పర్యటక మంత్రిత్వ శాఖ
కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో ఇండియా టూరిజం ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం-2025’ ‘‘యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్’’కు మద్దతు
Posted On:
19 JUN 2025 4:24PM by PIB Hyderabad
భారతదేశ చిరకాలిక శ్రేయో వారసత్వాన్ని, ప్రపంచ క్షేమానికి భారత్ కట్టుబాటునూ పండుగ చేసుకోవడంలో భాగంగా, భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఇండియా టూరిజమ్ ఒక భారీ యోగా కార్యక్రమాన్ని ఈ నెల 21న నిర్వహించనుంది. ఈ కార్యక్రమం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా ప్రసిద్ధి చెందిన కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లోని ప్రతిష్ఠాత్మక సన్ డయల్ పచ్చిక బయళ్లలో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్య జరగనుంది.
ఈ సంవత్సరం ప్రపంచ ఇతివృత్తంగా ఎన్నుకొన్న ‘‘యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ మానవ క్షేమానికీ, పర్యావరణ సమతౌల్యానికీ విస్తారమైన బంధం ఉందని స్పష్టం చేస్తోంది. యోగాను శారీరక జీవశక్తికీ, మానసిక స్పష్టతకూ, మనోద్వేగ ప్రశాంతితో పాటు ఆధ్యాత్మిక క్రమబద్ధతకూ తోడ్పడే ఒక శక్తిమంతమైన సాధనంగా యోగా అనే భావనను పెంపొందిస్తారు. ఇవన్నీ కూడా ఒక ఆరోగ్యప్రదమైన, దీర్ఘకాలం పాటు మనుగడ సాగించగల ప్రపంచాన్ని సంరక్షించుకోవడానికి అత్యవసరం.
హాజరవుతారని భావిస్తున్న ప్రముఖుల్లో:
• శ్రీ గజేంద్ర సింగ్ యాదవ్, శాసనసభ గౌరవనీయ సభ్యుడు (ఎమ్ఎల్ఏ)
• శ్రీ లక్షయ్ సింఘల్, ఐఏఎస్, జిల్లా మేజిస్ట్రేట్, దక్షిణ ఢిల్లీ
• ప్రియాంగ విక్రమసింఘె, డిప్యూటీ హై కమిషనరు, శ్రీ లంక దౌత్య కార్యాలయం
• వత్సల అమరసింఘె, మినిస్టర్ కౌన్సెలరు, శ్రీ లంక దౌత్య కార్యాలయం
• మలేసియా నుంచి విచ్చేసే విశిష్ట అతిథులు.. ఉన్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రముఖ యోగా గురు శ్రీ గోపాల్ రుషితో పాటు ఆయన బృందం నిర్వహించనున్నారు. శారీరక బలం, మానసిక శ్రేయంలతో పాటు ఆంతరంగిక శాంతిలను పెంపొందించడానికి ఉద్దేశించిన సంపూర్ణ యోగాభ్యాసాల వరుసను సూచిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మార్గదర్శకత్వం వహిస్తారు.
భాగస్వామ్యం-సహకారం:
ఈ కార్యక్రమంలో 400 మంది ఉత్సాహంగా పాలుపంచుకొనే అవకాశం ఉంది. వారిలో:
ఇండియన్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (ఐఏటీఓ) సభ్యులు
ఇండియా డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (ఏడీటీఓఐ)
ఇండియా ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ (టీఏఏఐ)
ప్రాంతీయ స్థాయి పర్యాటక గైడ్లు, యువ టూరిజం క్లబ్బులకు చెందిన విద్యార్థులతో పాటు హోటల్ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్ల (ఐహెచ్ఎంల) విద్యార్థులు
భారత పురావస్తు సర్వే సంస్థ (ఏఎస్ఐ), పర్యాటక శాఖలకు చెందిన అధికారులతో పాటు స్థానిక పౌరులు.. ఉంటారు.
పర్యాటక రంగంలో కీలక ఆసక్తిదారులు, పరిశ్రమకు చెందిన వృత్తినిపుణులతో పాటు విద్యార్థులు చురుకుగా పాలుపంచుకోవడం పర్యటన, సాంస్కృతిక పరిరక్షణలతో వెల్‌నెస్‌ను సంధానించాలన్న విశాల నిబద్ధతకు అద్దం పడుతోంది.
వారసత్వ స్థలాల వద్ద యోగా - ప్రపంచానికో సందేశం:
చరిత్రాత్మకమైన కుతుబ్ మినార్ నేపథ్యంలో యోగా దినోత్సవ సంబంధిత కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే అది భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయాల వారసత్వమూ, నాయకత్వమూ తరతరాలుగా నిలిచి ఉందనీ, భారత్ నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ కార్యక్రమం వెల్‌నెస్ టూరిజానికి భారత్ తనను తాను ఒక ప్రపంచ కూడలి (గ్లోబల్ హబ్)గా నిలదొక్కుకోవాలనే తపనను సూచిస్తోంది.
***
(Release ID: 2137744)
Visitor Counter : 2