్లో వాటి అమ్మకాలను తగ్గిన జీఎస్టీ మరింత పెంచుతుంది.

  • అమ్మకాలు పెరగడం వల్ల కారు డీలర్షిప్పులుసర్వీసు వ్యవస్థలుడ్రైవర్లుఆటో-ఫైనాన్స్ సంస్థలకు ప్రయోజనం చేకూరుతుంది.

  • (ఇందులో 1200 సీసీ కంటే తక్కువనాలుగు మీటర్ల పొడవు మించని పెట్రోల్ ఇంజిన్ కార్లు, 1500 సీసీ కంటే తక్కువ నాలుగు మీటర్ల పొడవు మించని డీజిల్ కార్లు ఉన్నాయి)

పెద్ద కార్లు (సెస్ తొలగించిన తర్వాత 40 శాతానికి తగ్గిన జీఎస్టీ)

  • అదనపు సెస్ తొలగించడం వల్ల ధరలు తగ్గడమే కాకుండా.. పన్ను విధానం సులభతరంగాఊహించదగినదిగా మారుతుంది.

  • 40 శాతం వద్ద కూడా సెస్ లేకపోవడం వల్ల పెద్ద కార్లపై విధించే పన్ను తగ్గుతుందిఫలితంగా వాటిని కొనుగోలు చేయాలనుకొనేవారికి అవి మరింత చౌకగా అందుబాటులోకి వస్తాయి.

  • పన్ను రేటును 40 శాతానికి తగ్గించడంసెస్ తొలగించడం వల్ల ఈ పరిశ్రమలు పూర్తిగా ఐటీసీకి అర్హత పొందుతాయనే హామీ లభిస్తుందిఅయితే గతంలో ఐటీసీని సెస్‌ను మినహాయించి 28 శాతం వరకు మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉండేది.

ట్రాక్టర్లు (1800 సీసీ కంటే తక్కువ ఉన్నవాటికి 12 నుంచి శాతానికి తగ్గింది)

సెమీ ట్రైలర్ల కోసం రోడ్డు ట్రాక్టర్లు (1800 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న వాటికి 28 నుంచి 18 శాతానికి తగ్గింది)

ట్రాక్టర్ విడి భాగాలపై శాతానికి తగ్గింది

  • ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాక్టర్ మార్కెట్లలో భారత్ ఒకటిజీఎస్టీ తగ్గింపు కారణంగా దేశీయఎగుమతుల విభాగాల్లో డిమాండు పెరుగుతుంది.

  • టైర్లుగేర్లు తదితరమైన ట్రాక్టర్ తయారీకి ఉపయోగించే విడి భాగాలకు అయిదు శాతం మాత్రమే పన్ను వర్తిస్తుంది.

  • ఇంజిన్లుటైర్లుహైడ్రాలిక్ పంపులువిడి భాగాల ఉత్పత్తి పెరగడం వల్ల వాటిని తయారుచేసే అనుబంధ ఎంఎస్ఎంఈలు ప్రయోజనం పొందుతాయిజీఎస్టీ తగ్గింపు.. అంతర్జాతీయ ట్రాక్టర్ తయారీ కేంద్రంగా భారత్ స్థానాన్ని సైతం బలోపేతం చేస్తుంది.

  • ట్రాక్టర్లు చౌకగా లభించడం వల్ల వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరుగుతుందిఇది వరిగోధుమ లాంటి ప్రధాన పంటల దిగుబడిని పెంచుతుంది.

బస్సులు (10+ సీటింగ్ కెపాసిటీ ఉన్నవి) [28 నుంచి 18 శాతానికి తగ్గిన జీఎస్టీ]

  • బస్సులుమినీ బస్సుల (10 కంటే ఎక్కువ సీట్లు ఉన్నవిప్రారంభ ఖర్చును తక్కువ పన్ను రేటు తగ్గిస్తుంది.

  • దీనివల్ల ఫ్లీట్ ఆపరేటర్లుకార్పొరేట్లుపాఠశాలలుటూర్ ఆపరేటర్లురాష్ట్ర రవాణా సంస్థలు నుంచి డిమాండును పెంచుతుంది.

  • ప్రయాణికులకు (ముఖ్యంగా సెమీ-అర్బన్/గ్రామీణ రూట్లలోటిక్కెట్టు ధరలు అందుబాటులోకి వస్తాయి.

  • వ్యక్తిగత వాహనాల నుంచి ఉమ్మడి/ప్రజా రవాణా వ్యవస్థకు మారేలా ప్రోత్సహించిరద్దీనికాలుష్యాన్ని తగ్గిస్తుంది.

  • వాహనాల విస్తరణఆధునికీకరణను ప్రోత్సహిస్తుంది.

  • ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకొనేలా ప్రోత్సహిస్తుంది.

వాణిజ్య వస్తువుల వాహనాలు (ట్రక్కులుడెలివరీ-వ్యాన్లుతదితరమైనవి) [28 నుంచి 18 శాతానికి తగ్గిన జీఎస్టీ]

  • భారతీయ సరఫరా వ్యవస్థకు ట్రక్కులే ప్రధానాధారం (65 నుంచి 70 శాతం వస్తువులను రవాణా చేస్తాయి).

  • తగ్గించిన జీఎస్టీ వల్ల ట్రక్కులపై ప్రారంభ పెట్టుబడి వ్యయంతో పాటుటన్ను-కి.మీ.కు రవాణా ధరలు కూడా తగ్గుతాయి.

  • ఈ ప్రభావం వల్ల వ్యవసాయ ఉత్పత్తులుసిమెంట్ఉక్కుఎఫ్ఎంసీజీ-కామర్స్ డెలివరీలు చౌకగా మారుస్తుందిఇది ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గిస్తుంది.

  • భారత రోడ్డు రవాణా వ్యవస్థలో అధిక వాటా ఉన్న ఎంఎస్ఎంఈ ట్రక్కు యజమానులకు మద్దతు ఇస్తుంది.

  • చౌకగా లభించే ట్రక్కులు రవాణా వ్యయాన్ని తగ్గించడంలోఎగుమతుల్లో పోటీతత్వాన్ని పెంచడంలో ప్రత్యక్షంగా సహాయపడతాయి.

  • వస్తువులను రవాణా చేసే వాహనాలకు థర్డ్ పార్టీ బీమాపై ఐటీసీతో సహా 12 నుంచి శాతానికి తగ్గిన జీఎస్టీ ఈ ప్రయత్నాలకు తోడ్పడుతుంది.

  • దీనిలో ‘రిఫ్రిజరేటెడ్ మోటార్ వాహనాలు’ భాగం కావు (వాటికి ప్రత్యేకమైన విభాగం ఉంది).

  • పీఎం గతి శక్తిజాతీయ రవాణా విధాన లక్ష్యాలకు అనుగుణంగా తోడ్పడుతుంది.

వాహన విడిభాగాలు

  • మోటారు కార్లుమోటారు బైకుల తయారీకి ఉపయోగించే విడిభాగాల్లో ఎక్కువ వాటికి పన్ను రేటు 18 శాతానికి తగ్గింది.

వస్తువులుప్రయాణికుల రవాణాకు సంబంధించిన సేవల్లో సైతం గణనీయమమైన మార్పులుహేతుబద్దీకరణ జరిగిందని గుర్తించడం చాలా ముఖ్యంఅవసరమైన చోట్ల రేట్లు తగ్గాయిపర్యవసాన ప్రభావాన్ని నివారించడానికి ఐటీసీని ఆమోదించారు.

అలాగేరోడ్డు ద్వారా వస్తువులుప్రయాణికుల రవాణాకు సంబంధించి రెండు రేట్లు ఐచ్ఛికాలుగా ఉన్నాయివ్యాపార అవసరాలకు అనుగుణంగా శాతం లేదా 18 శాతాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

 

***


(Release ID: 2164765) Visitor Counter : 2