జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

ట్రాన్స్‌జెండర్ల హక్కులపై న్యూఢిల్లీలో ఎన్‌హెచ్ఆర్‌సీ సదస్సు: ఇతివృత్తం: రీవాంపింగ్ స్పేసెస్, రీక్లయిమింగ్ వాయిసెస్ తేదీ: సెప్టెంబర్ 4, 2025

Posted On: 02 SEP 2025 1:07PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటెట్ సెంటర్లోని స్టెయిన్ ఆడిటోరియంలో 2025, సెప్టెంబర్ 4, గురువారం ట్రాన్స్‌జెండర్ల హక్కులపై జాతీయ స్థాయి సదస్సును భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీనిర్వహిస్తుంది. ‘‘రీవాంపింగ్ స్పేసెస్రీక్లయిమింగ్ వాయిసెస్’’ ఇతివృత్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో వ్యవస్థీకృత వివక్షపై పోరాడటంజీవిత అనుభవాలను మెరుగుపరచడంఅన్ని ప్రదేశాల్లోనూ ట్రాన్స్‌జెండర్ల అర్థవంతమైన సమ్మిళిత్వాన్ని ప్రోత్సహించాల్సిన తక్షణావసరంపై దృష్టి సారిస్తారుఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్ జస్టిస్ శ్రీ వీ రామసుబ్రమణియన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారుప్రభుత్వ అధికారులున్యాయాధికారులున్యాయ నిపుణులువిధాన రూపకర్తలుపౌర సంఘాలుప్రజా నాయకులువిద్యావేత్తలుప్రభుత్వ సంస్థలుపత్రికా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారుభారత్‌లో ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలువారికి లభించే అవకాశాలువారి హక్కులకు హామీ ఇచ్చే.. విధాన ప్రాధాన్యాలపై ఒక రోజు పాటు నిర్వహించే ఈ సదస్సులో విస్తృతంగా చర్చిస్తారు.

ట్రాన్స్‌జెండర్ల హక్కులుసంక్షేమంపై చర్చించేందుకు జాతీయ వేదికను తయారు చేయడంట్రాన్స్‌జెండర్ పర్సన్స్ చట్టం- 2019, స్మయిల్ పథకంలాంటి న్యాయపరమైన ప్రొవిజన్లుసంక్షేమ పథకాల అమలును సమీక్షించడంసంస్థాగత సంరక్షణను బలోపేతం చేయడానికిచులకన భావాన్ని తగ్గించడానికివిద్యఆరోగ్యంఉపాధి అవకాశాలను విస్తరించేందుకు ఆచరణ సాధ్యమైన విధాన సంస్కరణలను సూచించడమే ఈ సదస్సు లక్ష్యంఅలాగే చట్టాన్ని అమలు చేసే సంస్థల్లో జవాబుదారీతనంచైతన్యం ఉండేలా నిర్ధారిస్తూనే.. ట్రాన్స్‌జెండర్ల స్వరాన్నిపోరాడేతత్వాన్ని గౌరవిస్తూ భారతీయ సామాజిక వ్యవస్థలో వారి భాగస్వామ్యాన్ని కూడా గుర్తిస్తుంది.

భారతీయ సామాజికసాంస్కృతిక వ్యవస్థలో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ఎల్లప్పుడూ ఒక భాగంగా ఉన్నారుతెర వెనుక సాగించే ప్రయాణం నుంచి గుర్తింపు వరకు సమ్మిళిత్వం దిశగా వారి పురోగతిని ప్రతిబింబిస్తుందిఒకప్పుడు ఇతిహాసాలుసంప్రదాయాలుసామాజిక ఆచారాల్లో మన్నన పొందిన ఈ వర్గానికి కాలక్రమేణా గౌరవంసామాజిక హోదా తగ్గుతూ వచ్చాయిఫలితంగా ఆమోదంసమానత్వం కోసం పోరాటం చేసే పరిస్థితులు ఎదురయ్యాయి.

స్వాతంత్రం వచ్చిన తర్వాతి దశాబ్దాల్లో సమానత్వంగౌరవంవివక్ష రహిత రాజ్యాంగ హామీలు ఉన్నప్పటికీ భారత్‌లోని ట్రాన్స్‌జెండర్లు నిరాదరణకుఅణచివేతకు గురవుతున్నారుఅయితే.. వీరి సంకల్పానికి పౌర సమాజంసామాజికన్యాయపరమైన సహకారం తోడవడంతో.. ఈ కథ సరికొత్త రూపం సంతరించుకుంటోందిస్వీయగుర్తింపును ప్రాథమిక హక్కుగాట్రాన్స్‌జెండర్లను ‘‘థర్డ్ జెండర్’’గా గుర్తిస్తూ.. ఎన్ఏఎల్ఎస్ఏ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2014)లో సుప్రీంకోర్టు వెలువరించిన చరిత్రాత్మక తీర్పు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందివివక్షను రూపుమాపిసంక్షేమానికిసమ్మిళిత్వానికి విధాన ప్రక్రియను రూపొందించే ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్యాక్ట్, 2019 ద్వారా ఈ గుర్తింపు మరింత బలోపేతం అయింది.

విద్యఆరోగ్యంఉపాధిసామాజిక భద్రతకు సమాన అవకాశాలకు హామీ ఇవ్వాలని కోరుతూ 2023లో ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి సమగ్ర సూచనలు జారీ చేయడం ద్వారా... ఈ ప్రయాణాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందుకు తీసుకెళ్లిందివెనకబాటుతనం నుంచి గౌరవం పొందే వరకునిశ్శబ్దం నుంచి స్వరాన్ని వినిపించేంత వరకుబహిష్కరణ నుంచి సమ్మిళిత్వం వరకు సాగుతున్న స్థిరమైన ప్రయాణాన్ని ఈ విజయాలు సూచిస్తాయిఈ సానుకూల మార్పుల ఆధారంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు.. సమ్మిళిత్వానికి నూతన అవకాశాలను వెతకడంతో పాటు.. ప్రతి ట్రాన్స్‌జెండర్ గౌరవంఅవకాశంగర్వంతో నివసించేలా హామీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది.

నిరాశ్రయులైన వయోజన ట్రాన్స్‌జెండర్లకు సురక్షితమైన ఆవాసంసమగ్ర సాయం అందించేందుకు గరిమా గృహ కార్యక్రమాన్ని సామాజిక న్యాయంసాధికారత మంత్రిత్వ శాఖ ఆరంభించిందిఈ కార్యక్రమాన్ని తొమ్మిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 12 షెల్టర్లతో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారుఇప్పుడు ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ పథకం స్మయిల్ లో విలీనమైందిసురక్షితమైన ఆశ్రయంఅవసరమైన సౌకర్యాలుఆరోగ్య సేవలుకౌన్సెలింగ్నైపుణ్యాభివృద్ధిజీవనోపాధి అవకాశాలతో సహా ఏడాది వరకు తాత్కాలిక పునరావాసాన్ని లక్షిత లబ్ధిదారులకు ఈ పథకం అందిస్తుందితద్వారా గౌరవంస్వాతంత్ర్యంతో సమాజంలో పునరేకీకృతమయ్యేలా చేస్తుంది.

ప్రగతిశీల లక్ష్యాలు ఉన్నప్పటికీనిధుల విడుదలలో జాప్యంనిర్వహణా సవాళ్లువ్యవస్థాగత అంతరాలను ఈ పథకం ఎదుర్కొంటోందిపరిమిత కవరేజీతగినన్ని మౌలిక సదుపాయాలు లేకపోవడంలక్షిత లబ్ధిదారులలో తక్కువ అవగాహనప్రభావంతంగా సామాజిక పునరేకీకరణ చేయడంలో ఇబ్బందులు వంటి సమస్యలను గరిమా గృహ ఆశ్రయాలు ఎదుర్కొంటున్నాయిఈ వర్గానికి ఉన్న సున్నితత్వాన్నిఈ సవాళ్లను అర్థం చేసుకొనిఈ కార్యక్రమం తన లక్ష్యాలను సమగ్రంగా నెరవేరుస్తోందని నిర్దారించుకోవడానికిగరిమా గృహ నిర్వహణలో వాస్తవాలను అంచనా వేయడానికి ఎన్‌హెచ్ఆర్‌సీ క్షేత్రస్థాయిలో పర్యటించిందిఇలాంటి పునరావాస కార్యక్రమాలను మెరుగ్గా అమలు చేయడంపర్యవేక్షించడం ద్వారా ట్రాన్స్‌జెండర్ల హక్కులుసంక్షేమాన్ని నిలబెట్టడానికి కమిషన్‌కున్న అంకితభావంలో ఈ అంచనా ఓ భాగం.

ఈ పర్యటనల ఫలితాల ఆధారంగా.. ట్రాన్స్‌జెండర్ల హక్కులువారి గౌరవాన్ని కాపాడే విధానాలునిబంధనలను బలోపేతం చేయడమే లక్ష్యంగా.. సమగ్ర నివేదికను కమిషన్ సిద్ధం చేసిందిఇప్పటికే ఉన్న మార్గదర్శకాల అమలులో అంతరాలను గుర్తించడంప్రభావవంతమైన ప్రయేమాలను తెలియజేయడం ద్వారా విధాన సంస్కరణలకు ఆధార సహితమైన సిఫార్సులను ఈ పరిశోధన అందిస్తుందిఈ ప్రయత్నాల కొనసాగింపుగా.. కీలకమైన అంశాలను చర్చించడానికిముందుకు తీసుకెళ్లడానికి ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల హక్కులపై జాతీయ సమావేశాన్ని కమిషన్ నిర్వహిస్తోంది.

ఈ జాతీయ సదస్సును నాలుగు సెషన్లుఒక ముగింపు కార్యక్రమంగా రూపొందించారుప్రతి సెషన్ కీలకమైన ప్రాధాన్యాంశాలపై దృష్టి సారిస్తుందిక్షేత్ర స్థాయి పర్యటనల్లో ఎన్‌హెచ్‌ఆర్‌సీ కనుగొన్న అంశాలను సమర్పిస్తూ.. స్మయిల్ పథకం ద్వారా గరిమా గృహ షెల్టర్లను బలోపేతం చేయడంపై మొదటి కార్యక్రమంలో సమీక్షిస్తారుఅలాగే.. మౌలిక సదుపాయాలుఆరోగ్యసేవలువిద్యజీవనోపాధి తోడ్పాటును పెంపొందించడంపై చర్చిస్తుందిజెండర్ నాన్ కన్ఫర్మింగ్ చిన్నారులువయసు మళ్లిన ట్రాన్స్‌జెండర్ల విషయంలో సంస్థాగత సంరక్షణపై రెండో సెషన్ దృష్టి సారిస్తుందిఅలాగే చిన్నారుల సంరక్షణ చట్టాల్లో న్యాయపరమైన అంతరాలను చూపుతూ.. చిన్న వయసులోనే తిరస్కరణను ఎదుర్కొంటున్న వారికిశాశ్వత తోడ్పాటు అవసరమయ్యే వృద్ధ ట్రాన్స్‌జెండర్లకు సంపూర్ణ రక్షణను అందించే మార్గాలను అన్వేషిస్తుందిట్రాన్స్‌జెండర్లు తరచూ ఎదుర్కొనే వేధింపులను పరిష్కరించేలా న్యాయమైనసమగ్ర చట్ట అమలు విధానాన్ని రూపొందించడంపై మూడో సెషన్లో చర్చిస్తారుఅలాగే ట్రాన్స్‌జెండర్ల ప్రొటెక్షన్ సెల్స్ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థపోలీసుభద్రతా దళాల్లో ట్రాన్స్‌జెండర్ల ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహించడంపై చర్చిస్తారుచివరి సెషన్లో నిర్వహించే అన్‌లాకింగ్ ఎంప్లాయ్‌మెంట్డిఫైయింగ్ ఛాలెంజెస్ స్టోరీస్ ఆఫ్ ట్రయంఫ్లో నైపుణ్యాభివృద్ధిఔత్సాహిక పారిశ్రామికరంగంసమ్మిళిత నియమాల ద్వారా గౌరవప్రదమైన ఉపాధిని కల్పించే అవకాశాలపై చర్చిస్తారుఅలాగే.. ప్రభుత్వంసామాజిక కార్యక్రమాల తోడ్పాటుతో అవరోధాలను అధిగమించి విజేతలుగా నిలిచిన ట్రాన్స్‌జెండర్ల విజయ గాథలను ప్రదర్శిస్తారు.

ఈ ప్యానెల్లో సామాజిక న్యాయంసాధికారత మంత్రిత్వ శాఖమహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖజాతీయ మహిళా కమిషన్యూఎన్ ఏజెన్సీవిద్యాసంస్థలుసామాజిక ప్రతినిధులు,  అధికారులుఎన్జీవోలుఇతర ముఖ్యమైన భాగస్వాములు ఉంటారు.

ట్రాన్స్‌జెండర్లను సమాజంలో ఏకీకృతం చేయడం కేవలం చట్టపరమైన లేదా సంస్థాగత బాధ్యత మాత్రమే కాదని నైతిక విధి అని ఎన్‌హెచ్ఆర్‌సీ దృఢంగా విశ్వసిస్తుందిఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారాభారతదేశంలోని ప్రతి ట్రాన్స్‌జెండర్ గౌరవంగా జీవించగలరనిసమాన అవకాశాలనుసమాజంలో వారి హక్కులు తిరిగి పొందగలరని నిర్ధారించుకొనేలా మార్పులకు మార్గం సుగమం చేయడానికి కమిషన్ ప్రయత్నిస్తుందిసమ్మిళిత విధానాలుపద్ధతులను బలోపేతం చేయడానికిట్రాన్స్‌జెండర్ల హక్కులను ముందుకు తీసుకెళ్లడానికిమానవ హక్కులుసమానత్వంఅందరికీ న్యాయం అనే సూత్రాల పట్ల భారత్ నిబద్ధతను పునరుద్ఘాటించడానికి ఈ సదస్సులో చేపట్టే చర్చలుసిఫార్సులు దోహదపడతాయి.

 

***


(Release ID: 2163166) Visitor Counter : 3