రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రైల్వే ఉద్యోగులకు మెరుగైన బీమా ప్రయోజనాలు


· ఇండియన్ రైల్వేస్-స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య ఒప్పందంపై మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో సంతకాలు

· ‘ఎస్‌బీఐ’లో జీతం ఖాతాలుగల ఉద్యోగులు ప్రమాదవశాత్తూ మరణిస్తే లభించే బీమా రక్షణ ₹1 కోటికి పెంపు

· విమాన ప్రమాద (మరణం) సంభవిస్తే ₹1 కోటి వరకు బీమా రక్షణతోపాటు రూపే డెబిట్‌ కార్డు ఉన్నవారికి అదనంగా ₹1 కోటి

· వ్యక్తిగత ప్రమాదంలో (శాశ్వత సంపూర్ణ వైకల్యం)పై ₹1 కోటి... శాశ్వత పాక్షిక వైకల్యం సంభవిస్తే ₹80 లక్షల వరకు బీమా రక్షణ

· ఈ సౌహార్ద... ఉద్యోగి కేంద్రక ఒప్పందంతో రైల్వేల్లో- ముఖ్యంగా గ్రూప్‌ ‘సి' సహా ముందువరుసలోని ఇతర కేటగిరీల సిబ్బందికీ ప్రత్యేక ప్రయోజనాలు

Posted On: 01 SEP 2025 7:52PM by PIB Hyderabad

దేశంలోని రెండు దిగ్గజ సంస్థలైన ఇండియన్‌ రైల్వేస్‌ (ఐఆర్‌)-స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మధ్య  ఇవాళ కీలక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ మేరకు ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్కులలో ఒకటైన ‘ఐఆర్‌’, దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ‘ఎస్‌బీఐ’ ప్రతినిధులు ఈ ‘ఎంఓయూ’పై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే, సమాచార-ప్రసార, ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతిక శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్‌తోపాటు రైల్వే బోర్డు చైర్మన్ శ్రీ సతీష్ కుమార్, ‘ఎస్‌బీఐ’ చైర్మన్‌ శ్రీ సి.ఎస్‌.షెట్టి ప్రత్యేక ప్రముఖులుగా హాజరయ్యారు.

ఈ ‘ఎంఓయూ’ ప్రకారం, ‘ఎస్‌బీఐ’లో జీతం ఖాతాలున్న రైల్వే ఉద్యోగులకు బీమా రక్షణ గణనీయంగా పెరుగుతుంది. ఈ మేరకు ప్రమాదవశాత్తూ మరణిస్తే, ‘సీజీఈజీఐఎస్‌’ కింద గ్రూప్ ‘ఎ, బి, సి’ తరగతుల ఉద్యోగులకు ప్రస్తుతం ₹1.20 లక్షలు, ₹60,000, ₹30,000 వంతున లభించే  బీమా ప్రయోజనం ₹1 కోటికి పెరుగుతుంది.

దీంతోపాటు ‘ఎస్‌బీఐ'లో కేవలం జీతం ఖాతా మాత్రమేగల రైల్వే ఉద్యోగులందరికీ ఇకపై ₹10 లక్షల దాకా సహజ మరణంపైనా బీమా రక్షణ లభిస్తుంది. ఇందుకోసం వారు ఎలాంటి రుసుమూ చెల్లించనక్కర్లేదు. అలాగే ఎటువంటి వైద్య పరీక్షలు కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉండదు.

రైల్వే ఉద్యోగులలో దాదాపు 7 లక్షల మంది ‘ఎస్‌బీఐ’లో జీతం ఖాతాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల సంక్షేమం దిశగా ఒక కీలక ముందడుగు కాగలదు. అంతేకాకుండా 'ఐఆర్‌-ఎస్‌బీఐ’ మధ్య సంరక్షణాత్మక, ససంఘటిత భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది.

ఈ అవగాహన ఒప్పందం కింద లభించే కొన్ని కీలక అనుబంధ బీమా రక్షణ ప్రయోజనాలు కూడా లభిస్తాయి: ఇందులో- ₹1.60 కోట్ల విమాన ప్రమాద బీమా (మరణ), రూపే డెబిట్ కార్డుపై ₹1.00 కోట్ల అదనం... అలాగే ₹1 కోటి వ్యక్తిగత ప్రమాద (శాశ్వత సంపూర్ణ వైకల్యం) బీమా, శాశ్వత పాక్షిక వైఫల్యంపై ₹80 లక్షల వరకు రక్షణ లభిస్తాయి.

రెండు దిగ్గజ సంస్థల మధ్య కుదిరిన ఈ ఒప్పందం సౌహార్ద సహితం ఉద్యోగి-కేంద్రకం కావడం విశేషం. రైల్వే కార్మికశక్తికి- ముఖ్యంగా గ్రూప్ ‘సి’ సహా ఇతర ముందు వరుస కేటగిరీల ఉద్యోగులకు దీనిద్వారా ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి.

 

***


(Release ID: 2162930) Visitor Counter : 2