ప్రధాన మంత్రి కార్యాలయం
హిమాచల్ ప్రదేశ్‌లోని మండీలో దుర్ఘటన.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం
* పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధానమంత్రి
Posted On:
24 JUL 2025 11:03PM by PIB Hyderabad
హిమాచల్ ప్రదేశ్‌లోని మండీలో ఈ రోజు జరిగిన ఒక ప్రమాదం కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మృతుల్లో ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల వంతున, గాయపడ్డ వ్యక్తులకు రూ.50,000 వంతున ‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి’ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఎక్స్‌గ్రేషియాను సంబంధిత కుటుంబాలకు అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొంది:
‘‘మండీలో ఒక ప్రమాదం కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని తెలిసి బాధపడ్డాను. ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను.
మృతుల దగ్గరి బంధువులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను ఇస్తాం. గాయపడిన వారికి రూ.50,000 వంతున ఇస్తాం: ప్రధానమంత్రి (@narendramodi)’’.
(Release ID: 2148238)
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada