పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
పార్లమెంటులో ప్రశ్న: రైళ్లు ఢీకొట్టిన ఘటనల్లో ఏనుగుల మృతి
Posted On:
28 JUL 2025 3:52PM by PIB Hyderabad
రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంత పాలన యంత్రాంగాలు అందించిన సమాచారం ప్రకారం, 2019-20 నుంచి 2023-24 మధ్య వివిధ రాష్ట్రాలలో రైళ్లు ఢీకొట్టిన కారణంగా 81 ఏనుగులు చనిపోయాయి.
రైలు పట్టాల మీద నడుస్తూ ఏనుగులు ప్రమాద ఘటనల్లో చనిపోయే ఘటనలను నివారించడానికి పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ రైల్వేల శాఖతో సమన్వయాన్ని ఏర్పరుచుకొని అనేక చర్యలను చేపట్టింది. ఈ చర్యల్లో భాగంగా వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమావేశాలను కూడా నిర్వహించారు. ఏనుగులు సంచరించే ప్రాంతాలలో రైళ్ల ప్రయాణ వేగంపై పరిమితులను విధించడం, భూమిలో కంపనలను నమోదు చేసే సెన్సర్-ఆధారిత ప్రాజెక్టులను ప్రయోగాత్మక ప్రాతిపదికన అమలుచేస్తూ ఏనుగుల మందలను గుర్తించడం, వివిధ చోట్ల అండర్‌పాసులు, ర్యాంపులు, కంచెలను నిర్మించడం వంటి పనులు పూర్తి చేశారు.
అదనంగా పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖతో పాటు ఇతర ఆసక్తిదారులను భారత వన్యప్రాణుల సంస్థ (వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా) సంప్రదించి, ఒక డాక్యుమెంటును ప్రచురించింది. ఈ డాక్యుమెంటుకు ‘ఎకో-ఫ్రెండ్లీ మెజర్స్ టు మిటిగేట్ ఇంపాక్ట్స్ ఆఫ్ లీనియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ అని పేరు పెట్టారు. రైలుమార్గాలు సహా ఇతర మౌలిక సదుపాయాలను అవి ఒకే వరుసలో ఉండేటట్లుగా రూపొందించడంలో ఆయా ప్రాజెక్టులను చేపట్టిన ఏజెన్సీలకు ఈ డాక్యుమెంటు సహాయపడుతుంది. ఈ ఏర్పాటు ద్వారా మనుషులకు, పశువులకు మధ్య ఘర్షణను నివారించడానికి వీలుపడుతుంది.
ఏనుగుల సంరక్షణపై రైల్వే అధికారుల అవగాహనను పెంచేందుకు భారత వన్యప్రాణుల సంస్థ 2023, 2024లలో వర్క్‌షాపులను నిర్వహించింది.
3,452.4 కి.మీ. పరిధిలో మొత్తం 127 రైల్వే ప్రాంతాల్లో సర్వే నిర్వహించి... ఏనుగులు, ఇతర వన్యప్రాణులు ఈ తరహా ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదికను రూపొందించారు. ఈ ప్రమాదాలను, వన్యప్రాణుల కదలికలు అధికంగా ఉండే 77 రైల్వే అధీన ప్రాంతాల్లో నిర్దిష్ట చర్యలను ప్రాధాన్య ప్రాతిపదికన చేపట్టడం ద్వారా తగ్గించాలని సంకల్పించారు. ఈ రైల్వే అధీన ప్రాంతాలన్నీ 14 రాష్ట్రాల్లో 1,965.2 కి.మీ. మేర విస్తరించాయి. గుర్తించిన ప్రాంతాల వివరాలను, ప్రమాదాలను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలను ప్రస్తావించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రైల్వే శాఖతో పంచుకొన్నారు.
ఈ సమాచారాన్ని కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ లోకసభలో ఈ రోజు ఒక ప్రశ్నకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 2149555)
Visitor Counter : 7