ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
రక్తపోటును, మధుమేహాన్ని నియంత్రించడానికి చేపట్టిన చర్యలు
• 30 ఏళ్లకంటే ఎక్కువ వయసున్న వారికి జాతీయ స్థాయిలో పరీక్షలు, చికిత్సలు.. 1.11 కోట్ల మందికి పైగా రక్తపోటు, 64 లక్షల మందికి మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ.. వారికి ఈ ఏడాది జనవరి మొదలు జూన్ వరకు చికిత్స సేవలు
• 770 జిల్లా ఎన్‌సీడీ క్లినిక్‌లు, 233 కార్డియాక్ కేర్ యూనిట్లు, సీహెచ్‌సీ స్థాయిలో 6,410 ఎన్‌సీడీ క్లినిక్‌ల ఏర్పాటు..వీటిలో సీహెచ్ఓలు, ‘ఆశా’లు, ఏఎన్ఎంలతో క్రమం తప్పక రోగి పరిశీలనలు, సూచనలు, సలహాలు, ఉచితంగా మందుల పంపిణీ
• ‘ఆశా’ల తోడ్పాటుతో పౌర సంబంధాలపై శ్రద్ధ.. రిస్క్ విషయంలో సీబీఏసీ పరికరంతో ముందస్తుగా అంచనా.. రోగులకు వైద్య సిబ్బందితో మార్గదర్శనం.. జీవన శైలిలో మార్పులు, ప్రత్యేక సంరక్షణ అవసరమైతే పెద్ద ఆస్పత్రులకు సిఫారసు
Posted On:
12 AUG 2025 3:11PM by PIB Hyderabad
ఆరోగ్యం రాష్ట్ర జాబితాలో ప్రస్తావించిన అంశం. ఏమైనా, జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్ఎం)లో భాగంగా అసాంక్రామిక వ్యాధుల నివారణ, నియంత్రణలకు ఉద్దేశించిన జాతీయ కార్యక్రమం (ఎన్‌పీ-ఎన్‌సీడీ)లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సాంకేతిక సహాయంతో పాటు ఆర్థిక సహాయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ అందిస్తోంది. ఈ కార్యక్రమం మౌలిక సదుపాయాలను పటిష్ఠపరచడంపైన, మానవ వనరులను పెంచడంపైన, పరీక్షలు, ముందుగా రోగనిర్ధారణ, సిఫారసు సేవ, చికిత్సతో పాటు రక్తపోటు, మధుమేహం సహా అసాంక్రామిక వ్యాధుల (ఎన్‌సీడీస్) విషయంలో మానవ ఆరోగ్య పరిరక్షణ.. ఈ అంశాల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అవసరాలు, అవి పంపే ప్రతిపాదనలపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొంటోంది. ఈ కార్యక్రమం కింద 77 జిల్లా ఎన్‌సీడీ క్లినిక్‌లు, 233 కార్డియాక్ కేర్ యూనిట్లతో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 6,410 ఎన్‌సీడీ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు.
రక్తపోటు, మధుమేహం సహా సాధారణ ఎన్‌సీడీల పరీక్షలు, నివారణతో పాటు నియంత్రణే ధ్యేయంగా జనాభా ఆధారిత కార్యక్రమాన్ని ఎన్‌హెచ్ఎంలో భాగంగా ప్రారంభించారు. సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో ఎన్‌హెచ్ఎం ఒక భాగంగా ఉంటుంది. 30 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారికి ఈ కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహించారు.
వయస్సు 30 ఏళ్లు, అంత కన్నా ఎక్కువ ఉన్న వారందరికీ పరీక్షలు నిర్వహించడానికి గత ఫిబ్రవరి 20 నుంచి గత మార్చి నెలాఖరు వరకు రక్తపోటు, మధుమేహం సహా ఎన్‌సీడీ పరీక్షల కార్యక్రమాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మొదలుపెట్టింది. ఈ కార్యక్రమాన్ని ఎన్‌పీ-ఎన్‌సీడీ కింద దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల (ఏఏఎం)లతో పాటు ఇతర ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో నిర్వహించారు.
ఎన్‌పీ-ఎన్‌సీడీ కార్యక్రమంలో భాగంగా రక్తపోటు, మధుమేహం సోకినట్లు నిర్ధారణ అయిన రోగులకు వేర్వేరు స్థాయులకు చెందిన ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో మందులతో పాటు క్రమం తప్పక సమీక్షా సేవల్ని కూడా అందిస్తున్నారు:
* రక్తపోటుకు అత్యవసర ఔషధాల్ని అన్ని అంచెలు.. అంటే ఏఏఎం, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల, డీహెచ్..లలో అందుబాటులో ఉంచారు.
* క్రమబద్ధమైన, ఒకే విధమైన నిర్వహణకు తోడ్పడేలా ప్రామాణిక చికిత్స ప్రమాణాలను పాటిస్తున్నారు.
* ఎన్‌సీడీ పోర్టల్ ద్వారా నెలవారీ సమీక్ష సదుపాయాన్ని కల్పించారు. వైద్యశాలకు ఎప్పుడెప్పుడు రావాలో, ఏయే మందులు తీసుకోవాలో సూచిస్తున్నారు.
* ప్రత్యేక సంరక్షణ అవసరమైన రోగుల విషయంలో సిఫారసు వ్యవస్థను అందుబాటులో ఉంచారు.
మన దేశంలో గత ఆరు నెలల్లో చికిత్సలు పొందుతున్న నమోదైన రోగుల సంఖ్య, ఇతర అంశాలు ఇలా ఉన్నాయి:
01.01.2025 నుంచి 30.06.2025 వరకు
|
రక్తపోటు
|
డయాబెటీస్ మెల్లిటస్
|
రోగనిర్ధారణ పూర్తయిన వారు
|
1,11,83,850
|
64,11,051
|
చికిత్స పొందుతున్న వారు
|
1,11,83,850
|
64,11,051
|
రోగులకు, వారి కుటుంబ సభ్యులకు జీవనశైలిని మెరుగుపరచుకోవడంతో పాటు నష్టం సంభవించే అవకాశాన్ని (రిస్క్) తగ్గించుకొనే విషయాలపై సూచనలు, సలహాలను జిల్లా ఎన్‌సీడీ క్లినికల్ కౌన్సెలర్లు అందిస్తారు. అసాంక్రామిక వ్యాధుల నివారణ, నిర్వహణలకు సంబంధించిన ఐఈసీ (ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్) కార్యకలాపాలను కూడా వీరు నిర్వహిస్తారు. రోగులు ఆరోగ్యశాలలకు వచ్చినప్పుడు జీవనశైలిని ఎలా తీర్చిదిద్దుకోవాలో వైద్యాధికారులు, నర్సులు తెలియజెబుతారు.
గుర్తింపు పొందిన సంఘ సేవా కార్యకర్తలే ‘ఆశా’ (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ .. ఏఎస్‌హెచ్ఏ)లు. 30 ఏళ్లు, అంత కన్న ఎక్కువ వయసున్న వారికి నష్టభయం (రిస్క్) ఏ మేరకు ఉందో ఆశా కార్యకర్త కమ్యూనిటీ ఆధారిత నిర్ధారణ పట్టిక (సీబీఏసీ) ఫారాలను ఉపయోగించి, పరిశీలిస్తారు. రక్తపోటు, మధుమేహం సహా సాధారణ ఎన్‌సీడీల తనిఖీ కోసం వ్యక్తులను ఆశా వర్కరే ఏఏఎంల (ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల) వద్దకు తీసుకొస్తారు. క్రమం తప్పక ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ, వ్యాధిని చాలా ముందే గుర్తించడానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని ప్రజలకు ఆశా కార్యకర్తే వివరిస్తారు. రోజూ ఎంత ఆహారాన్ని తీసుకోవడం మంచిది, శారీరకంగా వ్యాయామం చేయడం, పొగ తాగే లేదా మద్యం తాగే అలవాట్లను మానుకోవడం, వేళకు మందులు వేసుకొంటూ ఉండడం వంటి అంశాల్లో రోగులకు సలహాలను ఇచ్చే విషయాల్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ)లకు, ఏఎన్ఎంలకు, ‘ఆశా’లకు శిక్షణనిచ్చారు.
ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్ రాజ్యసభకు ఈ రోజు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 2155631)