సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పార్లమెంటులో ప్రశ్న: ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనం

Posted On: 23 JUL 2025 2:25PM by PIB Hyderabad

దేశంలోని విద్యా సంస్థలు/కళాశాలల్లో ఉన్నత విద్యను అభ్యసించేలా షెడ్యూల్డు కులాలకు చెందిన విద్యార్థుల విద్యాప్రమాణాలను పెంపొందించడంలో.. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ (పీఎంఎస్), ఉన్నతస్థాయి విద్యా పథకం ద్వారా ఎస్సీ విద్యార్థులకు అందిస్తున్న ఆర్థిక సాయం, ఉపకార వేతనాలు విశేషంగా దోహదపడ్డాయి.

ఇది ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, షెడ్యూల్డు కులాలకు చెందిన విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందేలా దోహదపడింది. విద్యావకాశాలను మెరుగుపరచడం ద్వారా సామాజిక - ఆర్థిక ప్రగతిని పెంపొందించాయి. కెరీర్ అవకాశాలను పెంచడంతోపాటు ఎస్సీ వర్గాల్లో ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని ఈ పథకాలు పరిష్కరించాయి.

గడచిన ఐదేళ్లలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ ద్వారా 2,22,31,139, ఉన్నత స్థాయి విద్యా పథకం కింద 20,340 ఎస్సీ విద్యార్థులకు ప్రయోజనం కలిగింది.

ఈ పథకాల కింద షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు ఐఐటీ, ఐఐఎంలు, ట్రిపుల్ ఐటీలు, ఏఐఐఎంఎస్‌లు, ఎన్ఐటీలు, ఎన్ఐఎఫ్‌టీలు, ఎన్ఐడీలు, ఐహెచ్ఎంలు, ఎన్ఎల్‌యూలు మొదలైన కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. తమతమ రంగాల్లో విశేషమైన విజయాలు సాధించారు.

రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ రాందాస్ అథవాలే ఈ సమాచారాన్ని అందించారు.  

 

***


(Release ID: 2147428)