సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
పీఎంఈజీపీ ద్వారా ఎస్సీ, గ్రామీణ లబ్ధిదారులకు.... అధిక సబ్సిడీ, తక్కువ పెట్టుబడి
చిన్న సంస్థలకు రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలను అందిస్తున్న పీఎంఎంవై
Posted On:
21 AUG 2025 2:12PM by PIB Hyderabad
ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమాన్ని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సంస్థ ద్వారా ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. ఇది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ఏర్పాటు చేసిన కేంద్ర పథకం. వ్యవసాయేతర రంగంలో కొత్త సూక్ష్మ సంస్థలను స్థాపించడానికి భవిష్యత్తు పారిశ్రామికవేత్తలకు సహాయం చేస్తుంది. పీఎమ్ జీపీ పథకం పరిధిలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు, అదీ షెడ్యూల్డ్ కులాలకు చెందిన లబ్ధిదారులను ప్రత్యేక వర్గం కింద పరిగణిస్తారు. వీరు అధిక సబ్సిడీ రేటు పొందడతోపాటు, ప్రాజెక్ట్ వ్యయంలో తక్కువ పెట్టుబడి పెడితే సరిపోతుంది.
సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ వరంగల్ సహా దేశవ్యాప్తంగా ‘జాతీయ షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగల కేంద్రం’ పథకాన్ని అమలు చేస్తోంది. ఇది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన పథకం. లబ్దిదారులు ప్రభుత్వ కొనుగోలులో పాల్గొని, ఎస్సీ, ఎస్టీ ఎమ్ఎస్సీఈల నుంచి నిర్దేశిత 4 శాతం కొనుగోలు లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తుంది.. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు నైపుణ్యాభివృద్ధి, సామర్థ్య శక్తి పెంపు, మార్కెట్ అనుసంధానం, ఆర్థిక సౌకర్యాలు, టెండర్ బిడ్‌లో పాల్గొనడం వంటి అంశాలలో వృత్తిపరమైన సహకారం అందించేందుకు అనేక చర్యలు చేపట్టారు.
ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కింద సభ్యుల రుణ సంస్థలు ( ఉదా.. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు,నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు లబ్దిదారులకు ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలు అందిస్తాయి. రుణం తీసుకునేందుకు అర్హత కలిగి చిన్నగా వ్యాపారం చేసుకోవాలనుకునే వారు ఎవరైనా పీఎమ్ ఎమ్ వై కింద 20 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఈ మొత్తాన్ని తయారీ, వ్యాపారం, సేవా రంగాలలో ఆదాయాన్ని సృష్టించే కార్యకలాపాల కోసం వియోగించుకోవచ్చు. ఈ రుణాలను నాలుగు విభాగాలుగా విభజించారు. అవి శిశు (రూ. 50,000 వరకు రుణాలు), కిశోర్ (రూ. 50,000 నుంచి రూ. 5 లక్షల వరకు రుణాలు), తరుణ్ (రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు రుణాలు). అయితే ముందు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించిన వారికి మాత్రమే తరుణ్ ప్లస్ (రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు) కేటగిరీ కింద రుణాలు ఇస్తారు.
ఈ సమాచారాన్ని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ శోభా కరంద్లాజే నేడు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధాన రూపంలో అందించారు.
***
(Release ID: 2159541)