అంతరిక్ష విభాగం
పార్లమెంట్‌లో ప్రశ్న: అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో ఆంధ్రప్రదేశ్ సామర్ధ్యం
Posted On:
24 JUL 2025 3:33PM by PIB Hyderabad
అంతరిక్ష రంగ తయారీ సముదాయాన్ని ఏర్పాటు చేయటంపై ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ ఆంధ్రప్రదేశ్‌తో సహా వివిధ రాష్ట్రాలను ఇన్-స్పేస్ సంప్రదించింది. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన అంతరిక్ష తయారీ సముదాయాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సాంకేతిక సాయాన్ని ఇన్-స్పేస్ అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల అంతరిక్ష రంగం విషయంలో రాష్ట్ర స్థాయి విధానాన్ని ప్రకటించింది.
అంతరిక్ష రంగంలో ప్రభుత్వేతర సంస్థలు కార్యకలాపాలను ప్రారంభించేందుకు మార్గదర్శకత్వం, సాంకేతికత బదిలీ, నిధులను సమకూర్చుకోవటంలో ఇన్-స్పేస్ సహయం చేస్తోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అంతరిక్ష రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన మొత్తం 11 ప్రభుత్వేతర సంస్థలు ఇన్-స్పేస్ వద్ద నమోదయ్యాయి. ఇందులో 9 అంకురాలే. కార్యకలాపాల నిర్వహణ, సీడ్ ఫండ్, కావాల్సిన అనుమతులు పొందటానికి సంబంధించి ఈ 11 ఎన్‌జీఈలలో ఒకటి మాత్రమే ఇన్-స్పేస్ సహయాన్ని అందుకుంది.
అంతరిక్ష రంగ ఇంజనీరింగ్ సామర్ధ్యాలను, పారిశ్రామిక నైపుణ్యాన్ని మెరుగుపరచేందుకు విద్యకు సంబంధించి ఈ కింది కార్యక్రమాలను చేపట్టింది:
* అంతరిక్ష రంగంలో పరిశ్రమలతో పాటు విద్యాసంస్థల నైపుణ్యాలను పెంపొందించేందుకు అంతరిక్ష రంగంలోని అన్ని అంశాలతో కూడిన పాఠ్య ప్రణాళిక కలిగిన 10 స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి కోర్సులను నిర్వహించింది.
* దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నీ అంతరిక్ష రంగ సాంకేతిక విద్యను అందించేందుకు కావాల్సిన సహాయం చేసేందుకు, భారత్లో అంతరిక్ష సాంకేతిక విద్యను ప్రోత్సహించేందుకు జాతీయ కమిటీని ఏర్పాటు చేశారు.
* అంతరిక్ష సాంకేతికలో బీటెక్ మైనర్ డిగ్రీకి సంబంధించి పాఠ్యాంశాలను తయారు చేశారు. దీనిని ఏఐసీటీఈ ఆమోదించింది.
ఈ సమాచారాన్ని ఇవాళ కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ(స్వతంత్ర), భూవిజ్ఞాన శాఖ(స్వతంత్ర), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పింఛన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల (స్వతంత్ర) సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధాన రూపంలో ఇచ్చారు.
***
(Release ID: 2147987)