బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2025 సెప్టెంబర్ 4న ముంబయిలో బొగ్గు, లిగ్నైట్ గనులకు స్టార్ రేటింగ్ అవార్డుల ప్రదానోత్సవం

Posted On: 03 SEP 2025 11:24AM by PIB Hyderabad

బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతిష్ఠాత్మక స్టార్ రేటింగ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని 2025 సెప్టెంబరు 4న మహారాష్ట్రలోని ముంబయిలో నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గులిగ్నైట్ గనుల్లో అత్యున్నత పనితీరుపర్యావరణ సంరక్షణభద్రతసామాజిక అభివృద్ధి వంటి అంశాల్లో అసాధారణ ప్రదర్శనకు ఈ కార్యక్రమం గుర్తింపునిస్తుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జికిషన్ రెడ్డి హాజరవుతారుసహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే కూడా కార్యక్రమంలో పాల్గొంటారువారితోపాటు బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులుప్రభుత్వ రంగ బొగ్గు సంస్థల ప్రతినిధులుపారిశ్రామిక భాగస్వాములు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.

బొగ్గు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్టార్ రేటింగ్ వ్యవస్థ.. బొగ్గులిగ్నైట్ గనుల అత్యుత్తమ పనితీరుకు గుర్తింపునిస్తుందిబాధ్యతాయుతమైన మైనింగ్ పద్ధతులను ప్రోత్సహించడంపరిశ్రమ ప్రమాణాలను మెరుగుపరచడంఈ రంగంలో సుస్థిర వృద్ధిని పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యం. ఏడు మాడ్యూళ్ల పరిధిలో నిర్మాణాత్మకసమగ్ర ఏర్పాటు ద్వారా.. మంత్రిత్వ శాఖ గనుల పనితీరును విశ్లేషిస్తుందిఅవిమైనింగ్ కార్యకలాపాలుపర్యావరణ ప్రమాణాలుసాంకేతిక పరిజ్ఞానంఉత్తమ పద్ధతుల స్వీకరణఆర్థిక పనితీరు, పునరావాసంకార్మిక సంబంధిత అనుమతిభద్రత రక్షణ. గనులకు సంబంధించి భూగర్భఓపెన్ కాస్ట్మిశ్రమ అనే మూడు విభాగాల పరిధిలో ఫైవ్స్టార్ నుంచి నో స్టార్ వరకు రేటింగ్ ఇస్తారు.

2023–24 అంచనా సంవత్సరానికిగాను స్టార్ రేటింగ్ మదింపు కోసం మొత్తం 383 గనులను ఎంపిక చేశారు. వీటిలో 42 గనులు 93 శాతానికి పైగా సాధించి ప్రతిష్ఠాత్మక ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించాయి. వీటిలో గనులు మొదటి ర్యాంకు, 3 గనులు రెండో ర్యాంకు, 6 గనులు మూడో ర్యాంకు సాధించాయి. 29 గనులకు అచీవర్స్ బహుమతి లభించింది.

సులభ వినియోగ సదుపాయమున్న డాష్‌ బోర్డుతో కూడిన సీసీవో (బొగ్గు నియంత్రణ సంస్థవెబ్‌సైట్ ప్రారంభంఅలాగే కర్బన సంగ్రహణవినియోగంనిల్వ (సీసీయూఎస్)పై హ్యాకథాన్‌కు అవార్డుల ప్రదానం కూడా స్టార్ రేటింగ్ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఉంటాయిఅంతేకాకుండా ఏఆర్టీహెచ్ఏ (బొగ్గు తొలగించిన గనుల పునర్వినియోగం కోసం పర్యావరణ హిత ఆర్థిక ఏర్పాటు), అలాగే గనులను బాధ్యతాయుతంగాపర్యావరణ హిత పద్ధతిలో మూసివేయడం కోసం సమగ్ర మార్గదర్శకాలతో కూడిన ఎల్..వి..ఎస్ ను కూడా ఈ సందర్భంగా విడుదల చేస్తారు.

ఈ స్టార్ రేటింగ్ అవార్డుల ఎడిషన్ బొగ్గు రంగంలో అంకితభావంఆవిష్కరణల స్ఫూర్తిని చాటుతుందిసుస్థిర మైనింగ్ పద్ధతులుఇంధన భద్రతసామాజిక సంక్షేమంలో మంత్రిత్వ శాఖ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. గనులకు సంబంధించి ఈ రకమైన గుర్తింపు ప్రక్రియ ఉత్తమ పద్ధతులను విస్తృతంగా అనుకరించడాన్ని ప్రోత్సహిస్తుందిదేశంలో బొగ్గు గనుల పరిశ్రమ బాధ్యతాయుతంగాభవిష్యత్సన్నద్ధంగా ఉండాలన్న లక్ష్యాన్ని ఇది బలోపేతం చేస్తుంది.

 

***


(Release ID: 2163436) Visitor Counter : 2