ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దలైలామా 90వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 06 JUL 2025 8:12AM by PIB Hyderabad

దలైలామా 90వ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, సహనం, నైతిక క్రమశిక్షణలకు దలైలామా శాశ్వత ప్రతీకగా నిలుస్తారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆయన సందేశం అన్ని మతాల్లోనూ గౌరవం, ఆదర భావాలను ప్రేరేపించిందని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

‘ఎక్స్’ వేదికగా ఆయన ఇలా పేర్కొన్నారు..

"దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా 140 కోట్ల మంది భారతీయులతో పాటు నేనూ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రేమ, కరుణ, సహనం, నైతిక క్రమశిక్షణలకు ఆయన శాశ్వత ప్రతీకగా నిలిచారు. దలైలామా సందేశం అన్ని మతాల్లోనూ గౌరవం, ఆదరభావాలను ప్రేరేపించింది. ఆయన సంపూర్ణ ఆరోగ్యం.. పరిపూర్ణ ఆయుష్షు కోసం ప్రార్థిస్తున్నా.

@DalaiLama"

 

 

****

MJPS/ST


(Release ID: 2142609)