ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ కె.కామరాజ్ గారి జయంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
15 JUL 2025 9:27AM by PIB Hyderabad
శ్రీ కె. కామరాజ్ గారి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి ఈ రోజు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. కామరాజ్ గారి ఉదాత్తమైన ఆదర్శాలతో పాటు సామాజిక న్యాయ సాధనకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం...మనకు ఎంతో ప్రేరణనిస్తాయని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పొందుపరిచిన సందేశంలో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘శ్రీ కె. కామరాజ్ గారి జయంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయన ముందు వరుసలో నిలిచారు. అనంతర కాలంలో దేశ నిర్మాణానికి కూడా ఆయన సేవలు అందించారు. ఉదాత్తమైన ఆయన ఆదర్శాలూ, సామాజిక న్యాయ సాధనకు ఆయిన ఇచ్చిన ప్రాధాన్యం.. నేటికీ మనకు స్ఫూర్తిని అందిస్తాయి.’’
***
(रिलीज़ आईडी: 2144786)
आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam