ఆర్థిక మంత్రిత్వ శాఖ
జులై నెలకు జీఎస్‌టీఆర్-3బీ దాఖలు గడువు 27 వరకు పొడిగింపు .. ముంబయి సిటీ, ముంబయి సబర్బన్, థానే, రాయ్‌గడ్‌లతో పాటు పాల్‌ఘర్ జిల్లాల జీఎస్‌టీ చెల్లింపుదారులకు ఈ వెసులుబాటునిచ్చిన సీబీఐసీ
Posted On:
21 AUG 2025 2:19PM by PIB Hyderabad
ఈ సంవత్సరం జులై నెలకు గాను ఫారం జీఎస్‌టీఆర్-3బీని దాఖలు చేయడానికి గడువును పొడిగిస్తున్నట్లు తెలుపుతూ పరోక్ష పన్నులు, కస్టమ్స్ సంబంధిత కేంద్రీయ మండలి (సీబీఐసీ) నిన్నటి తేదీ (20 ఆగస్టు, 2025)తో నోటిఫికేషన్ నెంబరు ‘12/2025-సెంట్రల్ ట్యాక్స్’ను జారీ చేసింది.
ఎడతెరపి లేని వాన, ముంబయి ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో జన జీవనానికి కలిగిన అంతరాయాన్ని పరిగణనలోకి తీసుకొని, పైన పేర్కొన్న ఫారం దాఖలుకు గడువును ఈ నెల 27 (27 ఆగస్టు 2025) వరకు పొడిగించారు. ఇది ఈ కింద పేర్కొన్న జిల్లాల్లో ప్రధానంగా వాణిజ్యం చేస్తున్న నమోదిత పన్ను చెల్లింపుదారులకు వర్తిస్తుంది:
• ముంబయి సిటీ
• ముంబయి సబర్బన్
• థానే
• రాయ్‌గడ్
• పాల్‌ఘర్
పైన ప్రస్తావించిన జిల్లాల్లోని పన్ను చెల్లింపుదారులు ఈ సంగతిని గమనించి, వారి వారి రిటర్నులను పొడిగించిన తేదీ లోపు దాఖలు చేసి ఆలస్య రుసుముతో పాటు జరిమానాలను తప్పించుకోవాల్సిందిగా వారికి సూచించారు.
(CLICK HERE TO ACCESS CBIC NOTIFICATION NO. 12/2025 – CENTRAL TAX DATED 20.08.2025)
***
(Release ID: 2159742)