ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
చిన్నారుల టీకా కార్యక్రమంపై తాజా సమాచారం
* దేశంలో టీకా కార్యక్రమం ద్వారా చిన్నారులకు ఉచితంగా 11 టీకాలు
* గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చిన్నారులు, గర్భిణులకు వారానికోసారి సాధారణ వ్యాధి నిరోధక టీకా సెషన్ల నిర్వహణ
* ఇమ్యునైజేషన్ కవరేజీని పెంచడానికి చట్టసంబధమైన, సామాజిక సమీకరణ, కుటుంబ స్థాయిలో సమాచారం, మీడియా భాగస్వామ్యం తరహా వ్యూహాత్మక కార్యక్రమాల నిర్వహణ
* తక్కువ ఇమ్యునైజేషన్ కవరేజీ ఉన్న ప్రాంతాల్లో టీకాలు వేయించుకోని, మధ్యలో మానేసిన చిన్నారులు, గర్భిణులకు సార్వత్రిక టీకా కార్యక్రమం ద్వారా మిషన్ ఇంద్రధనుష్, ప్రత్యేక క్యాచప్ వ్యాక్సినేషన్ కార్యక్రమం
* ఏటా నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జాతీయ వ్యాధి నిరోధక దినోత్సవాల తరహా ప్రత్యేక టీకా కార్యక్రమాలు
प्रविष्टि तिथि:
01 AUG 2025 2:29PM by PIB Hyderabad
దేశంలో టీకా కార్యక్రమం ద్వారా చిన్నారులకు ఉచితంగా 11 టీకాలు అందిస్తారు. వాటి వివరాలు:
హెపటైటిస్ బి వ్యాక్సీన్
ఓరల్ పోలియో వ్యాక్సిన్ (ఓపీవీ)
బాసిల్లస్ కాల్మే గ్వెరిన్ (బీసీజీ)
ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సీన్ (ఐపీవీ)
పెంటావాలెంట్ వ్యాక్సిన్
రొటావైరస్ వ్యాక్సిన్ (ఆర్‌వీవీ)
న్యూమోకొక్కల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ)
మీజిల్స్ అండ్ రుబెల్లా వ్యాక్సిన్ (ఎంఆర్)
డిఫ్తీరియా పెర్ట్యూసిస్ టెటనస్ వ్యాక్సిన్ (డీపీటీ)
టెటనస్ అండ్ అడల్ట్ డిఫ్తీరియా వ్యాక్సిన్ (టీడీ)
జపనీస్ ఎన్‌సెఫలిటిస్ వ్యాక్సిన్ (జేఈ)
జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చిన్నారులు, గర్భిణులకు టీకాలు వేసేందుకు సాధారణ టీకా సెషన్లను వారానికోసారి ఏర్పాటు చేస్తారు. ప్రతి సెషన్‌కు ముందు ఆ ప్రాంతానికి చెందిన ఆశా కార్యకర్త ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు టీకాలు వేసే ప్రదేశం వివరాలు చెప్తారు. వ్యాక్సినేషన్ చేపట్టే రోజున టీకాలు వేయించుకొనే విధంగా చిన్నారులు, గర్భిణులను ప్రోత్సహిస్తారు. దేశంలో టీకాలను విస్తృతంగా అందించేందుకు సమాచారం, అవగాహన, ప్రసార (ఐఈసీ) కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. మీడియా ప్రముఖుల ద్వారా దూరదర్శన్, రేడియో జింగిల్స్, యూట్యూబ్ పాడ్‌కాస్ట్ ద్వారా ఐఈసీ అవగాహన చేపడుతున్నారు. ఎక్స్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, ఫేస్‌బుక్ పేజీలు వంటి సోషల్ మీడియా వేదికలను కూడా ఉపయోగిస్తున్నారు. ప్రాంతీయ స్థాయిలో బహిరంగ ప్రకటనలు, పోస్టర్లు, బృంద సమావేశాలు చేపడుతున్నారు.
దేశంలో గత అయిదేళ్లలో టీకా ప్రచారం, ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని మరింత ప్రభావవంతంగా చేపట్టడానికి ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాలు:
స్టేట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎస్టీఎఫ్ఐ), డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇమ్యునైజేషన్ (డీటీఎఫ్ఐ), బ్లాక్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇమ్యునైజేషన్ (బీటీఎఫ్ఐ) క్రమం తప్పకుండా నిర్వహించే వ్యాక్సినేషన్ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలయ్యేలా చూస్తాయి.
ఇమ్యునైజేషన్ కవరేజీని పెంచడానికి అవగాహన, సామాజిక సమీకరణ, కుటుంబ స్థాయిలో సమాచారం, పాత్రికేయ సమావేశాలు తరహా వ్యూహాత్మక కార్యక్రమాలు నిర్వహించారు.
సార్వత్రిక టీకా కార్యక్రమం ద్వారా ఇమ్యునైజేషన్ కవరేజీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో టీకాలు తీసుకోని, మధ్యలో మానేసిన చిన్నారులు, మహిళల కోసం మిషన్ ఇంద్రధనుష్, ప్రత్యేక క్యాచప్ వ్యాక్సినేషన్ కార్యక్రమం.
ప్రతి ఏటా నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జాతీయ టీకా దినోత్సవాలు (ఎన్ఐడీ) లాంటి ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాల నిర్వహణ.
ఇమ్యునైజేషన్ కార్యక్రమాలకు నిర్దేశించిన రోజుల్లో గ్రామీణ ఆరోగ్యం, పోషకాహార దినోత్సవాలు (వీహెచ్ఎన్‌డీ) నిర్వహణ
డిజిటల్ రిజిస్ట్రేషన్, చిన్నారులు, గర్భిణీలకు ఇచ్చే టీకాలను రికార్డు చేయడానికి కుటుంబ, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ యు-విన్ పోర్టల్ ప్రారంభించింది.
లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ ఈ సమాచారాన్ని లిఖితపూర్వకంగా అందించారు.
****
(रिलीज़ आईडी: 2151593)
आगंतुक पटल : 11