ప్రధాన మంత్రి కార్యాలయం
‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ప్రధాని నివాళి
Posted On:
09 AUG 2025 8:20AM by PIB Hyderabad
స్వాతంత్ర్య సమరంలో భాగంగా మహాత్మాగాంధీ స్ఫూర్తిదాయక నాయకత్వాన ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ నిండు మనసుతో కృతజ్ఞతలు తెలిపి, నివాళి అర్పించారు.
పరాయి పాలనను ఎదిరించడంలో వారు ప్రదర్శించిన ధైర్యసాహసాలు దేశభక్తిని రగిలించగా, అశేష ప్రజానీకంలో పెల్లుబికిన స్వేచ్ఛా పిపాస అందర్నీ ఏకతాటిపైకి తెచ్చిందని శ్రీ మోదీ గుర్తుచేశారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“బాపూజీ స్ఫూర్తిదాయక నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ మనం నిండైన కృతజ్ఞతతో స్మరించుకుందాం. వారు ప్రదర్శించిన ధైర్యసాహసాలు దేశభక్తిని రగిలించగా, అశేష ప్రజానీకంలో పెల్లుబికిన స్వేచ్ఛా పిపాస అందర్నీ ఏకతాటిపైకి తెచ్చింది” అని పేర్కొన్నారు.
(Release ID: 2154623)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam