జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్ చిత్తూరులో అప్పు తీర్చని వ్యక్తి భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించిన వడ్డీ వ్యాపారి కేసును సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్


రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ, డీజీపీకి ఆదేశాలు

నాడు పోస్టు చేయడమైనది: 20 JUN 2025 2:42PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకుప్పం మండలంనారాయణపురం గ్రామంలో మహిళపై దాడికి సంబంధించి జూన్ 16న వెలువడ్డ వార్తను జాతీయ మానవహక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించిందిభర్త చేసిన అప్పును చెల్లించని కారణంగా అతని భార్యను చెట్టుకు కట్టేసిపదుగురి ఎదుట కొట్టినట్లుఆమెను గ్రామస్తులు విడిపించినట్లు మీడియా కథనం.

కథనం నిజమే అయి ఉంటేదీనిని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించవలసి ఉంటుందని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసిందిఇందుకు సంబంధించి రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీడీజీపీకీ ఆదేశాలు జారీ చేసింది.

జూన్ 17న వెలువడ్డ మరో కథనం ప్రకారం... బాధితురాలి భర్త స్థానిక వడ్డీ వ్యాపారి వద్ద నుంచి రూ. 80,000ను అప్పుగా తీసుకున్నాడనిమూడేళ్ళు గడిచినా అప్పు తీర్చలేదనిగ్రామంలోని మరి కొందరి వద్ద కూడా అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేని స్థితిలో అతను గ్రామాన్ని విడిచి వెళ్ళిపోగామహిళ రోజువారీ కూలిగా మారి తన ముగ్గురి పిల్లల బాధ్యతను స్వీకరించిందని తెలుస్తోందివాయిదాల్లో అప్పును తీర్చివేయడం మొదలు పెట్టిందని వార్త తెలిపింది.  

 

***


(రిలీజ్ ఐడి: 2137998) సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil