ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన ప్రధానమంత్రి

Posted On: 05 JUL 2025 8:00PM by PIB Hyderabad

కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. దళితులు, వెనుకబడిన తరగతులు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ మరచిపోలేమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు. 

"కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి సందర్భంగా ఆయనకు వినయపూర్వక శ్రద్ధాంజలి. ఆయన జీవితం మొత్తం సామాజిక న్యాయం కోసం అంకితం చేశారు. దళితులు, వెనుకబడిన తరగతులు, అణగారిన వర్గాల అధికారాల కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ మరచిపోలేం."

"पूर्व केंद्रीय मंत्री रामविलास पासवान जी को उनकी जयंती पर विनम्र श्रद्धांजलि। उनका संपूर्ण जीवन सामाजिक न्याय को समर्पित रहा। दलितों, पिछड़ों और वंचितों के अधिकारों के लिए उनके संघर्ष को कभी भुलाया नहीं जा सकता।"

 

 

***

MJPS/ST


(Release ID: 2142605)