ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి మోదీ ప్రసంగం: 2047 నాటికి వికసిత్ భారత్ దిశగా దార్శనికత

Posted On: 15 AUG 2025 11:58AM by PIB Hyderabad

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి 103 నిమిషాల పాటు ప్రసంగించారుఎర్రకోట నుంచి శ్రీ మోదీ చేసిన ప్రసంగాల్లో ఇదే సుదీర్ఘమైనదిఇందులో భాగంగా ఆయన కీలక ప్రకటనలు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న లక్ష్యంతో సాహసోపేతమైన ప్రణాళికను ఇచ్చారుస్వావలంబనఆవిష్కరణప్రజల సాధికారతపై దృష్టి పెట్టిన ప్రధాని.. ఇతరులపై ఆధారపడే స్థాయి నుంచి ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైనసాంకేతికతపరంగా అభివృద్ధి చెందినఆర్థికంగా ధృడమైన దేశంగా మారిన భారత్ ప్రయాణాన్ని ప్రధానంగా పేర్కొన్నారు

ప్రధాని చేసిన ప్రకటనలుప్రసంగంలోని ముఖ్యాంశాలు:

1. బెదిరింపులకు భయపడేది లేదు... రాజీ లేదుపహల్గామ్ దాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను భారత్ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి నిదర్శనంగా ప్రధాని మోదీ కొనియాడారుభారత్‌లో తయారైన ఆయుధాలతో చేపట్టిన ఈ ఆపరేషన్ ఉగ్రవాద స్థావరాలనుపాకిస్థాన్‌లోని మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసిందిఇకపై అణు బెదిరింపులకుఇతర దేశాల ఒత్తిడికి భారత్ తలొగ్గదని ఈ ఆపరేషన్ తెలియజేసింది

సింధూ జలాల ఒప్పందంపై సందేహాలకు తావు లేకుండా పూర్తి స్పష్టతనిచ్చారు. “రక్తంనీరు కలిసి ప్రవహించకూడదని భారత్ ఇప్పుడు నిర్ణయించిందిసింధూ జలాల ఒప్పందం అన్యాయమని ప్రజలు గ్రహించారుఒకవైపు మన రైతులు బాధపడుతుంటేసింధు నది నుంచి శత్రువుల భూములకు సాగునీరు అందించారు” అని అన్నారు

ఇకపై జాతీయ ప్రయోజనాలపై భారత్ రాజీపడదని ఈ ప్రకటన పునరుద్ఘాటించిందిస్వదేశీ సాంకేతికతరక్షణ వ్యవస్థలపై పూర్తిగా ఆధారపడి వేగంగానిర్ణయాత్మకంగా వ్యవహరించే విషయంలో దేశానికి ఉన్న సామర్థ్యాన్ని ఈ ఆపరేషన్ ప్రధానంగా తెలియజేసింది

2. ఆత్మనిర్భర్ భారత్సాంకేతికతను పెంచటంపరిశ్రమలను బలోపేతం చేయడం: "ఇతరులపై ఆధారపడటం వల్ల దేశ స్వాతంత్ర్యంపై అనుమానాలు రేకెత్తుతాయిఆధారపడటం ఒక అలవాటుగాప్రమాదకరమైనదిగా మారటం దురదృష్టకరంఅందుకే మనం స్వావలంబన పొందడం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండటంతో పాటు దానికి కట్టుబడి ఉండాలిస్వావలంబన అంటే ఎగుమతులుదిగుమతులురూపాయి లేదా డాలర్ గురించి మాత్రమే కాదు.. ఇది మన సామర్థ్యాలుసొంతంగా మన కాళ్ల మీద మనం నిలబడే శక్తి గురించిన అంశంఅని మోదీ అన్నారు

అందుకే భారత్ 2025 నాటికి తన మొదటి స్వదేశీ తయారీ సెమీకండక్టర్ చిప్‌ను విడుదల చేస్తుందనిఅణువిద్యుత్తు రంగ ద్వారాలను ప్రైవేట్ సంస్థలకు తెరుస్తుందనిఇంధనం సాంకేతికత రంగాల్లో భారీగా అవకాశాలను సృష్టిస్తుందని ఆయన ప్రకటించారు.

దేశంలోని ప్రతి ఒక్కరుముఖ్యంగా యువత జెట్ ఇంజిన్లుసామాజిక మాధ్యమాలుఎరువులుఇతర కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాలను దేశీయంగా ఆవిష్కరించడంఉత్పత్తి చేయడం ద్వారా దేశ నిర్మాణంలో పాలు పంచుకోవాలని కోరారుతద్వారా స్వావలంబన కలిగినశక్తిమంతమైనప్రపంచవ్యాప్తంగా గౌరవించబడే భవిష్యత్తు గల భారత్‌ను సృష్టించాలని ఆయన కోరారు.

భారతదేశ భవిష్యత్తుకు కీలకమైన వనరులను పొందేందుకు తీసుకున్న సాహసోపేతమైన చర్యలను కూడా ప్రధాని మోదీ ప్రధానంగా పేర్కొన్నారుఇంధనంపరిశ్రమలురక్షణ రంగాలకు అవసరమైన ఖనిజాల కోసం నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ద్వారా 1,200 ప్రదేశాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు

ఈ ఖనిజాల విషయంలో నియంత్రణ కలిగి ఉండటం వల్ల భారత్ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి బలోపేతం అవుతుందని.. దేశ పారిశ్రామికరక్షణ రంగాలు అసలైన స్వావలంబనను పొందుతాయని ప్రధానంగా చెప్పారుదీనితో పాటు నేషనల్ డీప్ వాటర్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్.. తీరప్రాంతేతర ఇంధన వనరులను ఉపయోగించేలా చేసి ఇంధన స్వావలంబనను పెంచుతుందన్నారుతద్వారా విదేశీ ఇంధన దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని వివరించారుదీనివల్ల పూర్తిగా స్వతంత్రంగాశక్తిమంతంగా తయారయ్యే విధంగా భారత్ మారుతుందనన్నారు.

* ‘ప్రపంచ ఔషధ కేంద్రంగా’ భారత్‌కు ఉన్న సామర్థ్యాన్ని ప్రధానంగా పేర్కొన్న ఆయన.. ఔషధాలుఆవిష్కరణలలో స్వావలంబన సాధించాలని కోరారు. "మానవాళి సంక్షేమం కోసం ఉత్తమమైనఅత్యంత అందుబాటు ధరల్లో మందులను అందించేది మనం కాకూడదా?" అని ప్రశ్నించారు.

దేశీయ ఔషధ ఆవిష్కరణలలో దేశానికి పెరుగుతోన్న ప్రావీణ్యాన్ని.. కొత్త మందులువ్యాక్సిన్లుప్రాణాలను రక్షించే చికిత్సలను దేశంలోనే పూర్తిగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ఆయన ప్రధానంగా పేర్కొన్నారుకొవిడ్ విషయంలో భారత స్వదేశీ వ్యాక్సిన్లుకోవిన్ వంటి వేదికలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను కాపాడాయిఇదే ప్రేరణతో ఇలాంటి ఆవిష్కరణలను పెంచాలని ఆయన పిలుపునిచ్చారు.

*భారత్ తన సొంత ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చుకోవటమే కాకుండా వైద్యపరంగా స్వావలంబన పొందేలాఆవిష్కరణల విషయంలో ప్రపంచ కేంద్రంగా మారేలా కృషి చేయాలని పరిశోధకులుపారిశ్రామికవేత్తలను ఆయన కోరారుతద్వారా శాస్త్ర సాంకేతికమానవ సంక్షేమంలో నాయకత్వం వహించే సామర్థ్యాన్ని భారత్ ప్రదర్శించగలదని అన్నారు

4. మిషన్ సుదర్శన్ చక్రవ్యూహాత్మక రక్షణను పెంపొందించడందేశానికి ఉన్న గొప్ప సాంస్కృతికపౌరాణిక చరిత్ర నుంచి ప్రేరణ పొందుతూ దాడులు చేయటందాడులను నిరోధించే విషయంలో భారత్ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన మిషన్ సుదర్శన్ చక్రను ప్రధాని మోదీ ప్రకటించారు. "మనపై దాడి చేయడానికి శత్రువులు చేసే ఏ ప్రయత్నాన్ని అయినా అడ్డుకునేందుకు శక్తిమంతమైన ఆయుధ వ్యవస్థను రూపొందించడానికి భారత్ మిషన్ సుదర్శన్ చక్రను ప్రారంభిస్తుందిఅని వెల్లడించారు.

భారత వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని బలోపేతం చేస్తూ రక్షణ విషయంలో వేగంగాఖచ్చితంగాశక్తిమంతంగా స్పందించే వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. "2035 నాటికి అన్ని కీలక ప్రాంతాలూ దేశవ్యాప్త భద్రతా కవచం పరిధిలోకి వస్తాయిఅని ప్రధానమంత్రి మోదీ అన్నారుఇది దేశ సమగ్ర రక్షణను నిర్ధిరిస్తూ.. రక్షణ విషయంలో స్వావలంబన పట్ల భారత్ నిబద్ధతను తెలియజేస్తోంది.

5. తదుపరి తరం సంస్కరణలుఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన చట్టాలునియమ నిబంధనలువిధానాలను సమూలంగా మార్చాలన్న లక్ష్యంతో తదుపరి తరం ఆర్థిక సంస్కరణల కోసం ఒక కార్యాచరణ బృందం (టాస్క్ ఫోర్స్ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.

ప్రభుత్వం ఇప్పటికే అనవసరమైన 40,000 నిబంధనలను, 1500 పాత చట్టాలను రద్దు చేసిందని.. తాజా పార్లమెంటు సమావేశాల్లో 280కి పైగా నిబంధనలను తొలగించినట్లు ఆయన ప్రధానంగా పేర్కొన్నారుదీపావళి నాటికి తీసుకురానున్న తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు.. రోజువారీ నిత్యావసరాలపై పన్నులను తగ్గిస్తాయిదీనివల్ల ఎంఎస్ఎంఈలుస్థానిక విక్రేతలువినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందిఅదే విధంగా ఈ సంస్కరణలు ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తాయిమరింత సమర్థవంతమైనప్రజలకు అనుకూలమైన ఆర్థిక వ్యవస్థను తయారు చేస్తాయి

6. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనయువతకు సాధికారతజనాభా విషయంలో భారత్‌కు ఉన్న సామర్థ్యాన్ని ఉపయోగించుకునేందుకుదేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించేలా చూసుకునేందుకు ప్రధానమంత్రి మోదీ రూ. 1 లక్ష కోట్ల ఉపాధి పథకం అయిన పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనను  ప్రకటించారుదీనిద్వారా కొత్తగా ఉద్యోగం చేస్తోన్న యువత రూ. 15000 అందుకుంటారుఇది కోట్ల మంది యువతీయువకులకు లబ్ధి చేకూర్చనుంది

ఇది భారత మావన వనరుల సామర్థ్యాన్ని నిజమైన ఆర్థికసామాజిక ప్రగతిగా మారుస్తుందన్నారుఅంతేకాకుండా స్వతంత్ర భారత్ నుంచి సమృద్ధి భారత్‌కు ఉన్న సంబంధాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారుదీనితో పాటు దేశ పురోగతిఅభివృద్ధికి క్రియాశీలకంగా పనిచేసేందుకు యువతకు సాధికారత కల్పిస్తుందని ప్రధానంగా పేర్కొన్నారు

7. ఇంధనంఅణు విద్యుత్తులో స్వావలంబనభారతదేశ భవిష్యత్తుకు కీలకమైన వనరులను పొందేందుకు తీసుకున్న సాహసోపేతమైన చర్యలను కూడా ప్రధాని మోదీ ప్రధానంగా పేర్కొన్నారుఇంధనంపరిశ్రమలురక్షణ రంగాలకు అవసరమైన ఖనిజాల కోసం నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ద్వారా 1,200 ప్రాంతాల్లో అన్వేషిస్తున్నట్లు తెలిపారు.

ఈ ఖనిజాల విషయంలో నియంత్రణ కలిగి ఉండటం వల్ల భారత్ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి బలోపేతం అవుతుందని.. దేశ పారిశ్రామికరక్షణ రంగాలు అసలైన స్వావలంబన పొందుతాయని ప్రధానంగా చెప్పారుదీనితో పాటు నేషనల్ డీప్ వాటర్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్.. తీరప్రాంతేతర ఇంధన వనరులను ఉపయోగించేలా చూసుకోవటం వల్ల ఇంధన స్వావలంబన పెరుగుతుందన్నారుతద్వారా విదేశీ ఇంధన దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని వివరించారుదీనివల్ల పూర్తిగా స్వతంత్రంగాశక్తిమంతంగా తయారయ్యే విధంగా భారత్ మారుతుందన్నారు.

స్వచ్ఛ ఇంధన రంగంలో దేశం సాధించిన అద్భుతమైన విజయాలను ప్రముఖంగా ప్రస్తావించారుస్వచ్ఛ ఇంధనం విషయంలో 50 శాతాన్ని లక్ష్యాన్ని 2025 నాటికేఅంటే అయిదు సంవత్సరాల ముందే భారత్ సాధించినట్లు పేర్కొన్నారు

* 2047 నాటికి భారతదేశ అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పది రెట్లు పెంచే ప్రణాళికలను కూడా ఆయన ప్రకటించారు. 10 కొత్త అణు రియాక్టర్లు నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారుఇవి ఇంధన భద్రతతో పాటు స్థిర వృద్ధి జరిగేలా చూసుకుంటాయన్నారుభారత్ ‌ఇంధన దిగుమతులపై ఆధారపడకపోతే.. ఆ విషయంలో ఆదా చేసిన మొత్తాన్ని రైతుల సంక్షేమం కోసం ఉపయోగించవచ్చన్నారుఇది దేశానికి వెన్నెముకగా ఉన్న రైతుల్ని మరింత బలోపేతం చేయటమే అవుతుందన్నారు

8. అంతరిక్ష రంగ స్వాతంత్ర్యం -ఆవిష్కరణలుఅంతరిక్ష శాస్త్రంలో పెరుగుతోన్న భారత్ ప్రావీణ్యాన్ని ప్రధాని మోదీ ప్రధానంగా పేర్కొన్నారుగగన్‌యాన్ మిషన్ విజయంతో సొంత అంతరిక్ష కేంద్రం కోసం భారత్ సన్నాహాలు చేస్తోందన్నారు. 300కి పైగా అంకురాలు ఇప్పుడు ఉపగ్రహ సాంకేతికతఅంతరిక్ష అన్వేషణఅత్యాధునిక పరిశోధనలకు నూతన ఆవిష్కరణలు చేస్తున్నాయని తెలిపారుఇవన్నీ ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ కేవలం పాల్గొనటమే కాకుండా స్వదేశీ పరిష్కారాలతో ముందజలో ఉందని నిరూపిస్తున్నాయని పేరొన్నారు

9. భారత శ్రేయస్సుకు రైతులే వెన్నెముక: "భారతదేశం రైతు ప్రయోజనాల విషయంలో రాజీపడదుఅని ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారురైతులుపశువుల పెంపకందారులకు చెడు కలిగించే విధానానికి వ్యతిరేకంగా తాను నిలబడి.. వారి హక్కులుజీవనోపాధిని కాపాడుతున్నట్లు ప్రధానంగా తెలిపారు

దేశాభివృద్ధికి వ్యవసాయం మూలస్తంభంగా ఉందని అన్నారుపాలుపప్పుధాన్యాలుజనపనారలో భారతదేశం అగ్రస్థానంలో.. బియ్యంగోధుమలుపత్తిపండ్లుకూరగాయల విషయంలో రెండో స్థానంలో ఉన్నట్లు తెలిపారువ్యవసాయ ఎగుమతులు రూ. 4 లక్షల కోట్ల దాటాయని.. ఇది ఈ రంగంలో ప్రపంచ పోటీలో భారత్ స్థానాన్ని తెలియజేస్తోందన్నారు

రైతులను మరింత శక్తిమంతం చేయడానికి వ్యవసాయంలో వెనుకబడిన 100 జిల్లాల కోసం ప్రధానమంత్రి ధాన్య ధాన్య కృషి యోజనను ప్రకటించారుఇప్పటికే కొనసాగుతోన్న పీఎం-కిసాన్నీటిపారుదల పథకాలుపశుసంరక్షణ పథకాలతో పాటు ఇది కూడా రైతులకు మద్దతునివ్వనుందిదేశానికి వెన్నెముక అయిన రైతులు బలంగాధృడంగా ఉండేలా ఈ పథకం చూసుకోనుంది

10. జాతీయ సమగ్రతను కాపాడేందుకు ఉన్నత స్థాయి జనాభా మిషన్జనాభా విషయంలో భారత్ సమగ్రతను కాపాడే అంశానికి ఉన్న ప్రాముఖ్యతను కూడా ప్రధానమంత్రి మోదీ ప్రస్తావించారుఅక్రమ చొరబాట్ల వల్ల ఎదురయ్యే సవాళ్ల గురించి ఆయన హెచ్చరించారుసరిహద్దు ప్రాంతాలనుప్రజల జీవనోపాధిని రక్షించాల్సిన అవసరాన్ని ప్రధానంగా చెప్పారుఈ సమస్యలను పరిష్కరిస్తూ దేశ ఐక్యతసమగ్రతభద్రతను నిర్ధారించడం.. వ్యూహాత్మకసామాజిక సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతో ఉన్నత స్థాయి జనాభా మిషన్‌ను ప్రకటించారు.

భవిష్యత్తు గురించి మాట్లాడుతూ... 2047 వికసిత్ భారత్ కోసం దార్శనికతను ప్రధానమంత్రి మోదీ వివరించారు.  దేశ పురోగతి స్వావలంబనఆవిష్కరణప్రజా సాధికారతపై ఆధారపడి ఉందని ప్రధానంగా పేర్కొన్నారువ్యూహాత్మకమైన రక్షణ రంగం నుంచి సెమీకండక్టర్లు వరకుహరిత ఇంధనం నుంచి వ్యవసాయం వరకుడిజిటల్ సార్వభౌమాధికారం నుంచి యువత సాధికారత వరకు 2047 నాటికి భారత్‌ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఈ రోడ్ మ్యాప్ కృషి చేయనుందిఇది ప్రపంచ పోటీతత్వంసామాజిక సమ్మిళిత్వంవ్యూహాత్మక స్వయంప్రతిపత్తి కలిగి ఉంటుంది.

భారత్ శక్తి... భారత ప్రజల్లోఆవిష్కరణల్లోస్వావలంబనలో ఉందని గుర్తు చేశారుభారత స్వాతంత్ర్య శతాబ్ది నాటికి సంపన్నమైనశక్తిమంతమైన వికసిత్ భారత్‌ లక్ష్యాన్ని సాధించేందుకు దేశంలో తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారాలేదా శాస్త్ర సాంకేతికలేదా పారిశ్రామిక వ్యవస్థాపనకు కృషి చేయటం ద్వారా... ప్రతి భారతీయుడు జాతి నిర్మాణానికి దోహదపడాలని కోరారు.

 

***


(Release ID: 2156817)