జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి కృషి సించాయి యోజన

Posted On: 24 JUL 2025 1:46PM by PIB Hyderabad

నీటి వనరులు, నదీ అభివృద్ధి, గంగా పునరుజ్జీవన విభాగం నివేదిక ప్రకారం ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) 2015-16లో ప్రారంభమైంది. పొలాలకు నీటి వసతిని పెంపొందించడం, హామీ ఇచ్చిన నీటి పారుదల కింద సాగుభూమి విస్తీర్ణాన్ని పెంచడం, సాగునీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, సుస్థిరమైన నీటి సంరక్షణ పద్ధతులను పరిచయం చేయడం వంటివి ఈ పథకం లక్ష్యాలు.

యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్ (ఏఐబీపీ), హర్ ఖేత్ కో పానీ (హెచ్‌కేకేపీ) లాంటి ప్రధాన కార్యక్రమాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చిన పథకం పీఎంకేఎస్‌వై. హెచ్‌కేకేపీలో నాలుగు ఉప విభాగాలున్నాయి: కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ (సీఏడీ అండ్ డబ్ల్యూఎం), సర్ఫేస్ మైనర్ ఇరిగేషన్ (ఎస్ఎంఐ), రిపేర్, రెనోవేషన్, రిస్టోరేషన్ (ఆర్ఆర్ఆర్) ఆఫ్ వాటర్ బాడీస్, గ్రౌండ్ వాటర్ (జీడబ్ల్యూ) డెవలప్మెంట్. హెచ్‌కేకేపీ ఉప విభాగమైన సీఏడీ అండ్ డబ్ల్యూఎంను ఏఐబీపీతో కలసి పారీ-పసు అమలు చేస్తోంది.

2021-22 నుంచి 2025-26 కాలానికి పీఎంకేఎస్‌వై అమలుకు భారత ప్రభుత్వం 2021 డిసెంబర్లో ఆమోద ముద్ర వేసింది. అయినప్పటికీ, ముందుగానే నిర్దేశించిన పనుల నిమిత్తం పీఎంకేఎస్‌వై-హెచ్‌కేకేపీ కింద ఉన్న భూగర్భ జలాల విభాగానికి 2021-22 వరకు తాత్కాలిక అనుమతి ఇచ్చారు.. అనంతరం కొనసాగుతున్న పనులను కూడా పొడిగించారు.

దీనికి అదనంగా పీఎంకేఎస్‌వై రెండు విభాగాలను కలిగి ఉంది. వీటిని ఇతర మంత్రిత్వ శాఖలు అమలు చేస్తాయి. పీఎంకేఎస్‌వైకు చెందిన వాటర్‌షెడ్ డెవలప్మెంట్ కాంపొనెంట్ (డబ్ల్యూడీసీ)ను భూరికార్డుల నిర్వహణ విభాగం అమలు చేస్తోంది. వ్యవసాయం, రైతు సంక్షేమ విభాగం పర్ డ్రాప్ మోర్ క్రాప్ (పీడీఎంసీ) విభాగాన్ని అమలు చేస్తుంది. ఇది 2015లో పీఎంకేఎస్‌వై ప్రారంభమైన నాటి నుంచి 2021 వరకు ఈ పథకంలో భాగంగా ఉంది. అనంతరం రాష్ట్రీయ కృషి వికాస యోజనలో భాగంగా వ్యవసాయం, రైతు సంక్షేమ విభాగం దీన్ని అమలు చేస్తోంది.

నీటిపారుదల ప్రాజెక్టుల అమలులో ప్రధాన సమస్యల్లో భూ సమీకరణ ఒకటి. భూగర్భ పైపులైన్ల ద్వారా దాదాపు 55,290 కి.మీ. మేర పంపిణీ వ్యవస్థ నిర్మాణం చేపట్టడం ద్వారా సుమారుగా 76,594 హెక్టార్ల భూసమీకరణ అవసరం లేకపోయింది. పీఎంకేఎస్‌వై ప్రాజెక్టుల్లో భాగమైన కొన్ని ఎస్‌సీఏడీఏ ఆధారిత నీటి పంపిణీ, సూక్ష్మ నీటి పారుదల వ్యవస్థలు నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించాయి. వాస్తవ సమయంలో ఈ ప్రాజెక్టుల భౌతిక, ఆర్థిక పురోగతిని, సమస్యలను నిర్వహణా సమాచార వ్యవస్థ తోడ్పాటుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్యాష్ బోర్డు పర్యవేక్షిస్తుంది. అలాగే పీడీఎంసీ ద్వారా సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థను ప్రోత్సహిస్తుంది.

ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ (పీఎంజీ) పోర్టల్ ద్వారా ప్రాజెక్టుల పరిధిలోని సమస్యలను పర్యవేక్షిస్తారు. అలాగే ప్రాజెక్టులను తర్వగా పూర్తి చేసేందుకు అవసరమైన భూసమీకరణ, చట్టబద్ధమైన అనుమతులు తదితర సమస్యలు, అడ్డంకులను క్రమం తప్పకుండా చర్చించి, పరిష్కరిస్తారు.

లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని జల శక్తి సహాయ మంత్రి శ్రీ వీ సోమన్న లిఖితపూర్వకంగా అందించారు.


 

***

 

(Release ID: 2148131)