ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐఎన్ఎస్ అజయ్, ఐఎన్ఎస్ నిస్తార్: రక్షణ రంగాన్ని దేశీయంగా అభివృద్ధి చేయడానికి అందిస్తున్న వ్యూహాత్మక ఉక్కు సరఫరాలో


సెయిల్ సాధించిన తాజా విజయాలు

Posted On: 04 AUG 2025 3:28PM by PIB Hyderabad

దేశీయంగా రక్షణ రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఉక్కు రంగంలో అతిపెద్ద పీఎస్‌యూ, మహారత్న సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) కీలకపాత్ర పోషిస్తోంది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (జీఆర్ఎస్ఈ) ప్రారంభించిన ఐఎన్ఎస్ అజయ్‌కు, జులై 2025లో హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) ప్రారంభించిన ఐఎన్ఎస్ నిస్తార్‌కు క్రిటికల్ - గ్రేడ్ ఉక్కును సెయిల్ సరఫరా చేస్తోంది.

నిర్మాణ సమగ్రత, సామర్థ్యానికి హామీ ఇస్తూ.. ఐఎన్ఎస్ అజయ్‌ తయారీకి అవసరమైన ప్రత్యేక డీఎంఆర్ గ్రేడ్ స్టీల్ ప్లేట్లు అన్నింటినీ సెయిల్ సరఫరా చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో జీఆర్ఎస్ఈ రూపొందించిన యాంటీ సబ్ మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ (ఏఎస్‌డబ్ల్యూ-ఎస్‌డబ్ల్యూసీ) సిరీస్‌లో ఐఎన్ఎస్ అజయ్ ఎనిమిదోది, చివరి యుద్ధ నౌక.

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి, నిర్మించిన మొదటి డైవింగ్ సపోర్ట్ వెసల్ (డీఎస్వీ) అయిన ఐఎన్ఎస్ నిస్తార్‌కు అవసరమైన ప్రత్యేక గ్రేడు ప్లేట్లు మొత్తాన్ని సెయిల్ సరఫరా చేసింది. జలాంతర్గామి రక్షణ కార్యకలాపాలు, డీప్ సీ డైవింగ్, పెట్రోలింగ్ చేపట్టడంలో హెచ్ఎస్ఎల్ రూపొందించిన ఐఎన్ఎస్ నిస్తార్ కీలకపాత్ర పోషిస్తుంది.

జాతీయ రక్షణ రంగ లక్ష్యాలు సాధించడం, ఆత్మనిర్భర భారత్‌ను నిర్మించడంలో సెయిల్ అందిస్తున్న వ్యూహాత్మక తోడ్పాటు.. రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంలో ఆ సంస్థ అంకితభావాన్ని తెలియజేస్తుంది. ప్రతి టన్ను స్టీలుతో భారతీయ నౌకా వాణిజ్య సన్నద్ధతను, రక్షణ స్థిరత్వాన్ని పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

 

***


(Release ID: 2152167)