సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొనసాగుతున్న 15 వ భారత ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటు ప్రక్రియ: నామినేషన్లలో అధిక భాగం ఖరారు

Posted On: 08 AUG 2025 4:37PM by PIB Hyderabad

ప్రెస్ కౌన్సిల్ చట్టం 1978 నిబంధనల ప్రకారం భారత ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటైంది.

15వ ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటు స్థితి  క్రింద విధంగా ఉంది.

  1. సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ 3(ప్రకారం వర్కింగ్ జర్నలిస్టుల్లో పదమూడు మంది సభ్యులను నామినేట్ చేయాల్సి ఉండగావారిలో ఆరుగురు వార్తాపత్రికల ఎడిటర్లుగామిగిలిన ఏడుగురు ఎడిటర్లుగా కాకుండా వర్కింగ్ జర్నలిస్టులుగా ఉండాలిఈ సభ్యుల నియామక ప్రక్రియ ఢిల్లీ హైకోర్టులో విచారణలో ఉంది.

  2. సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ 3(బిప్రకారంఆరుగురిని వార్తాపత్రికల యాజమాన్యం లేదా వార్తాపత్రికల వ్యాపారాన్ని నిర్వహించే వ్యక్తులలో నుంచి నియమించాల్సి ఉంటుందిదీనికి సంబంధించి ప్రెస్ కౌన్సిల్ నుంచి ప్రభుత్వానికి నామినేషన్లు అందాయి.

  3. సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ 3(సిప్రకారం వార్తా సంస్థలను నిర్వహించే వ్యక్తుల నుంచి ఒకరిని నామినేట్ చేయాలిఇందుకోసం ప్రెస్ కౌన్సిల్ నుంచి నామినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు.

  4. సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ 3(డిప్రకారం ముగ్గురు విద్యసైన్స్న్యాయశాస్త్రంసాహిత్యంసంస్కృతికి సంబంధించి ప్రత్యేక పరిజ్ఞానం లేదా ఆచరణాత్మక అనుభవం కలిగిన వ్యక్తుల్లో ఒకరిని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ఒకరిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియామరొకరిని సాహిత్య అకాడమీ నామినేట్ చేస్తాయిఈ సభ్యులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు.

  5. సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ 3(ప్రకారం పార్లమెంట్ నుంచి ఐదుగురు సభ్యులు ఉంటారువీరిలో ముగ్గురిని లోక్ సభ నుంచి  స్పీకర్ నామినేట్ చేస్తారుమరో ఇద్దరిని రాజ్యసభ నుంచి చైర్మన్ నామినేట్ చేస్తారుస్పీకర్ నుంచి నామినేషన్ల స్వీకరణ పూర్తి కాగారాజ్యసభ చైర్మన్ నుంచి నామినేషన్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది.

కేంద్ర సమాచారప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ఈ రోజు లోక్ సభకు ఈ వివరాలు సమర్పించారు.

 

***


(Release ID: 2154509)