పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
పార్లమెంట్ ప్రశ్న: కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జడ్) మార్గదర్శకాలు
Posted On:
18 AUG 2025 4:50PM by PIB Hyderabad
తీర ప్రాంతాలను, జీవవ్యవస్థలను పరిరక్షించేందుకు, మత్స్యకారులు, ఇతర ప్రాంతీయ సమూహాల జీవనోపాధికి భద్రతను కల్పించేందుకు 1991 నుంచి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జడ్) నియమావళిని మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. అదే సమయంలో శాస్త్రీయ నియమాల ఆధారంగా అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోంది. 1991 నాటి ఈ నియమావళిని 2011లోని సీఆర్‌జడ్/ఐలాండ్ ప్రొటెక్షన్ జోన్ (ఐపీజడ్) నియమావళి భర్తీ చేసింది. అనంతరం 2019లో సీఆర్‌జడ్/ఐలాండ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (ఐసీఆర్‌జడ్) నియమావళిలో మార్పులు చేశారు. 2019 నియమావళి ప్రకారం అన్ని కోస్తా తీర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ కోస్టల్ జోన్ నిర్వహణ ప్రణాళిక (సీజడ్ఎంపీ)లు, ద్వీప ప్రాంతాల నిర్వహణ జోన్ ప్రణాళిక (ఐసీఆర్‌జడ్‌పీ)లు లేదా సమీకృత ద్వీప నిర్వహణ ప్రణాళిక (ఐఐఎంపీ)లను ఆధునికీకరించి ఆమోదం కోసం మంత్రిత్వ శాఖకు సమర్పించాలి. నవీకరించిన ప్రణాళికలు ఆమోదం పొందే వరకు సీఆర్‌జడ్/ఐపీజడ్ నియమావళిలోని 2011 నిబంధనలు అమల్లో ఉంటాయి. ఇప్పటి వరకు ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు చెందిన సీజడ్ఎంపీలు, గ్రేట్ నికోబార్, లిటిల్ అండమాన్లకు చెందిన ఐసీఆర్‌జడ్‌పీలు ఆమోదం పొందాయి. సీఆర్‌జడ్ నియమావళి 2019 లోని అనుబంధంIVలోని మార్గదర్శకాలకు అనుగుణంగా సీజడ్ఎంపీ నవీకరణ ఉంది. ఇది తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాలనే బేధం లేకుండా దేశమంతా వర్తిస్తాయి. మంత్రిత్వ శాఖ అనుమతి పొందిన సంస్థల ద్వారా ఆయా రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాల సీజడ్ఎంఏలు నిర్దేశించిన మార్గదర్శకాలు అనుగుణంగా కోస్టల్ జోన్ నిర్వహణ ప్రణాళిక (సీజడ్ఎంపీ)ను మెరుగుపరచడానికి కావాల్సిన అధ్యయనాలు, సర్వేలు చేపడుతున్నారు.
పర్యావరణ (పరిరక్షణ) చట్టం, 1986 ప్రకారం 2011, 2019 సీఆర్‌జడ్ నియమావళి ఉల్లంఘనలపై శిక్షార్హమైన చర్యలు ఉంటాయి. దేశంలో జరుగుతున్న సీఆర్‌జడ్ నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడానికి పర్యావరణ (పరిరక్షణ) చట్టం, 1986 లోని 5, 10, 19 సెక్షన్ల ప్రకారం రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల కోస్తా జోన్ల నిర్వహణ అథారిటీ (సీజడ్ఎంఏ)లకు మంత్రిత్వ శాఖ అధికారాలను అప్పగించింది. గడచిన పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 53 ఉల్లంఘన కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏపీసీజడ్ఎంఏ) సమాచారం ఇచ్చింది. వీటిలో పునరావృత నేరాలు లేవు. బాపట్లతో సహా ఇతర జిల్లాల వారీగా వివరాలు దిగువన ఉన్నాయి:
జిల్లా
|
కేసుల సంఖ్య
|
విశాఖపట్నం
|
24
|
అనకాపల్లి
|
02
|
కాకినాడ
|
02
|
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
|
02
|
పశ్చిమ గోదావరి జిల్లా
|
06
|
కృష్ణా జిల్లా
|
01
|
బాపట్ల జిల్లా
|
15
|
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా
|
01
|
Total
|
53
|
ఈ సమాచారాన్ని కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్థన్ సింగ్ ఈ రోజు లోక్‌సభలో లిఖిత పూర్వక సమాధానంగా అందించారు.
***
(Release ID: 2157693)