రక్షణ మంత్రిత్వ శాఖ
క్విజ్ పోటీల కోసం సన్నాహాలు
థింక్ 2025 – ది ఇండియన్ నేవీ క్విజ్ 2025
Posted On:
22 JUL 2025 5:46PM by PIB Hyderabad
గత ఎడిషన్లలో అద్భుత విజయం సాధించిన ది ఇండియన్ నేవీ థింక్ 2025 జాతీయ స్థాయి క్విజ్ పోటీ తిరిగి ప్రారంభం కానుంది. నాల్గో సంవత్సరం నిర్వహించనున్న ఈ క్విజ్ పోటీలను యువతకు, భవిష్యత్ నాయకులకు భారత నావికాదళాన్ని గురించి సమగ్రమైన అవగాహన కలిగించే లక్ష్యంతో రూపొందించారు. మేధో వృద్ధి, భారత విశిష్ట సముద్ర వారసత్వాన్ని గురించి అవగాహనను పెంపొందించడం లక్ష్యంగా గల ఈ ప్రధాన కార్యక్రమం సాధారణ పరిజ్ఞానానికి మించిన పరీక్ష.
ఈ సంవత్సరం ‘మహాసాగర్’ ఇతివృత్తంతో థింక్ 2025 పోటీలు జరగనున్నాయి. ఈ ఇతివృత్తం పురాతన లోథాల్ రేవుల నుంచి భారత సముద్ర ప్రయాణాన్ని, ఇండో-పసిఫిక్‌లో పెరుగుతున్న దాని ఉనికినీ ప్రదర్శిస్తుంది. అదే సమయంలో మహాసముద్రాల ప్రాముఖ్యతను, అన్వేషణ-ఆవిష్కరణల స్ఫూర్తిని స్పష్టం చేస్తుంది. 2025ను ‘సంస్కరణల సంవత్సరం’గా ప్రకటించిన రక్షణ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ దార్శనికతలోనూ ఈ ఇతివృత్తం ప్రతిధ్వనిస్తుంది.
దేశవ్యాప్తంగా 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ఈ క్విజ్ హైబ్రిడ్ ఫార్మాట్‌ను అనుసరిస్తుంది. పాల్గొనేవారి సమగ్ర మూల్యాంకనాన్ని నిర్ధారిస్తూ నాలుగు దశల్లో జరుగుతుంది. మొదటి మూడు దశలు వడపోతకు ఉద్దేశించారు. ఇవి ఆన్‌లైన్ ద్వారా జరుగుతాయి. అనంతరం ఆన్‌లైన్ ప్రోక్టర్డ్ మోడ్ ద్వారా జోనల్ ఎంపిక ఉంటుంది. న్యాయబద్ధంగా, నిమగ్నయ్యేదిగా.. పరిజ్ఞాన వేగం, స్థాయి రెండింటినీ పరీక్షించేలా ఈ క్విజ్‌ను రూపొందించారు.
జోనల్స్ నుంచి టాప్ 16 జట్లు సెమీ ఫైనల్స్‌కు వెళ్తాయి. సెమీ ఫైనల్ పోటీల విజేతలు గ్రాండ్ ఫినాలేలో ప్రతిష్ఠాత్మక థింక్-25 ట్రోఫీ కోసం పోటీపడతాయి. సెమీఫైనల్, గ్రాండ్ ఫినాలే పోటీలు కేరళలోని ఎజిమలలో గల భారత నౌకాదళ అకాడమీ వేదికగా ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతాయి.
ముఖ్యమైన తేదీల వివరాలు:-
రిజిస్ట్రేషన్స్ ముగింపు: 2025 ఆగస్టు 31
ఆన్‌లైన్ ఎలిమినేషన్ రౌండ్ 1: 2025 సెప్టెంబరు 08, 09, 10
ఆన్‌లైన్ ఎలిమినేషన్ రౌండ్ 2: 2025 సెప్టెంబరు 16, 17
ఆన్‌లైన్ ఎలిమినేషన్ రౌండ్ 3: 2025 సెప్టెంబరు 23, 24
జోనల్ ఎంపిక రౌండ్: 2025 అక్టోబరు 13, 14
సెమీఫైనల్స్: 2025 నవంబరు 13
గ్రాండ్ ఫినాలే: 2025 నవంబరు 14
పాఠశాలలు నమోదు చేసుకోవడానికి, కార్యక్రమం గురించిన మరింత సమాచారం కోసం www[dot]indiannavythinq[dot]in ను సందర్శించవచ్చు.
***
(Release ID: 2147001)