జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

ఒడిశా గంజాం జిల్లాలో అక్రమంగా పశువులను తరలించారన్న అనుమానంతో షెడ్యూల్డ్ కులానికి చెందిన ఇద్దరి పట్ల ఇతర వర్ణాల దౌర్జన్యం:

వార్తను సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల కమిషన్

రెండు వారాల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ, డీజీపీకీ ఆదేశాలు

Posted On: 02 JUL 2025 1:39PM by PIB Hyderabad

అక్రమంగా పశువులను తరలించుపోయారన్న అనుమానంతో షెడ్యూల్డు కులానికి చెందిన ఇద్దరి పట్ల ఇతర వర్ణాల వారు దౌర్జన్యానికి పూనుకున్నారని, వారిని కొట్టి, బలవంతంగా గడ్డి తినిపించి, మురుగునీరు తాగించారంటూ వెలువడిన వార్తను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఒడిశా గంజాం జిల్లాలో జూన్ 26న ఈ సంఘటన జరిగినట్లు, నిందితులు బాధితుల ఫోన్లు లాక్కోవడమే కాక, వారికి శిరోముండనం కూడా చేయించినట్లు మీడియా కథనం వెల్లడించింది.

 

వార్త వాస్తవమైనదే అయితే, దీనిని తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించవలసి ఉంటుందని కమిషన్ పేర్కొంది. ఇందుకు సంబంధించి అన్ని వివరాలతో కూడిన సమగ్ర నివేదికను రెండు వారాల్లోగా తనకు సమర్పించాలంటూ ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ, రాష్ట్ర డీజీపీకీ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

 

దోషుల పట్ల తీసుకున్న చర్యలు, బాధితులకు అందించిన పరిహారం వంటి వివరాలను కూడా నివేదికలో పొందుపరచాలని కమిషన్ ఆదేశాలు స్పష్టం చేశాయి.

 

 

*****


(Release ID: 2141501) Visitor Counter : 2