బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆగస్టు 2025లో క్యాప్టివ్, వాణిజ్య గనుల నుంచి నెలవారీ ఉత్పత్తి, పంపిణీ వివరాలు

Posted On: 02 SEP 2025 11:46AM by PIB Hyderabad

2025 26 ఆర్థిక సంవత్సరంలో 2025 ఆగస్టు నెలలో క్యాప్టివ్వాణిజ్య గనుల నుంచి 14.43 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయ్యిందిఅదే సమయంలో పంపిణీ 15.07 మిలియన్ టన్నులకు చేరుకుంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు నమోదైన సమగ్ర గణాంకాలు పరిశీలిస్తే.. గణనీయమైన వార్షిక వృద్ధి సాధించిందిగతేడాది ఇదే సమయంతో పోలిస్తే బొగ్గు ఉత్పత్తి 11.88 శాతం పెరిగిందిఅలాగే రవాణాలో 9.12 శాతం వృద్ధి నమోదైందిఈ సానుకూల ధోరణులు గనుల సామర్థ్యాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించడంమెరుగైన నిర్వాహణ సామర్థ్యం వంటి అంశాలను సూచిస్తున్నాయి.

కింద జత చేసిన  గ్రాఫ్ లో ఉత్పత్తిపంపిణీ రెండింటిలోనూ బలమైన లాభాలతోపాటు స్థిరమైన పనితీరు మెరుగుదలను స్పష్టంగా వివరిస్తుంది.

image.png

వ్యూహాత్మక విధాన చర్యలుకఠినమైన పర్యవేక్షణవాటాదారులకు నిరంతర మద్దతు ఈ రంగంలో మెరుగైన పనితీరు సాధించడానికి కారణంగా మారాయని గనుల మంత్రిత్వ శాఖ పేర్కొందిఈ ప్రయత్నాలు గనుల అనుమతులు వేగంగా రావడంఉత్పత్తి సామర్థ్యాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషించాయితద్వారా బొగ్గు ఉత్పత్తిపంపిణీలో అధిక వృద్ధి నమోదైంది.

దేశంలో అనుబంధవాణిజ్య బొగ్గు తవ్వకాల పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని బొగ్గుగనుల మంత్రిత్వ శాఖ తెలిపిందిభవిష్యత్తులో స్థిరమైన ఉత్పత్తిని కొనసాగించడంసరఫరాలో అంతరాయాలను తగ్గించడందేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడంలో తమ వంతు సహకారం అందించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు స్పష్టం చేసింది.

 

***


(Release ID: 2163162) Visitor Counter : 3