ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేశం స్వయంసమృద్ధిని పటిష్టపరుచుకొంటున్న వేళ.. యువత నాయకత్వంలో సాంకేతిక నవకల్పన జోరుగా సాగుతోందంటూ ప్రధానమంత్రి ప్రశంసలు


* ‘డిజిటల్ ఇండియా’ గత 11 ఏళ్లుగా ప్రజా జీవనంలో మార్పులు తెచ్చిందని ప్రధానంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 12 JUN 2025 10:00AM by PIB Hyderabad

సాంకేతిక శక్తికి ఉన్న సామర్థ్యాన్ని ఇంతలంతలుగా విస్తరింప చేయడంతో పాటు భారత్  స్వయంసమృద్ధిని రోజురోజుకూ పెంచడంలో మన దేశ యువ నూతన ఆవిష్కర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసలు కురిపించారు. గత 11 సంవత్సరాల్లో, నవకల్పన మాధ్యమ శక్తిని మన యువతీయువకులు గణనీయ స్థాయిలో వినియోగించుకొనేటట్లుగా చూడడం ఒక్కటే కాకుండా, ప్రపంచంలో సాంకేతిక మహాశక్తిగా ఇండియా స్థానాన్ని కూడా ‘డిజిటల్ ఇండియా’ బలోపేతం చేసిందని ఆయన అన్నారు.

గత 11 సంవత్సరాలలో సాంకేతిక శక్తిని సద్వినియోగపరుచుకోవడం భారతదేశ ప్రజానీకానికి ఎన్నెన్నో ప్రయోజనాలను కలగజేసిందని కూడా శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. సేవల అందజేతకు, పారదర్శకత్వానికి ఎనలేని ఊతం లభించిందని ఆయన తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో మైగవ్ఇండియా (MyGovIndia) పొందుపరిచిన కొన్ని పోస్టులకు శ్రీ మోదీ స్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘భారత్ యువ శక్తి అండదండలతో నవకల్పనలోనూ, సాంకేతికత వినియోగంలోనూ గొప్ప పురోగతిని మనం సాధిస్తున్నాం. స్వయంసమృద్ధి యుక్త దేశంగా, సాంకేతిక రంగంలో ప్రపంచంలోనే ఓ మహాశక్తిగా మారాలన్న మన ప్రయత్నాలను కూడా ఇది బలపరుస్తోంది.  
#11YearsOfDigitalIndia’’

‘‘సాంకేతిక శక్తి సద్వినియోగంతో ప్రజలకు లెక్కలేనన్ని ప్రయోజనాలు అందాయి.  సేవల అందజేతతో పాటు పారదర్శకత్వానికి ఎంతో ఊతం లభించింది. దీనికి తోడు, సాంకేతికత నిరుపేదల జీవనానికి సాధికారతను సమకూర్చే సాధనంగా మారింది.
#11YearsOfDigitalIndia’’

 

***


(रिलीज़ आईडी: 2135884) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali-TR , Odia , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam