ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏకీకృత పెన్షన్ పథకం (యూపీఎస్) ఎంపిక వినియోగించుకునేందుకు


మరో మూడు నెలలు అంటే సెప్టెంబరు 30 వరకు గడువు పొడిగింపు

प्रविष्टि तिथि: 23 JUN 2025 5:55PM by PIB Hyderabad

అర్హులైన ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏకీకృత పెన్షన్ పథకం (యూపీఎస్)ను ప్రవేశపెడుతున్నట్లు 2025 జనవరి 24 నాటి నోటిఫికేషన్ నెం. F. No. FX-1/3/2024-PR ద్వారా భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

ఈ విధానం అమలు కోసం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) 2025 మార్చి 19న పీఎఫ్ఆర్‌డీఏ (ఎన్‌పీఎస్ కింద ఏకీకృత పెన్షన్ పథకం కార్యాచరణనిబంధనలు-2025ను వెల్లడించింది.

నిబంధనల ప్రకారంఅర్హత కలిగిన ప్రస్తుత ఉద్యోగులుగతంలో పదవీ విరమణ చేసినవారుగతంలో పదవీ విరమణ చేసి మరణించిన వారి చట్టబద్ధమైన జీవిత భాగస్వాములు ఈ పథకం ఎంపికను వినియోగించుకోవడం కోసం మూడు నెలలు అంటే 2025 జూన్ 30 వరకు గడువు పొడిగించారు.

గడువు తేదీని పొడిగించాలని సంబంధిత వ్యక్తుల నుంచి వచ్చిన వినతులను దృష్టిలో ఉంచుకుని.. అర్హత కలిగిన ప్రస్తుత ఉద్యోగులుగతంలో పదవీ విరమణ చేసినవారుగతంలో పదవీ విరమణ చేసి మరణించిన వారి చట్టబద్ధమైన జీవిత భాగస్వాములు యూపీఎస్ ఎంపికను వినియోగించుకోవడం కోసం మరో మూడు నెలలు అంటే 2025 సెప్టెంబరు 30 వరకు గడువు పొడిగించారు.

 

***


(रिलीज़ आईडी: 2139071) आगंतुक पटल : 49
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Malayalam