మంత్రిమండలి
ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని సింగ్నా వద్ద ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ (సీఐపీ) దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
प्रविष्टि तिथि:
25 JUN 2025 3:18PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఆగ్రాలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ (సీఐపీ) దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రం (సీఎస్ఏఆర్సీ) ఏర్పాటు చేయాలన్న వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ప్రతిపాదనకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఆహార, పౌష్టికాహార భద్రత పెంపొందింపు, రైతు ఆదాయాన్ని పెంచడం, ఉపాధి కల్పన లక్ష్యాలుగా ప్రభుత్వం ఈ పెట్టుబడికి ఆమోదం తెలిపింది. ఆలుగడ్డ, చిలగడదుంపల ఉత్పత్తి పెంపు, కోతల అనంతర కార్యకలాపాలు, విలువ జోడింపు కార్యకలాపాల వల్ల ఈ లక్ష్యాలు సాధ్యపడతాయని భావిస్తున్నారు.
ఆలుగడ్డలు, చిలగడదుంపల సాగు, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రవాణా, విక్రయం, వేల్యూ చెయిన్ వంటి కార్యకలాపాలు విశేషమైన ఉపాధి అవకాశాలను కలిగి ఉన్నాయి. దాంతో, ఈ రంగంలోని విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని సింగ్నా వద్ద ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ (సీఐపీ) దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రం ఏర్పాటవుతోంది. సీఎస్ఏఆర్సీ అభివృద్ధి పరచిన భారీ దిగుబడులనిచ్చే, పుష్టికరమైన, వాతావరణ మార్పులకు తట్టుకునే ఆలుగడ్డ, చిలగడదుంప రకాల సాగు ఈ రంగంలో సుస్థిర అభివృద్ధికి బాటలు వేస్తుంది. అంతేకాక, అందివచ్చే అంతర్జాతీయ స్థాయి విజ్ఞానం, సృజనాత్మకతల వల్ల భారత్ కే కాక, మొత్తం దక్షిణాసియా ప్రాంతానికి ప్రయోజనం కలుగుతుంది.
*****
(रिलीज़ आईडी: 2139586)
आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam