సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
“కాలసేతు.. భాషాసేతు ఛాలెంజ్”లో పాల్గొంటున్న అంకుర సంస్థలకు స్టార్టప్ యాక్సిలరేటర్ వేదిక ‘వేవ్‌ఎక్స్’ తుది పిలుపు
· వివరాల నవీకరణ... పత్రాల అప్‌లోడ్‌కు నేటితో ముగియనున్న గడువు
Posted On:
08 AUG 2025 6:23PM by PIB Hyderabad
“కాలసేతు, భాషా సేతు ఛాలెంజ్”లో పాల్గొంటున్న అంకుర సంస్థలకు సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలోని ‘స్టార్టప్ యాక్సిలరేటర్ వేదిక వేవ్‌ఎక్స్’ తుది పిలుపునిచ్చింది. ఈ మేరకు వివరాల నవీకరణ, అవసరమైన పత్రాల అప్‌లోడ్ కోసం ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముస్తుందని గుర్తుచేసింది.
మూల్యాంకన ప్రక్రియను బలోపేతం దిశగా ఆన్‌లైన్ పోర్టల్‌లోని ‘ప్రొఫైల్’ విభాగంలో అదనపు సమాచారం కోరుతూ కొత్త కాలమ్ జోడించినట్లు వేదిక పేర్కొంది. పోటీల్లో పాల్గొనే సంస్థలన్నీ ఆ వివరాలను నవీకరించాలని సూచించింది. దీంతోపాటు తమ కనీస ఆచరణాత్మక భావన (ఎంవీసీ) సహా ఇతరత్రా అవసరమైన పత్రాలను నిర్దేశిత స్వరూపంలో తప్పక అప్‌లోడ్ చేయాలని కోరింది. ఇందుకోసం అధికారిక పోర్టల్ https://wavex.wavesbazaar.comనువినియోగించుకోవాలని తెలిపింది.
ఈ రెండు పోటీల సంబంధిత మూల్యాంకన ప్రక్రియ రేపు (ఆగస్టు 10) ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో నేటితో గడువు ముగస్తున్నందున ఆ తర్వాత అందే వివరాలను పరిగణనలోకి తీసుకోరు. చివరి నిమిషంలో సాంకేతిక ఇబ్బందుల నివారణ దిశగా అంకుర సంస్థలన్నీ నిర్దేశిత వివరాలను సకాలంలో అందించి సహకరించాలని ‘వేవ్‌ఎక్స్’ వేదిక స్పష్టం చేసింది.
కాలసేతు అంటే...
దేశవ్యాప్తంగా ప్రాంతీయ డిజిటల్ భాషా అంతరాన్ని తగ్గించగల సాంకేతికత రూపకల్పనే ‘కాలసేతు ఛాలెంజ్’ లక్ష్యం. ఈ మేరకు ప్రభుత్వ సమాచార ప్రదాన సంస్థలు “ఇన్ఫోగ్రాఫిక్ విజువల్స్, సందర్భోచిత వీడియో విశదీకరణ చిత్రాలు, ఆడియో వార్తల క్యాప్సూల్స్” రూపంలో ప్రకటించే అధికారిక సమాచారాన్ని ప్రాంతీయంగా అర్థమయ్యే రీతిలో అప్పటికప్పుడు మార్చుకోగల ఉపకరణాలను అంకుర సంస్థలు తయారుచేయాల్సి ఉంటుంది.
భాషా సేతు అంటే...
మొత్తం 12 భారతీయ భాషలలో అప్పటికప్పుడు “అనువాదం, లిప్యంతరీకరణ, గళ స్థానికీకరణ” కోసం కృత్రిమ మేధ ఆధారిత ఉపకరణాలను పోటీలో పాల్గొనే అంకుర సంస్థలు రూపొందించాలన్నది ‘భాషా సేతు’ ఛాలెంజ్ లక్ష్యం.
ఆవిష్కరణాధారిత సంస్థల స్థాపన, అంకురావరణ వ్యవస్థ బలోపేతాన్ని ప్రోత్సహించాలన్న ప్రభుత్వ విస్తృత లక్ష్యంలో భాగంగా ఈ రెండు పోటీలను మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది.
ఈ నేపథ్యంలో పోటీదారు సంస్థలు తమ వివరాల నవీకరణ, పత్రాల అప్‌లోడ్‌పై సూచనలు-మార్గదర్శకాల కోసం కింద సూచించిన వెబ్‌సైట్‌ను చూడవచ్చు:
***
(Release ID: 2154627)