ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో తమిళనాడులో రూ. 2157 కోట్ల వ్యయంతో నాలుగు లేన్ల మరక్కణం - పుదుచ్చేరి (ఎన్‌హెచ్-332ఏ) నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం
Posted On:
08 AUG 2025 4:08PM by PIB Hyderabad
తమిళనాడులో నాలుగు లేన్ల మరక్కణం - పుదుచ్చేరి (46 కి.మీ.) రహదారిని నిర్మించేందుకు ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును రూ.2,157 కోట్ల మూలధన వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతి (హెచ్ఏఎం)లో అభివృద్ధి చేస్తారు.
ప్రస్తుతం చెన్నై, పుదుచ్చేరి, విలుప్పురం, నాగపట్టణం మధ్య రవాణా అనుసంధానం ఇప్పటికే రెండు లేన్ల జాతీయ రహదారి 332ఎ (ఎన్‌హెచ్ - 332ఏ), అనుబంధ రాష్ట్ర రహదారులపై ఆధారపడి ఉంది. ఈ రహదారుల్లో రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కారిడార్‌ను ఆనుకొని జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, ప్రధాన నగరాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఎన్‌హెచ్-332ఏ జాతీయ రహదారిని మరక్కణం నుంచి పుదుచ్చేరి వరకు 46 కి.మీ. మేర నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. తద్వారా రద్దీ తగ్గి భద్రత పెరుగుతుంది. అలాగే వేగంగా విస్తరిస్తున్న చెన్నై, పుదుచ్చేరి, విలుప్పురం, నాగపట్టణం లాంటి నగరాల రవాణా అవసరాలు కూడా తీరతాయి.
రెండు ప్రధాన జాతీయ రహదారులు (ఎన్‌హెచ్-32, ఎన్‌హెచ్-332), రెండు రాష్ట్ర రహదారులు (ఎస్‌హెచ్ - 136, ఎస్‌హెచ్- 203)ను ఈ ప్రాజెక్టు కలుపుతుంది. తద్వారా తమిళనాడులోని ప్రధాన ఆర్థిక, సామాజిక, లాజిస్టిక్ కేంద్రాలకు ఎలాంటి అవరోధాలు లేని రవాణా సదుపాయాన్ని అందిస్తుంది. ఈ కారిడార్ రెండు రైల్వే స్టేషన్లు (పుదుచ్చేరి, చిన్నబాబుసముద్రం), ఒక మైనర్ నౌకాశ్రయం (కడలూర్)ను అనుసంధానించి బహుళ విధ రవాణా వ్యవస్థను ఏకీకృతం చేస్తుంది. తద్వారా ఈ ప్రాంతంలో సరకు, ప్రయాణికుల రవాణా సులభతరమవుతుంది.
మరక్కణం-పుదుచ్చేరి విభాగం పూర్తయిన తర్వాత ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. ప్రధాన ఆధ్యాత్మిక, ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తుంది. పుదుచ్చేరిలో పర్యాటకాన్ని పెంపొందిస్తుంది. అలాగే వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధిలో కొత్త అవకాశాలను అందిస్తుంది. అలాగే ఈ ప్రాజెక్టు దాదాపుగా 8 లక్షల ప్రత్యక్ష పని దినాలు, 10 లక్షల పరోక్ష పని దినాల ఉపాధిని సృష్టిస్తుంది. అలాగే పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమానికి కొత్త మార్గాలను తెరుస్తుంది.
కారిడార్ మ్యాపు
Appendix - I: Project Details
Feature
|
Details
|
Project Name
|
4-Lane Marakkanam – Puducherry Section (NH 332A)
|
Corridor
|
Chennai–Puducherry–Nagapattinam-Tuticorin-Kanyakumari Economic Corridor (East Coast Road - ECR)
|
Length (km)
|
46.047
|
Total Civil Cost (Rs Cr.)
|
1,118
|
Land Acquisition Cost (Rs Cr.)
|
442
|
Total Capital Cost (Rs Cr.)
|
2,157
|
Mode
|
Hybrid Annuity Mode (HAM)
|
Bypasses
|
Puducherry Bypass (Greenfield Access Controlled) – 34.7 km
|
Major Roads Connected
|
National Highways – NH-32, NH-332
State Highways – SH-136, SH-203
|
Economic / Social / Transport Nodes Connected
|
Airports: Chennai, Puducherry
Railway Stations: Puducherry, Chinnababusamudram
Minor Port: Cuddalore
Economic Nodes: Mega Food Park, Pharma Cluster, Fishing Cluster
Social Nodes: Arulmigu Manakula Temple, Paradise Beach
|
Major Cities / Towns Connected
|
Chennai, Marakkanam, Puducherry
|
Employment Generation Potential
|
8 lakh Man-Days (direct) & 10 lakh Man-Days (indirect)
|
Annual Average Daily Traffic (AADT) in FY-25
|
Estimated at 17,800 Passenger Car Units (PCU)
|
***
(Release ID: 2154510)