హోం మంత్రిత్వ శాఖ
శ్రీ అమర్‌నాథ్‌జీ యాత్ర సురక్షితంగా, సాఫీగా సాగేలా సేవలందించిందుకు... భద్రతా దళాలకు, శ్రీ అమర్‌నాథ్ దేవస్థాన కార్యనిర్వహణ మండలికీ, జమ్మూకాశ్మీర్ ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంస్థలకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అభినందనలు
• ఈ ఏడాది శ్రీ అమర్‌నాథ్ గుడిని దర్శించుకున్న 4.14 లక్షల మందికి పైగా భక్తులు..
ఈ యాత్ర భారతీయ సంస్కృతి పట్ల విశ్వాసానికీ, నిరంతరంగా కొనసాగే సంప్రదాయానికీ ప్రతీక
• ‘ఈ పవిత్ర యాత్రను విజయవంతం చేయడంలో మీ అందరి తోడ్పాటు ప్రశంసనీయం, అద్వితీయం’
• ‘బాబా బర్ఫానీ ఆశీస్సులు ప్రతి ఒక్కరికీ లభించుగాక’
Posted On:
11 AUG 2025 10:23PM by PIB Hyderabad
శ్రీ అమర్‌నాథ్ యాత్ర సురక్షితంగా, ఇబ్బంది లేకుండా ముగించేలా సేవలను అందించినందుకు భద్రతా దళాలకూ, శ్రీ అమర్‌నాథ్ దేవస్థాన కార్యనిర్వహణ మండలికీ, జమ్మూకాశ్మీర్ పాలన యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలకూ కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అభినందనలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ అమిత్ షా స్పందిస్తూ... బాబా బర్ఫానీ దర్శనం కోసం ఈ సంవత్సరం 4.14 లక్షల మందికి పైగా భక్తజనం శ్రీ అమర్‌నాథ్‌జీ సన్నిధికి వచ్చారన్నారు. బాబాను దర్శించుకోవడం నిరంతరంగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయమనీ, భారతీయ సంస్కృతి పట్ల విశ్వాసానికి ఇది ఒక ప్రతీక అనీ శ్రీ అమిత్ షా అభివర్ణించారు. ఈ యాత్రను సురక్షితంగా, ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ముగిసేలా సేవలను అందించిన భద్రతా దళాలను, శ్రీ అమర్‌నాథ్‌జీ దేవస్థాన కార్యనిర్వహణ మండలినీ, జమ్మూకాశ్మీర్ పాలన యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలనూ అభినందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ పవిత్ర యాత్రను విజయవంతంగా ముగించడానికి మీరంతా అందించిన తోడ్పాటు ప్రశంసనీయం, అద్వితీయమని శ్రీ అమిత్ షా అన్నారు. బాబా బర్ఫానీ ఆశీర్వాదాలు అందరికీ దక్కాలని మంత్రి ఆకాంక్షించారు.
***
(Release ID: 2155379)